తెలంగాణ

గీతం విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్, విశాఖపట్టణం, బెంగళూరు ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ స్లైడింగ్ విధానంలో కౌనె్సలింగ్ ప్రారంభమైంది. సీట్ల కేటాయింపు ప్రక్రియ 19వ తేదీ వరకూ జరుగుతుందని అదనపు ఉప కులపతి ఎన్ శివప్రసాద్ చెప్పారు. గీతం ప్రవేశపరీక్షలో ఈ ఏడాది టాపర్‌గా నిలిచిన యశ్వంత్ ములకల బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిగ్రీని ఎంచుకోగా, నడింపల్లి హరిణి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్‌లో చేరింది.
యూనివర్శిటీ ఆఫ్ డిజైన్ ఒప్పందం
యుజీసీ గుర్తింపు పొందిన వరల్డ్ యూనివర్శిటీ ఆఫ్ డిజైన్ తాజాగా యుకే, కెనడా, ఫ్రాన్స్‌లోని ఆరు అంతర్జాతీయ యూనివర్శిటీలతో వరల్డ్ యూనివర్శిటీ ఆఫ్ డిజైన్ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న వాటిలో యూనివర్శిటీ ఆఫ్ హుడర్స్‌ఫీల్డు, ఆక్స్‌ఫర్డు బ్రూక్స్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ ద వెస్టు ఆఫ్ స్కాట్లాండ్, ఎమిలీ కార్ వి యూనివర్శిటీ, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్శిటీ, వాన్కోవర్ ఫిల్మ్ స్కూల్ ఆఫ్ కెనడా సంస్థలున్నాయి.
10న స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రవేశపరీక్ష
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్శిటీరలో బిఇడి, బిఇడి స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులకు జూన్ 10న ప్రవేశపరీక్షను నిర్వహించనున్నట్టు వర్శిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్‌లైన్ దరఖాస్తు గడువును జూన్ 2వ తేదీ వరకూ పొడిగించారు. బిఇడి ప్రవేశపరీక్ష 10వ తేదీ ఉదయం 10 నుండి 12.30 వరకూ జరుగుతుందని, స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రవేశపరీక్ష మధ్యాహ్నం 2 నుండి 4 వరకూ జరుగుతుందని చెప్పారు.
23న ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షలు
తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహిస్తున్న ఎక్సైజ్ కానిస్టేబుల్స్ ఎంపిక శారీర దారుఢ్య పరీక్షలను ఈ నెల 23న నిర్వహించనున్నట్టు కమిషన్ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. 23న ఉదయం 5 గంటలకు శామీర్‌పేట ఒఆర్‌ఆర్ నుండి మునీరాబాద్ ఒఆర్‌ఆర్ సర్వీసు రోడ్డు వరకూ జరుగుతుందని కమిషన్ పేర్కొంది. అనంతరం ఒరిజినల్ సర్ట్ఫికెట్ల పరిశీలన ఉంటుందని అధికారులు చెప్పారు.
ప్రశాంతంగా ఎల్పీసెట్
ఎల్పీసెట్‌ను బుధవారం నాడు ప్రశాంతగా నిర్వహించినట్టు పాఠశాల విద్య కమిషనర్ కిషన్ చెప్పారు. తెలుగు పండిట్ కోర్సునకు 2429 మంది రిజిస్టర్ చేసుకోగా, 1989 మంది హాజరయ్యారని, ఉర్దూ పండిట్ కోర్సునకు 63 మంది రిజిస్టర్ చేసుకోగా, 54 మంది హాజరయ్యారని, హిందీ పండిట్ కోర్సునకు 1753 మంది రిజిస్టర్ చేసుకోగా 1478 మంది హాజరయ్యారని తెలిపారు.