రాష్ట్రీయం

ఆర్థిక సంస్కరణలతో సంక్షోభంలో వ్యవసాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 13: దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత వ్యవసాయ రంగం ప్రాధాన్యత కోల్పోయిందని, సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి గోపాల గౌడ అన్నారు. శనివారం ఇక్కడ అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఎఐఎల్‌యు) రాజ్యాంగంపై ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎఐఎల్‌యు వ్యవస్థాపకుడు ఎ.అనంతరెడ్డి స్మారకోపన్యాసాన్ని జస్టిస్ గౌడ ఇచ్చారు. భారతదేశం గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తోందని, 70 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. భూసేకరణలో అనుసరిస్తున్న విధానాల వల్ల రైతు జీవితం విచ్ఛిన్నమవుతోందన్నారు. రైతాంగ సంక్షేమ విధానాలను ప్రభుత్వాలు అమలు చేయాలన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల అమలుపై నిఘా ఉండాలన్నారు. సామాన్య ప్రజల హక్కులను కాలరాయడం చట్టవిరుద్ధమన్నారు. ప్రతి పౌరుడి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనన్నారు. ఈ విషయమై ప్రభుత్వాలు సమీక్షించాలన్నారు. గ్రామీణ ప్రాంతం అభివృద్ధి పట్ల వివక్ష తగదన్నారు. ఎన్నికల ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలన్నారు.

శనివారం హైదరాబాద్‌లో ఎఐఎల్‌యు జాతీయ
సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తున్న
సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ