తెలంగాణ

అధిక ధరలకు అమ్మేవారిపై రైల్వే కనె్నర్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: రైళ్లు, రైల్వే స్టేషన్లలో అధిక ధరలకు ఆహార పదార్ధాలను విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ హెచ్చరించారు. క్యాటరింగ్ విభాగం పనితీరుతో పాటు భోజనం, అల్పాహారం, స్నాక్స్ ఇలా అన్నింటా నాణ్యత పాటించడంతో పాటు నిర్ణయించిన ధరలకు మాత్రమే విక్రయించాలి తప్ప అదనంగా విక్రయిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రైల్వే మంత్రి పియూష్‌గోయల్ ఆదేశాల మేరకు గత ఏడాది సెప్టెంబర్ 14 నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహించిన డెకాయ్ తనిఖీల్లో అదనపు ధరలకు అమ్మడం, నాణ్యత, కొలత తక్కువగా ఉండడం వంటి విషయాల్లో 3738 మందిని పట్టుకున్నట్లు జిఎం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా 1016 కేసులను నమోదు చేసి వారి నుంచి రూ.87,14,330 మొత్తాన్ని జరిమానాగా విధించినట్లు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఇలా అక్రమాలకు పాల్పడుతున్న చిరు వ్యాపారులు కొంతమందిని తీసుకువచ్చి వారికి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు చెప్పారు. గత ఏడాది నవంబర్ 16, డిసెంబర్ 4, ఈ ఏడాది మార్చి 23 తేదీల్లో కౌన్సిలింగ్ నిర్వహించి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైల్వేలో అధికంగా ఆహార వస్తువులు అధిక ధరలకు అమ్ముతున్నట్టు వస్తున్న ఫిర్యాదులపై స్పందించి పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనిలో భాగంగా డివిజన్, గ్రూప్ జనరల్ మేనేజర్‌కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారం చేస్తే వారి లైసెన్సు రద్దు చేయాలని స్పష్టం చేశామని తెలిపారు. లైసెన్సు మంజూరుకు ముందు వీరందరికీ కావాల్సినంత సమయం ఇచ్చి, నిబంధనలు పాటించే విధంగా వివరించడం జరుగుతోందని చెప్పారు. అయినప్పటికీ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతుండడంతో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
22 వేసవి ప్రత్యేక రైళ్లు
వేసవి రద్దీ దృష్ట్యా 22 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ద.మ.రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్-బికనీర్ మధ్య ఈ నెల 20, 27, జూన్ 3, 10, 17, 24, జూలై 1, 8, 15, 22, 29ననడుపుతున్నట్లు వెల్లడించింది. తిరుగు ప్రయాణంలో బికనీర్ నుంచి ఈ నెల 22, 29, జూన్ 5, 12, 19, 26, జూలై 3, 10, 17, 24, 31 తేదీల్లో నడుపుతున్నట్లు తెలిపింది.