తెలంగాణ

అది మాయగాళ్ల కూటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాన్సువాడ రూరల్, నవంబర్ 14: ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకోవడానికి మహాకూటమి పేరిట మాయగాళ్లు తయారయ్యారని, వారి మాటలను పట్టించుకోకుండా టీఆర్‌ఎస్ పార్టీ సైనికులు భారీ మెజార్టీయే లక్ష్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర ఆపద్ధర్మ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అనుచర గణానికి పిలుపునిచ్చారు. మంగళవారం నామినేషన్ వేసేందుకు బయలుదేరే ముందు ఆయన తన తల్లి వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలు మార్గదర్శకాలకు లోబడి నడుచుకోవాలని, గ్రామాల్లో ఏర్పాటు చేసే సమావేశాలు నిండుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. రైతులు ప్రస్తుతం పంట దిగుబడులను అమ్ముకుని ఖాళీగా ఉంటారని, ఇలాంటి సమయంలో రైతులందరు పార్టీ సమావేశాలకు హాజరయ్యేలా నాయకులు చూసుకోవాలన్నారు. కారు గుర్తుకు ఓటు వేయాలనుకునే ప్రతీ ఓటరును పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు సమాయాత్తం కావాలన్నారు. అరవై మందికి ఓ పోలింగ్ బూత్ ఇన్‌చార్జీని నియమించడం జరిగిందని, వారందరు తమకు అందించిన సర్వే రిపోర్టులను వెంటనే సమర్పించాలని సూచించారు. సీఎం కేసీఆర్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల నియమావళికి లోబడి కేవలం 28లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేసే అవకాశం ఉన్నందున నాయకులు, కార్యకర్తలు నిబంధనలను తప్పకుండా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వారం రోజుల్లోనే బాన్సువాడలో సీఎం కేసీఆర్ బహిరంగ సభను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందన్నారు. సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 42 వేల కోట్లతో అన్ని రంగాలను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణాను మొదటి స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. 21 వేల గ్రామాలకు స్వచ్ఛమైన మంచినీటిని అందించామని, 25వేల కోట్లతో బ్రిడ్జీల నిర్మాణం చేపట్టామని, 70శాతం రైతులకు ఉచిత విద్యుత్తును అందించడం జరిగిందన్నారు. 23్భరీ నీటి ప్రాజెక్టులు, 12 మద్య తరహా ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టామని, 663రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి తోడ్పాటు నందించినట్లు పోచారం వివరించారు. నిరుపేదలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా నూతనంగా వైద్యశాలలను ఏర్పాటు చేసి కావాల్సిన మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించామని, సేవలందించేందుకు తగినంత సిబ్బంది నియమించడం జరిగిందన్నారు.

కలిసొచ్చిన 7007 అంబాసిడర్ కారు
రాజకీయ రంగంలో అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకు రాష్ట్ర పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఏటీజే 7007 నంబర్ గల అంబాసిడర్ కారు తిరుగులేని అదృష్టం రూపంగా కలిసొచ్చింది. ఎప్పుడు ఏ ఎన్నికల్లో నామినేషన్ వేయాలన్నా, పోచారం ఆ కారులోనే వెళ్లడం ఆనవాయితీగా మార్చుకున్నారు. దానిని పాటిస్తూ ఈసారి ఎన్నికల్లోనూ అదే కారులో వెళ్లి నామినేషన్ వేశారు. పోచారం ఏ వాహనం కొనుగోలు చేసినా దాని నెంబర్ 7007గా ఏరికోరి మరీ పెట్టుకోవడం వెనుక ఆ నెంబర్ తనకు లక్కీ నెంబర్‌గా నిలుస్తుందని ఆయన గట్టిగా నమ్ముతారని తెలుస్తోంది. రాజకీయాల్లో అడుగుపెట్టిన సమయంలో తనకున్న మెటార్ సైకిల్ నెంబర్ కూడా 7007గా ఉండటంతో నాడు సొసైటీ చైర్మెన్‌గా విజయం సాధించారు.