సబ్ ఫీచర్

దౌర్బల్యాలను దూరం చేయాల్సిందే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దౌర్బల్యంనుండే క్రూరత్వం పుడుతుంది. ఈ క్రూరత్వం మనుషుల్లో మానవత్వాన్ని మరుగున పడేస్తుంది. పిల్లలు దేవునితో సమానం అంటారు పిల్లలకోసం చెట్టు పుట్టా పూజచేస్తారు. ఇంకా భయంకరమైన నాగుపాముకు కూడా పూజచేస్తారు. పిల్లలకోసం దేనినైనా చేయడానికి భార్యాభర్తలు అయన వారు తంటాలు పడుతుంటారు.
కాని పెళ్లి కాకముందే అక్రమ సంబంధాల వల్లనో, లేక ఎవరైనా చేసిన దుశ్చర్య ల వల్లనో పిల్లలకు కొందరు తల్లులు జన్మనిస్తుంటారు. ఈ కనులు తెరిచిన పసిపాపలను కనికరం లేకుండా ముళ్లకంపల్లో విసిరేవేయడం అనేది ఆ తల్లుల మానసిక దౌర్భల్యమే. పరిస్థితులు ఏవైనా కావచ్చు కాని ఓ పసిగుడ్డుకు ప్రాణం పోసి నవమాసాలు మోసి ఈ భూమి మీదకు తీసుకొని వచ్చిన తరువాత ఎన్ని కష్టాలు ఉన్నావారికి సాకాలి. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా వారిని పెద్దవారిని చేయాలి. ఇది మానవత్వం. కాని మానవత్వానికి మచ్చతెచ్చే తల్లు ల సంఖ్య నేడు అధికం అవుతున్నది. ఏదైనా బలహీన పరిస్థితుల్లో పిల్లలు పెంచలేకపోతే కనీసం వారిని ఏ ఆశ్రమాల వారికైనా ఇవ్వాలి. అంతేకాని ముళ్లపొదల్లో , చెత్త కుప్పల్లో విసిరివేయడం తల్లితనమా ఇది. భయంకర మస్తిష్కాలలో మానభంగపు ఆలోచనలు వడివడిగా చొరబడతాయి. ఫలితంగా సూటిపోటి మాటలతో అమ్మాయిలను వేదించడం, వికృత చేష్టలతో బాధించడం సర్వసాధారణమవుతుంది. ఆకలిగొన్న పులి తనకు చిక్కిన దుప్పినో, దున్నపోతునో ఎగిసిపట్టుకున్నట్టు నిస్సహాయంగా చిక్కిన అమ్మాయిలపై పశువులా ప్రవర్తిస్తాడు. బలవంతంగా లాక్కుపోయి దుర్మార్గంగా రాక్షసంగా తన పశువాంఛ తీర్చుకుంటాడు. ఆ తరువాత ఆమెను వాడు మరిచిపోతాడు. బానే ఉంది. కాని ఆ అమ్మాయ ఒకవేళ గర్భందాలిస్తే ఈ పుట్టే పిల్లలకు బాధ్యత ఎవరిది?
ఇది కొందరి బాధ
మరికొందరు ప్రేమోన్మాద చర్యలు. కొన్నాళ్లు ప్రేమిస్తున్నాం అంటున్నారు. కొంతకాలం వివాహానికి ముందు శారీరిక వాంఛలు తీర్చుకోవడానికి ఎన్నో పన్నాగాలు పన్నుతారు. యువత తెలిసినో తెలియక చేసిన పొరపాట్లు మరో ప్రాణికి నిలువనీడ నివ్వకపోగా కనులు తెరిచిన క్షణాల్లో నే మరోలోకానికి పంపించి వేస్తున్నారు. కొంతమంది ఇలా కుప్పతొట్లల్లో విసిరివేస్తే పందుల్లో కుక్కలో ఆ పసి గుడ్లను మాంస ఖండాలనుకొని నోటికరచుకుని తినడానికి వెళ్తున్నాయ. ఆ సమయంలో ఆ పసిగుడ్లు పడేఆవేదన చూస్తే మనుషులన్నవారు తట్టుకోగలరా? ద
దీనికి కారణమేమిటి?
సమాజ భీతి, ఏ కొద్దిపాటి నైతికత లేకుండా మనుష్యులు ఈ విధంగా ప్రవర్తించడం వల్లే అనాథలు పుట్టుకొస్తున్నారు. విష పరిణామానికి, విపరీత పోకడలకు కారణాలు ఏమిటి? విజ్ఞానం పెరగుతున్న కొద్దీ మనిషి ఇంత వివేకహీనుడుగా ఎందుకు దిగజారుతున్నాడు? ఒక పైశాచిక ఆనందంకోసం ఇతరులను ఎంతగా హింసిస్తున్నారో తెలుస్తుందా? పితృస్వామ్య విధానం, పురుషాధిక్య సమాజం ఇంకా మనలో పాతుకుని పో1య ఉంది. అందుకే పుత్రునికి జన్మనిచ్చిన తండ్రిని అదృష్టవంతుడని కొనియాడతారు. పుట్టడంతోనే అబ్బాయినొక ప్రత్యేక వ్యక్తిగా, వంశాంకురంగా, కులదీపకుడుగా పరిగణిస్తారు. కుమార్తెకన్నా చాలా భిన్నమైన వాడిగా పెంచి పోషిస్తారు. ఆడపిల్ల అంటే ఆడకుపోయే, అత్తింటికిపోయే పిల్ల అని, అబ్బాయి అంటే వంశోద్ధారకుడు అని అనుకొంటున్నారు. వాడు పెరిగి పెద్దయ తోటి పిల్లలను అతను కొట్టినా, తిట్టినా తప్పుచేసాడని మందలించకపోగా అదొక సాహస కృత్యంలా, పురుష లక్షణంగా భావించుకుంటూ లోలోన మురిసిపోతాడు తండ్రి. తన కుమారుని ఒక విజేతగా తలచుకుంటూ తండ్రి మైమరిచిపోతాడే కానీ, అతని ప్రవర్తనను సరిదిద్దాలనే ఆలోచన చేయడు. అలాంటి అవసరం వుందని కూడా ఆయన భావించడు! ఇట్లాంటి వికృత చర్యల వల్లే వాళ్లు హింసాత్మకులుగా తయారు అవుతున్నారు. ఈ పురుషాధిక్య ధోరణి వివాహానంతరం భార్యలపైన కూడా ఈనాడు స్వైరవిహారం చేస్తున్నది. వివాహిత మహిళల్లో 8 శాతం మంది లైంగిక హింసకు, 32 శాతం శారీరక హింసకు, 10 శాతం తీవ్రమైన గృహ హింసకు గురవుతున్నారని సర్వేలు చెబుతున్నాయ. ఈ విధంగా పురుషులు ప్రవర్తించడమనేది కేవలం వారి ఆధిక్యత భావన కాదు వారిలోని పైశాచికత్వ ధోరణే . దీన్ని చిన్ననాడే తుంచివేయకపోతే అవాంఛనీయ సంఘటలను రోడ్లపైన కాదు ఇంట్లో కూడా జరగొచ్చు. కొంతమంది మొదట అమ్మాయిలపై అఘాయిత్యాలు చేయడం ఒక సరదానా తీసుకొంటున్నారు. అవతల వారి భయం ఆందోళన చూసి వీరిలో పైశాచిక ధోరణి మితిమీరుతోంది.
*