తెలంగాణ

నకిలీ డిగ్రీ సర్ట్ఫికెట్ల రాకెట్... గుట్టురట్టు చేసిన టాస్క్‌పోర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* విదేశాల్లో ఉద్యోగాలు పొందిన 200 మంది * ఒక్కో సర్ట్ఫికెట్ కోసం రూ.50 నుంచి 60 వేలు వసూలు
* జస్ట్‌వీసా కన్సల్టెంట్.. రైజర్ ఆర్గనైజెషన్ పేర్లతో దగా * హైదరాబాద్ పోలీస్ కొత్వాల్ అంజనీ కుమార్ వెల్లడి
హైదరాబాద్, నవంబర్ 13: నకిలీ డిగ్రీ సర్ట్ఫికెట్లను అసలు సర్ట్ఫికెట్లుగా ఎరజూపి విదేశీ ఉద్యోగాల పేరిట యువతను మోసంచేస్తూ కోట్ల రూపాయలను దండుకున్న ముఠా గుట్టును టాస్క్‌పోర్సు పోలీస్‌లు చేధించారు. దీంతో జస్ట్ వీసా కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటీడ్, రైజర్ ఆర్గనైజేషన్ కన్సల్టెన్సీ పేర్లుతో యువతను పెడదోవ పట్టిస్తూ వారి నుంచి అందినకాడికి దండుకుంటున్న ముఠా మోసాలకు తెరపడింది. కేసు పూర్వాపరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. విదేశాల్లో ఉన్నత విద్యావకాశాలు, ఉపాధి, ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతను నమ్మంచారని, విదేశీ యూనివర్శిటీల్లో ఎక్కువ మార్కులు ఉంటే సీట్లు దొరుకుతాయని నమ్మబలికి అందుకు ఐ-20 నకిలీ సర్ట్ఫికెట్లను కూడా రూపొందించారని ఆయన తెలిపారు. దాదాపు 20 విభాగాలకు సంబంధించిన ఉద్యోగాలకు సిఫార్స్ లేఖలను కూడా తయారు చేశారన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కన్సల్టెంట్ వ్యవస్థలతో సంప్రదించేందుకు, సులువుగా విదేశాలకు వెళ్లడానికి ‘జస్టు వీసా’ ఉంటే చాలంటూ మోసపూరితమైన ప్రకటనలు చేస్తూ యువతీ యువకుల నుంచి కోట్ల రూపాయలు దండుకున్నారని ఆయన చెప్పారు. దాదాపు 200 మందికి పైగా ఈ నకిలీ సర్ట్ఫికెట్లు పొంది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నట్లు విచారణలో తేలిందని చెప్పారు. విదేశాల్లో పనిచేస్తున్న వ్యక్తులు ఇక్కడ ఉన్న యువకులకు నకిలీ సర్ట్ఫికెట్ల గురించి సమాచారాన్ని, సంబంధిత ఏజెన్సీల వివరాను పంపించారని, ఇలా వారి మాయలో పడిన ఒకొక్కరి నుంచి రూ 60 వేల వంతున వసూలు చేశారన్నారు. జూలుకుంట శ్రీకాంత్‌రెడ్డి జస్ట్ వీసా కన్సల్టెంట్‌తో పాటు ఇండో-యూరోపియన్ ఎడ్యుకేషన్ పౌండేషన్‌ను కూడా ఏర్పాటు చేయగా, రైజర్ ఆర్గనైజేషన్‌ను మహమ్మద్ అతీక్ ఉర్ రెహ్మాన్ ఏర్పాటు చేశారన్నారు. ఈ ఇద్దరు నిందితులు మరి కొంతమందిని చేరదీసి తమ నకిలీ వ్యాపారాన్ని సాగించారని అంజనీ కుమార్ వివరించారు. డిగ్రీ చదువుతూ మధ్యలో చదువుమానేసిన యువకులతో పాటు డిగ్రీలో ఫెయిల్ అయిన వారిని వీరు చేరదీసి మాయలోపడేశారన్నారు. దేశంలోని పలు యూనివర్శిటీల పేర్లతో ముంద్రించిన దాదాపు 600 నకిలీ డిగ్రీ సర్ట్ఫికెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే నకిలీ మార్కు మెమోలు, మైగ్రేషన్, ప్రొవిజనల్ సర్ట్ఫికెట్లను సైతం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అంతేగాక 32 ఇండియన్ పాస్టుపోర్టులు, 89 బ్యాంక్ లెటర్స్, 73 విజిటింగ్ కార్డులు, నకిలీ పత్రాలను తయారు చేయడానికి వినియోగించే మిషన్లు, 96 రబ్బర్ స్టాంపులు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, బ్లాక్ అండ్ కలర్ ప్రింటర్లను, 24 నకిలీ రెకమెండేషన్ బ్యాంక్ స్టేట్‌మెంట్లు, లెటర్లు. 25 ఐఈఎల్‌టీఎస్ సర్ట్ఫికెట్లు, పేపర్ కటింగ్ మిషన్లు, ఖాళీ బాండ్ పేపర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.