తెలంగాణ

పిల్లల్లో కంటి సంరక్షణ వారోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: చిన్న పిల్లల్లో దృష్టి లోపం (మయోపియా) పెరుగుతుండడం పట్ల కంటి వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఎల్‌వీ ప్రసాద్ ఆసుపత్రిలో పిల్లల కంటి సంరక్షణ వారోత్సవాన్ని నిర్వహించారు. వైద్య నిపుణలు మాట్లాడుతూ పిల్లలు గంటల తరబడి కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు చూస్తుండడం వల్ల దృష్టిలోపం ఏర్పడుతోందని అన్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ వ్యాధి ముదురుతుందని హెచ్చరించారు. 2050 సంవత్సరానికి ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది అంటే 5 బిలియన్ల మంది మయోపియోనికి గురవుతారని తెలిపారు. దీనిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ నెల 11వ తేదీన పిల్లల నేత్ర సంరక్షణపై నడక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎల్‌వీ ఫౌండర్- చైర్మన్ గులపల్లి ఎన్ రావుతెలిపారు.