తెలంగాణ

రాజీనామా పచ్చి అబద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: టీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణ టీఆర్‌ఎస్‌లో కలకలం సృష్టించింది. తాము టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయనున్నట్టు వచ్చిన వార్తలను చేవేళ్ల ఎంపీ కొండా విశే్వశ్వర్‌రెడ్డి, మహబూబాద్ ఎంపీ సీతారామ్ నాయక్ తీవ్రంగా ఖండించారు. పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారం పచ్చి అబద్ధమని ఎంపీ విశే్వశ్వర్‌రెడ్డి ఓ ప్రకటలో స్పష్టం చేశారు. మరో టీఆర్‌ఎస్ ఎంపీ సీతారామ్‌నాయక్ తెలంగాణ భవన్‌లో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్రంగా ఖండించారు. రేవంత్‌రెడ్డి కావాలనే తనపై కొంతకాలంగా దుష్ప్రచారం చేస్తున్నారని విశే్వశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఆయన స్వయంగా ప్రగతి భవన్‌కు వెళ్లి మంత్రి మంత్రి కేటీఆర్‌ను కలిసి తనపై జరగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వివరించారు. టీఆర్‌ఎస్‌కు అండగా ఉన్న బలమైన నాయకులను రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా చేసుకొని మైండ్ గేమ్ ఆడుతున్నారని ఎంపీ సీతారామ్ నాయక్ విమర్శించారు.
తనపై మరోసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే కేసు వేస్తానని ఆయన హెచ్చరించారు. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే టీఆర్‌ఎస్‌లో చేరబోయే ఎంపీలు ఎవరో పేర్లు బయటపెట్టాలని నాయక్ డిమాండ్ చేశారు. దివంగత ప్రొఫెసర్ జయశంకర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నానని, ఆ విషయాన్ని గుర్తించే తనను ఎంపీ చేసిన టీఆర్‌ఎస్‌ను వీడాల్సిన అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు.