ఆంధ్రప్రదేశ్‌

మరోవిడత భూసేకరణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 31: రాజధానిలో మరోవిడత భూసేకరణకు రంగం సిద్ధమైంది. భూసమీకరణ ద్వారా ఇప్పటివరకు 33వేల 500 ఎకరాలను రైతులు ప్రభుత్వానికి అందించారు. అయితే మంగళగిరి నియోజకవర్గంతో పాటు తుళ్లూరు మండల పరిధిలోని మరికొందరు రైతులు సమీకరణను వ్యతిరేకించటంతో ప్లాట్ల కేటాయింపు, అభివృద్ధి పనులకు స్థలాలు, రాజధాని నిర్మాణం, తదితర అంశాల్లో ప్రభుత్వానికి ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. ఒకేచోట భూములు లేనందున స్థలాల మంజూరు అంశం వివాదాస్పదంగా మారుతోంది. దీంతో భూసేకరణకు వెళ్లక తప్పదని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని ప్రభుత్వ భవనాలకు శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం గ్రామాల్లోనే సమీకరణ ఇంకా పూర్తికాలేదు. ఈ గ్రామాల్లో ఇంకా 200 ఎకరాలకు పైగా సేకరణ జరిపితేకానీ సింగపూర్ మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా నిర్మాణాలు రూపుదిద్దుకోవు. రాజధాని అభివృద్ధిలో భాగంగా వివిధ ప్రపంచ స్థాయి సంస్థలకు ప్రభుత్వం భూకేటాయింపులు జరుపుతోంది. ఇండో-యుకె ఆసుపత్రితో పాటు ఎయిమ్స్, వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(విట్), అమృత విశ్వవిద్యాలయం, తదితర ఉన్నత విద్యాసంస్థలు ఏర్పాటు కానున్నాయి. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో కొందరు రైతులు సమీకరణకు నిరాకరించారు. మంగళగిరి నియోజకవర్గం నిడమర్రు, ఎర్రబాలెం, పెనుమాక, తాడేపల్లి, ఉండవల్లి, ఐనవోలు, శాఖమూరు గ్రామాలతో కలుపుకుని మొత్తంగా 2 వేల ఎకరాల సేకరణ జరిపితే కానీ రాజధాని అభివృద్ధి, రోడ్ల ఏర్పాటు సాధ్యపడదని సీఆర్డీఏ అధికారులు చెపుతున్నారు. దీంతో సేకరణలో భాగంగా గ్రామాల్లో సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహిస్తున్నారు. ఉద్దండరాయనిపాలెం గ్రామంలో ఇటీవల నిర్వహించిన సర్వేలో రైతులు రాజధానికి భూములిచ్చేదిలేదని కరాఖండిగా తేల్చిచెప్పారు. దీంతో అధికారులు మమ.. అనిపించి నోటిఫికేషన్‌కు కసరత్తు జరుపుతున్నట్లు తెలిసింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం గ్రామాల్లో 85 శాతం ప్రజలు అంగీకరించినా, లేకపోయినా కనె్సంట్ ఇచ్చినట్లు పంచాయతీ వద్ద నుంచి పత్రాలు తీసుకుని సేకరణ జరపాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. స్విస్ ఛాలెంజ్ పద్ధతిపై వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున మిగిలిన ప్రాంత అభివృద్ధికి సంబంధించి గత కొద్దిరోజులుగా సీఆర్డిఏ విద్యా, వ్యాపార, వాణిజ్యవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తోంది.