విజయనగరం

వీధికుక్కల నియంత్రణపై చర్యలేవి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*మున్సిపల్ కమిషనర్లపై కలెక్టర్ ఆగ్రహం
విజయనగరం, డిసెంబర్ 22: కుక్కకాటు సంఘటనలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న కారణంగా జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో వీధికుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని తెలిపినా మున్సిపల్ కమీషనర్లు శ్రద్ధ చూపకపోవటంపై కలెక్టర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేసారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీ కమీషనర్లు, పశుసంవర్థకశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీధికుక్కల విషయం ప్రస్తావనకు వచ్చిన సందర్భంలో వీధికుక్కల నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని, వాటికి ఆపరేషన్లు నిర్వహించటం ద్వారా ప్రజల ఇబ్బందులను తొలగించాలని గతంలో పలుమార్లు తెలిపినా కమీషనర్లు పట్టించుకోకపోవటాన్ని తప్పుపట్టారు. అధికారుల లెక్కల ప్రకారమే జిల్లాలో 64844 వీధికుక్కలు ఉన్నాయని, వీటికి త్వరగా కుటుంబ నియంత్రణ జరిపించటం ద్వారా వీధికుక్కల సంఖ్యను అరికట్టాలని ఆదేశించారు. మున్సిపాలిటీల పరిధిలో జరుగుతున్న మురుగుకాలువలు, సిసి రోడ్లు, డంపింగ్ యార్డుల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని తెలిపారు. 13,14వ ఆర్థిక సంఘం నిధులు నిర్ధేశించిన పనులకు వెంటవెంటనే ఖర్చు చేయాలని అన్నారు. విజయనగరం పట్టణంలో చేపట్టే రోడ్ల విస్తరణ పనులు వేగవంతం చేయాలని కమీషనర్ నాగరాజును కలెక్టర్ ఆదేశించారు. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీల పరిధిలో మంచినీటి ఎద్దడి ఏర్పడకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణరాజు, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణ, విజయనగరం, సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి, నెల్లిమర్ల మున్సిపల్ కమీషనర్లు పాల్గొన్నారు.

రామానుజన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
విజయనగరం, డిసెంబర్ 22: గణితశాస్తవ్రేత్త శ్రీనివాస రామానుజన్‌ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ పూర్వాధ్యక్షుడు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ వి ఎస్ ప్రసాద్ అన్నారు. మంగళవారం గణితశాస్త్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్ధులతో ఎలియన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ 1887లో జన్మించిన రామానుజన్ గణితశాస్త్ర విశే్లషణ, నెంబర్ థియరీ తదితర వాటిలో గణితమేధావిగా గుర్తింపు పొందారని తెలిపారు. గణితంలో 3900 ఈక్వేషన్లు రూపొందించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఈసందర్భంగా రాష్టస్ధ్రాయి గణిత శాస్తవ్రేత్త , ప్రముఖ గణిత ఉపాధ్యాయుడు గుల్లిపల్లి సూర్యకాంతారావును ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో ఎలియన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ గురుప్రసాద్, భాష్యం స్కూల్ హెచ్‌ఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రాష్టస్థ్రాయి కరాటే పోటీల్లో ప్రతిభ
కొత్తవలస, డిసెంబర్ 22: రాష్టస్ధ్రాయిలో ఈనెల 20న జరిగిన కరాటే పోటీల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభను చూపించారని జిల్లాకరాటే అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మణరావు తెలిపారు. విజయవాడలోని డి ఆర్ ఆర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన పోటీల్లో జిల్లానుండి 20మంది విద్యార్ధులు పాల్గొన్నారని చెప్పారు. అందులో 13మంది విద్యార్ధులు ప్రతిభను కనబరచి మెడల్స్ సాధించారని తెలిపారు. కొత్తవలసకు చెందిన కె.గణేష్‌కుమార్, ఎం. మధు, ఎర్నాయుడులకు సిల్వర్ మెడల్స్, మిగతావారికి బ్రాంజ్ మెడల్స్ వచ్చాయని చెప్పారు.

బొబ్బిలి రైల్వే స్టేషన్‌కు మహర్దశ!
బొబ్బిలి, డిసెంబర్ 22: బొబ్బిలి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మూడు కోట్ల రూపాయలతో ఆధునికీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా రైల్వే అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ జీవన్‌జ్యోతి సాహు మంగళవారం పరిశీలించారు. రైల్వే ఫ్లాట్‌ఫారాలు, కల్యాణమండపం, సిబ్బంది క్వార్టర్స్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైల్వే అధికారులకు పలు సూచనలు, సలహాలు అందించారు. ఇందులో భాగంగా రైల్వే ఫ్లాట్‌ఫారం నిర్మాణ పనులు శరవేగంగా చేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడున్న రైల్వే కల్యాణమండపం ఆధునికీకరించాలని ఆదేశాలు జారీ చేశారు. పైకప్పు మార్చి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాగే మల్లంపేటలో ఉన్న వంద క్వార్టర్ల మరమ్మతులు, ఆధునికీకరణ పనులు శరవేగంగా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రైల్వే సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచినీటి సరఫరా కోసం ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు. ఆదర్శ భవనం ఒకటి నిర్మించాలని కోరారు. ఈ మేరకు ఇన్‌స్పెక్టర్ ఆఫ్ వర్క్స్ అధికారులు రవికుమార్, శ్రీనివాసరావులకు పలు సూచనలు, సలహాలు అందించారు. ఈయనతో పాటు పివొడబ్ల్యూ మోహన్‌సింగ్, రైల్వే అధికారులు, కాంట్రాక్టర్ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

పుష్కలంగా నీరున్నా...సరఫరా సున్నా!
గజపతినగరం, డిసెంబర్ 22: ఆండ్ర రిజర్వాయర్ నిర్మాణంతో సాగునీరు పుష్కలంగా సరఫరా జరుగుతుందని ఆశించిన రైతులకు నిరాశ మిగిలింది. దీనికి కారణం కాలువలు నిర్మాణం పూర్తికాకపోవటమే. రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువుల ద్వారా మెంటాడ, గజపతినగరం, బొండపల్లి మండలాల్లోని సుమారు తొమ్మిదివేల ఎకరాలకు సాగు నీటిని అందించడమే లక్ష్యం. కుడి కాలువ ద్వారా ఎంఎన్ ఛానెల్‌లోకి నీటిని మళ్ళించి సరఫరా చేస్తున్నారు. ఎడమ కాలువ ద్వారా వచ్చే నీటిని మెంటాడ మండలంలోని పొలాలకు హైలెవెల్ కెనాల్ ద్వారా సాగు నీరు సరఫరా కోసం ప్రభుత్వం సుమారు 1.2 కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేసింది. జయతి, కైలాం, చెల్లపేట, ఇద్దనవలస తదితర గ్రామాల మీదుగా నిర్మించాల్సిన హైలెవెల్ కెనాల్ పూర్థిస్థాయిలో నిర్మాణం జరగలేదు. మంజూరైన నిధులు ఏమయ్యాయో తెలియదు. అయితే కాలువ నిర్మాణం జరుగనందున సాగునీరు సరఫరా జరుగలేదు.
రిజర్వాయర్‌కు కేవలం పది కిలోమీటర్ల దూరం కూడాలేని పోరాం, పెదమేడపల్లి, జక్కువ, గురమ్మవలస తదితర గ్రామాల్లోని పొలాలకు సాగునీరు సరఫరా కాక రైతులు వరిపంటను సాగుచేసుకోలేదు. హైలెవెల్ కెనాల్ నిర్మాణాన్ని చేపట్టి తమ పొలాలకు సాగునీటిని సరఫరా చేయాలని సంబంధిత గ్రామాల రైతులు కోరుతున్నారు. గతంలో మంజూరైన నిధుల ఏమయ్యాయో అధికారులు దర్యాప్తు చేయాలని రైతులు కోరుతున్నారు.

దేవస్థానం భూముల్లో మట్టి తవ్వకాలు
* చర్యలు తీసుకుంటామన్న తహశీల్దార్
గజపతినగరం, డిసెంబర్ 22: ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్న వ్యవసాయ భూములను సాగు చేసుకుని జీవించాల్సిన రైతులు, ఆవిధంగా కాకుండా భూముల నుంచి మట్టిని తీసి వ్యాపారం చేసుకుంటున్న సంఘటన పాతశ్రీరంగరాజపురం గ్రామంలో చోటు చేసుకుంది. తహశీల్దార్ ప్రసాద్‌పాత్రోకి అందిన ఫిర్యాదు మేరకు మంగళవారం ఆయన గ్రామంలో గల దేవస్థానం భూములను పరిశీలించారు. పట్టణంలోగల సీతారామ దేవస్థానానికి సంబంధించిన భూములు పాతశ్రీరంగరాజపురంలో 48 ఎకరాలు ఉంది. ఈ భూములను రైతులు ప్రతి ఏడాది లీజుకి తీసుకుని సాగు చేస్తున్నారు. దేవస్థానానికి చెందిన ఈ భూముల నుంచి మట్టిని లీజుకు ఇవ్వడంతో లీజు దారులు మట్టిని తవ్వి ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ మట్టిని 200 రూపాయలకు విక్రయించి, పంటలను సాగు చేయకుండా లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారు. ఈ వ్యవహారంలో భూములను రక్షించాల్సిన విఆర్‌ఓ కూడా భాగస్వామిగా ఉండి, కొంత భూమిని లీజుకు తీసుకుని మట్టిని తవ్వుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తహశీల్దార్ మట్టిని తవ్వుతున్న పొలాలను పరిశీలించి మట్టిని తవ్వుతున్నట్లు నిర్థారించారు. దీనిపై దేవాదాయ అధికారులకు చర్యల తీసుకోవాలని నోటీసులు జారీ చేస్తామని తహశీల్దార్ తెలిపారు. లీజును రద్దు చేయాలని కోరతామని వెల్లడించారు.

గ్రామీణ క్రీడాపోటీల క్రీడాకారుల ఎంపిక
విజయనగరం , డిసెంబర్ 22: చిత్తూరు జిల్లా తిరుపతిలో ఈ నెల 28 నుంచి 30 తేది వరకు శ్రీ శ్రీనివాస క్రీడాప్రాంగణంలో జరిగే గ్రూప్-4 ఆంధ్రప్రదేశ్ రాష్టస్థ్రాయి ఆర్చరీ, హాకీ బాలబాలికల గ్రామీణ క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు వివరాలు చార్ట్-2, అదేవిధంగా గుంటూరు జిల్లా నర్సారావుపేటలో ఈ నెల 27 నుంచి 29 తేది వరకు డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడాప్రాంగణంలో జరగబోవు గ్రూప్-1 రాష్టస్థ్రాయి అథ్లెటిక్స్, ట్వైక్వాండో, వాలీబాల్ క్రీడాపోటీల్లో పాల్గొనే క్రీడాకారులు వివరాలను చార్ట్-1 పొందుపరిచినట్లు జిల్లా క్రీడాప్రాదికార సంస్థ అధికారి వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఈ పోటీలకు ఎంపిక కాబడిన క్రీడాకారులు ఈ నెల 26 తేది ఉదయం 10 గంటలకు జిల్లా క్రీడాప్రాదికార సంస్థ కార్యాలయంలో ఆధార్ జెరాక్స్ కాఫీ, మూడు ఫొటోలు, మూడు పి.ఆర్.ఎఫ్ పత్రాలతో ఫొటోలు, బ్యాంక్ అకౌంట్ జెరాక్స్‌తో హాజరు కావాలి. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు టిఎ, డిఎలతోపాటు క్రీడా దుస్తులు అందజేస్తామని డిఎస్‌డిఓ వెంకటేశ్వరరావు తెలిపారు.

సర్కిల్ కార్యాలయంలో ఎస్పీ తనిఖీలు
చీపురుపల్లి, డిసెంబర్ 22: చీపురుపల్లి సర్కిల్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్కిల్ కార్యాలయం పరిధిలో చీపురుపల్లి, బుధరాయవలస, గరివిడి పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో నేరాలపై ఆయన ఆరా తీశారు. మూడు స్టేషన్‌ల రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో డిఎస్‌పి రమణ, ఇన్‌ఛార్జి సిఐ విజయనాథ్,ఎస్‌ఐలు క్రాంతికుమార్, శ్రీనివాసరావుతదితరులు పాల్గొన్నారు.
బుదరాయవలస పోలీస్ స్టేషన్‌లో..
మెరకముడిదాం: మండలంలోని బుధరాయవలస పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవెల్ మంగళవారం సందర్శించారు. స్టేషన్ లో నిర్వహిస్తున్న అన్ని రికార్డులను పరిశీలించి ఎఫ్‌ఐర్ రేటింగ్‌ను అడిగి తెలుసుకున్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న కేసులు ఏమైనా ఉంటే తక్షణం పరిష్కరించాలని పోలీసు అధికారులను అదేశించారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేఖరులతో ఎస్పీ మాట్లాడుతూ బుదరాయవలస పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్‌రేట్ తక్కువగా ఉందని, రికార్డుల నిర్వాహణ సంతృప్తికరంగా ఉందని అన్నారు. ఈ పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ పోస్టు ఖాళీగా ఉన్న విషయాన్ని విలేఖరులు ఎస్పీతో ప్రస్తావించగా త్వరలో ఎస్సై పోస్టు భర్తీ చేస్తామని చెప్పారు.

27న సాహిత్యసభ
విజయనగరం ,డిసెంబర్ 22: విజయభావన సాహితీ మిత్ర సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 27న గురజాడ స్మారక జిల్లాకేంద్ర గ్రంధాలయంలో సాహిత్య సభ జరుగుతుందని సమాఖ్య ప్రధాన కార్యదర్శి గోపాలరావు మంగళవారం తెలిపారు. ఆనాటి కార్యక్రమంలో ముఖ్యవక్తగా విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ కందాళ కనకమహాలక్ష్మి పాల్గొని 3 ఆధునిక కథాసాహిత్యంలో స్ర్తి పాత్ర చిత్రణ అనే అంశంపై ప్రసంగిస్తారని చెప్పారు. ముఖ్యఅతిధిగా సంగీత కళాశాల ప్రిన్సిపాల్ బురిడి అనురాధ, సన్మాన కర్తగా లలితాశంకర్ పాల్గొంటారని పేర్కొన్నారు. సాహిత్యాభిమానులు పాల్గొనాలని కోరారు.