సబ్ ఫీచర్

పిల్లలను క్రెష్‌లో చేరుస్తున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై, భార్యా, భర్త ఇద్దరూ ఉద్యోగస్థులైతే పిల్లలను క్రష్‌లలో వేయడం నేడు సర్వసాధారణం. తల్లిదండ్రులు, అయిన వాళ్ళకు ఉన్న ప్రేమాభిమానాలు, పిల్లలపట్ల శ్రద్ధ పరులకు ఉండవు అని ఇటీవల టీవీలో చూపిస్తున్న క్రెష్‌లలోని చిన్న పిల్లలమీద దౌర్జన్యంగా కొందరు ప్రవర్తిస్తున్న తీరు నిరూపిస్తోంది.
చిన్న పిల్లలను చితకబాదడం, కాలితో తన్నడం, వాళ్ళు ఏడుస్తున్నకొద్దీ మరింత రెచ్చిపోతూ హింసించడం చూస్తుంటే వీళ్ళు అసలు మనుషులేనా లేక మనిషి రూపంలో వున్న రాక్షుసులా అనిపిస్తున్నది. సిసి కెమెరాలలో రికార్డయిన ఇటువంటి హృదయ విదారకమైన సన్నివేశాలు ఒకటి మరచిపోకముందే మరొకటి కనిపించి ఎంతటివారికైనా మనసును కలచివేస్తున్నాయి. ఏ ప్రాంతం అయినా ఏ దేశంలోని వారయినా పిల్లలు పిల్లలే. తల్లి ఒడిని మించిన భద్రత వాళ్ళకు మరి ఎక్కడా దొరకదు. ఇలాంటి సంఘటనలు జరిగిన తరువాత ఆ తల్లి హృదయం ఎంత తల్లడిల్లిపోతుంది?
అమానుషమైన ఇటువంటి చర్యలు జరగకుండా ఉండాలంటే అత్యవసరమైతే తప్ప చంటిపిల్లల తల్లులు ఉద్యోగాలకు వెళ్లకుండా ఉండటమే మంచిది. కష్టపడేది పిల్లలకోసమే అయినపు వాళ్ళ మనుగడకే ముప్పు ఏర్పడే పరిస్థితులు ఎదురవుతుంటే తల్లులు ఈ విషయంలో పునరాలోచించక తప్పదు.
ఈ రోజుల్లో పసిపిల్లలనే కాదు పెద్ద పిల్లలను కూడా ఆడపిల్ల అయినా మగపిల్లవాడు అయినా తల్లిదండ్రులు వెయ్యి కళ్ళతో కనిపెట్టుకుని ఉండవలసిన పరిస్థితిలో ఉన్నాం. చంటిపిల్లలను క్రెష్, బేబీ సిట్టింగ్స్ లాంటి వాటిలో చేర్చేముందు వాళ్ళ గురించిన అన్ని విషయాలు తెలుసుకుని, వాళ్ళ ప్రవర్తనను గమనించి చేర్పించాలి. కొంతమంది ఇంట్లోనే ఒక పని పిల్లను ఏర్పాటుచేసి పిల్లలను వదిలి వెళుతుంటారు. అయినప్పటికీ కొన్ని జరగరాని సంఘటనలు జరగడం మనం వింటూనే ఉన్నాం.
క్రెష్‌లు నిర్వహించేవాళ్ళు కఠిన స్వభావంగల వాళ్ళను కాకుండా పసి పిల్లలను ఎంతో ఓర్పుతో నేర్పుతో, ప్రేమగా చూడగల వాళ్ళను మాత్రమే వాళ్ళ సంక్షరణకోసం ఏర్పాటుచేసుకోవాలి. ఏదిఏమైనా కన్నబిడ్డలను క్రెష్‌లలో వదిలి ఉద్యోగాలకు వెళ్ళే తల్లులు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం.

-అబ్బరాజు జయలక్ష్మి