సబ్ ఫీచర్

భావి భారత పౌరుల భవిత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు చైల్డ్ ప్రొటెక్షన్ డే......

పిల్లలను జాగ్రత్తగా చూసుకోవలసిన వారిని కన్న తల్లిదండ్రులది. తల్లిదండ్రుల తరువాతే ఇంకా ఎవరయినా అదీ తల్లిదండ్రులు లేకుంటేనే. మరి ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటున్నారు? కడుపులో ఉన్నది ఆడబిడ్డయితే కడుపులోనే నిర్వీర్యం (గర్భం తీసేస్తారు) చేస్తారు. ఆడపిల్లయితే మాత్రం తాను చేసిన పాపం ఏమిటి? తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా, రోడ్ల వెంబడి చిత్తుకాగితాలు ఏరుకుని బతుకుతున్న వారి పరిస్థితి మరీ దారుణం. శుచి, శుభ్రత ఎరుగరు. తెలిసినప్పటికీ పరిస్థితుల ప్రభావం వలన ఏమీ చేయలేరు. తిండి దొరకక దొంగలుగా మారుతున్నవారు చాలామంది ఉన్నారు. ఇలాంటివారే పెరుగుతున్న క్రమంలో వారియొక్క అవసరాలు కూడా పెరిగిపోయి దొంగతనాలతో సరిపెట్టుకోకుండా, డ్రగ్స్, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు వాడటం, బట్వాడా చేయడం, హత్యలు చేయడం, సంఘ విద్రోహశక్తులుగా మారటం చేస్తుంటాయి. ఎందుకంటే ఇది తప్పు అని చెప్పేవారు లేకపోవడం వలననే ఇంతటి దారుణాలు జరుగుతున్నాయి. బాలకార్మిక చట్టాలు ఎన్ని ప్రవేశపెట్టినప్పటికీ, హోటళ్ళు, మెకానిక్ షెడ్లు, కిరాణ దుకాణాలు వంటి వాటిల్లో ముఖ్యంగా బ్రాందీ షాపుల్లో పనిచేస్తూ మద్యం సేవిస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొంతమందయితే చిన్నప్పుడే పెద్దపెద్ద దొంగతనాలు చేసి బాలనేరస్తుల జైళ్ళో బతుకు ఈడుస్తున్నారు. ఇలాంటి వారికి బయటి సమాజంపై కోపం వస్తుంది. జీర్ణించుకోలేరు. జైళ్ళ నుంచి బయటికి వచ్చిన తర్వాత అదే నేర ప్రవృత్తితో సంఘ విద్రోహ శక్తులుగా మారతారు. కానీ ఏ మనిషి కూడా పుట్టుకతోనే దుర్మార్గుడిలా, దొంగలా, హంతకుడిలా పుట్టరు. అంతా పరిస్థితుల ప్రభావం మీదే ఆధారపడి ఉంటుంది.
ఇంకా దారుణమయిన విషయమేమిటంటే కొన్ని ముఠాలు పిల్లలను ఎత్తుకెళ్ళి వారిచేత బిచ్చమెత్తించి సంపాదించుకుంటారు. వారు చెప్పినట్లు వినకుంటే చిత్రహింసలు పెడతారు. ఇలాంటి సంఘటనలు రాజధాని నగరాల్లో విచ్చలవిడిగా జరుగుతుంది. ఇక అమ్మాయిలనయితే యు క్తవయస్సు రాగానే వ్యభిచారంలోకి దింపుతారు. లేకుంటే దూర ప్రాంతాలకు అమ్మేస్తారు. అంతటితో అమ్మాయిల జీవితం నాశనమవుతుంది. ఎవరయినా పిల్లలు అనాథలుగా కనబడితే వారిని వీలయితే దగ్గర ఉన్నటువంటి అనాథ శరణాలయంలో గానీ, ఏదయినా ప్రభుత్వ వసతి గృహంలోగానీ అప్పజెప్పాలి. ఇలా చేసినట్లయితే వారియొక్క భావి జీవితాన్ని కాపాడిన వారమవుతాము. లేకుంటే వారికి తిండికి దొరకక, నిత్యావసరాలు తీరక దొంగతనాలు, హత్యలు లాంటి సంఘ విద్రోహక చర్యలకు పాల్పడుతారు. పిల్లలను జాగ్రత్త చేసుకోగల్గినట్లయితే మన దేశాన్ని అభివృద్ధి చేసుకున్నట్లే - వీధి బాలల కోసం, అనాథలకోసం ప్రభుత్వాలు ఉచిత వసతితో కూడిన విద్యను అందిస్తున్నాయి. ఇంకా కొన్ని స్వచ్ఛంద సంస్థలు అనాథ శరణాలయాలు ఏర్పాటుచేసి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు.

-శ్రీనివాస్ పర్వతాల 9490625431