సబ్ ఫీచర్

పూల సొగసులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందమైన, రంగురంగుల పూలంటే ఇష్టం ఉండనివారు ఎవరుంటారు చెప్పండి? అదీ అమ్మాయిలకు పూలంటే మరీ మరీ ఇష్టం. అందుకే ఫ్యాషన్ డిజైనర్లు అమ్మాయిల ఫ్యాషన్ల కోసం ఎక్కువగా పూల అందాలనే ఎంచుకుంటారు. దుస్తులు, నగలు, జడ.. ఇలా ప్రతీదాన్లోనూ పూల సోయగాలనే ఇష్టపడుతున్నారు నేటి అమ్మాయిలు. అందుకే ఇప్పుడు ఈ అందాలు పాదాలను అంటిపెట్టుకునే చెప్పుల్లో కూడా చేరాయి. ఇక చెప్పేదేముంది? ఎవరి కాళ్లను చూసినా ఎరుపూ, తెలుపూ, పసుపూ, గులాబీ.. ఇలా రకరకాల రంగుల పూలతో శాండిల్స్ దిగుమతి అవుతున్నాయి. సాధారణ శాండిల్స్ నుంచి బూట్ల వరకు ప్రతీ దాన్లోనూ పూలను జత చేస్తున్నారు. పాదాలతోపాటు కాళ్ల అందాలు కూడా ప్రతిబింబించేలా, లెదర్ పూల దగ్గర నుంచి తాళ్ల అందాలతో కాళ్లు సొగసులీనేలా శాండిల్స్‌ను రూపొందిస్తున్నారు. ఇవి వేసుకున్న అమ్మాయిలు వాటి అందాన్ని మరింత ద్విగుణీకృతం చేసేందుకు అవి అందరికీ కనిపించేలా, వాటికి తగినట్లు దుస్తులను ధరిస్తూ తెగ ముచ్చటపడిపోతున్నారు నేటితరం అమ్మాయిలు. మరింకెందుకాలస్యం.. త్వరత్వరగా ఈ పూల సోయగాలపై ఓ లుక్కేద్దాం.. *