తెలంగాణ

కలహాల కూటమితో అభివృద్ధి అసాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 14: మహాకూటమి కూర్పు, సీట్ల కేటాయింపు దశలోనే పేచిలు పెట్టుకున్న కలహాల కూటమికి అధికారం అప్పగిస్తే తెలంగాణ అభివృద్ధి అసాధ్యమని ప్రజలు సుస్ధిర, సమర్ధ పాలన కోసం మరోసారి కేసీఆర్ ప్రభుత్వానికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్ధి కంచర్ల భూపాల్‌రెడ్డి, పార్టీ ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవిందర్‌రావు, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డిలతో కలిసి ఆయన నల్లగొండలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కూటమి పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు అసాధ్యమని కూటమి ప్రయోగం విఫలం కానుందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే జానారెడ్డి తనతో పాటు తన కుమారుడికి టికెట్ కోరారని, ఉత్తమ్ పద్మావతి దంపతులు ఇరువురికి, కోమటిరెడ్డి బ్రదర్స్‌కు, వారి అనుఛరుడు చిరుమర్తి లింగయ్యకు టికెట్లు తీసుకున్నారని, జిల్లాలో మరో స్థానంలో మహాకూటమి నుండి బీసీలకు సీటు ఇచ్చేందుకు చేతులు రాలేదన్నారు. ఈ దఫా ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాల దెబ్బకు జిల్లా కాంగ్రెస్ సీనీయర్లు జానా, కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర్‌రెడ్డిలకు ఓటమి తధ్యమన్నారు. నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓడిపోనున్నారని, ఉమ్మడి జిల్లాలో పనె్నండు స్థానాలు టీఆర్‌ఎస్ గెలిచే అవకాశాలున్నాయన్నారు.