సబ్ ఫీచర్

ఆపన్న హస్తాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ డాక్యుమెంటరీ అతడిని మార్చేసింది * పేదలకు ఉచితంగా విద్య, ఉపాధి
సేవామార్గంలో హైదరాబాద్ యువకుడి పయనం

చంద్ర సతీష్ ఫిలిమ్ మేకర్, అసిస్టెంట్ డైరెక్టర్. మనసున్న వ్యక్తి. లఘుచిత్రాలు తీస్తుంటాడు. ఈ సందర్భంగా ఎంతోమంది అనాథలు రోడ్లపై ఉండటం గమనించి ఇలాంటివారి కోసం ఏదైన సాయం చేయాలని భావించాడు. ఫేస్‌బుక్‌లో హెల్పింగ్ హ్యాండ్స్ హ్యూమనిటీ పేరుతో ఫేస్‌బుక్ గ్రూప్‌ను క్రియేట్ చేశాడు. తాను చేయదల్చుకున్న కార్యక్రమాలను అందులో పొందుపరిచాడు. ఎంతోమంది స్పందించారు. సేవ చేసేందుకు ముందుకు వచ్చారు.
ఒకరితో ఆరంభం..
అనాథలకు సేవచేయాలనే సంకల్పం ఒకరితోనే సతీష్ ఆరంభించారు. అమీర్‌పేటలో ఉన్న ఓ అనాథను సమీపంలో ఉన్న సులభ్ కాంప్లెక్స్‌లోకి తీసుకువెళ్లి శుభ్రంగా స్నానం చేయించారు. తరువాత అతడిని మానసికంగా బాగుచేసేందుకు ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చేర్పించారు. ఈ సందర్భంగా పోలీసులు, కోర్టు నుంచి అనుమతి తీసుకోవాల్సి వచ్చింది.
ఇలాంటి సర్వీసు చేయాలంటే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని గ్రహించి పేద
పిల్లలకు చదువు చెప్పే బాధ్యతను తీసుకున్నాడు.
మిషన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్
మిషన్ ఎడ్యుకేషన్ కార్యక్రమం కింద పేద పిల్లలకు చదువ చెప్పే పనికి ఉపక్రమించాడు. ఈ సందర్భంగా ఏడుగురు కార్యకర్తలు ఆయనకు తోడయ్యారు. మియాపూర్, బోరబండ తదితర మురికివాడల్లోని ప్రైవేటు స్కూళ్లల్లో చదువుకునే పేద పిల్లల విద్యార్థులుక ట్యూషన్లు చెప్పటం ప్రారంభించారు. అంతేకాదు మురికివాడల్లోని గవర్నమెంటు స్కూళ్ల పేర్లను నమోదు చేసుకుని వాటికి అవసరమైన వౌలిక వసతులు కల్పించే పనిలో ఉన్నారు. ఇప్పటికే బేగంపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను దత్తత తీసుకుని అక్కడి విద్యార్థులకు కంప్యూటర్ విద్యాబోధనతో పాటు బ్యాగులు, పుస్తకాలు, మంచినీటి వసతి కల్పించారు. అంతేకాదు మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఇటీవలనే 28 మంది మహిళలకు టెక్స్‌టైల్ రంగంలో శిక్షణ ఇచ్చారు. కొత్తగా బుక్ క్యాంపెయిన్ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీలకు పుస్తకాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు.
17మందికి వసతి..
అత్తాపూర్ వద్ద చిన్నారుల కోసం హోంని నిర్వహిస్తున్నారు. ఇందులో ఐదేళ్ల నుంచి 18 ఏళ్ల వయసువారు ఉంటారు. వీరందరూ అనాథలు కాదు. ఇళ్లూవాకిళ్లు ఉన్నాయి. కాని ప్రశాంత వాతావరణంలో చదువుకునేందుకు ఈ వసతి కల్పించారు. వచ్చే ఏడాది 22మందికి వసతి కల్పించాలను భావిస్తున్నారు.
ప్రతి పైసాకు లెక్క
ఈ సంస్థ ఖర్చుపెట్టే ప్రతిపైసాకు లెక్క ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఈ ఖర్చు వివరాలను పొందుపరుస్తారు. సేవాతత్పరత, కార్యకర్తల నిబద్ధతతో ఈ సంస్థ తన సేవాకార్యక్రమాలను విస్తత్రం చేసుకుంటుంది. మంచి మనసుతో సేవ చేయాలంటే చేయూతనిచ్చేవారు ఎంతోమంది ఉంటారని సతీష్ నమ్మకం.