సబ్ ఫీచర్

పిల్లల సూపర్ ఫుడ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లల ఆహార విషయంలో తల్లిదండ్రులు మొదటి నుంచీ జాగ్రత్తగా వ్యవహరించాలి. పోషక విలువలతో, ఖనిజాలతో కూడిన ఆహారం వాళ్ళకి పెట్టాలి. అలా చేయడం వల్ల పిల్లలు చదువులో రాణించడమే కాదు, ఆరోగ్యంగా కూడా ఉంటారు.
శరీరం బలవర్ధకంగా ఉండటానికి కొన్ని రకాలైన ఆహారాలు తప్పనిసరి. తిండి విషయంలో పిల్లల ఇష్టాలను పరిగణనలోకి తీసుకుంటూనే వాటిల్లో పోషక విలువలు ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. పిల్లలకు అల్పాహారంగా ఇడ్లీ, కిచిడి, ఓట్స్, ఉప్మా వంటివి ఇవ్వాలి. ఎందుకంటే ఇవి శరీరానికి కావలసిన గ్లూకోజ్‌ను అందిస్తాయి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా రోజూ పెడుతూ ఉండాలి. కొంతమంది పిల్లలకు ఒకేసారి పెద్ద మొత్తంలో ఆహారం తినే అలవాటు ఉంటుంది. అలా కాకుండా పిల్లలకు రోజులో ఐదారు సార్లు కొద్దికొద్దిగా ఆహారం పెడితే మంచిది. అలాగే రోజూ క్రమం తప్పకుండా కోడిగుడ్డును ఇవ్వాలి. కూరగాయలు, ఆకుకూరలు, నట్స్, పండ్లు, చేపలు వంటివి ఎదిగే పిల్లలకు చాలా అవసరం. ఎందుకంటే వీటి ద్వారా పిల్లలకు కావలసిన విటమిన్లు, మినరల్స్, పోషకాలు అందుతాయి. అంతేకాదు పండ్లలో, ఆకుకూరల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పిల్లల్లోని మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి.
శక్తి కోసం..
పిల్లలు ఎప్పుడూ ఆటలు ఆడుతుంటారు. వారిలో తక్షణ శక్తిని పెంచి, అనుక్షణం వారిని చురుగ్గా ఉంచే సూపర్ ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. పది సంవత్సరాల నుంచి పిల్లలది బాగా పెరిగే వయసు. ఈ వయసులో పిల్లలకు న్యూట్రియంట్లు చాలా ఎక్కువ అవసరం. అలాంటి ఆహారమే వారికి అందించాలి. న్యూట్రియంట్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని సూపర్ ఫుడ్స్ అంటారు. వీటిల్లో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. టీనేజింగ్ అబ్బాయిలకైతే 2,500 నుంచి 3,000 కేలరీలు అవసరమవుతాయి. అమ్మాయిలకు 2,200 కేలరీలు కావాలి. ఈ కేలరీలను వారికి ఎలా సమకూరుస్తారనేదే అసలు సమస్య. చిప్స్ వంటివి తిన్నా కేలరీలు పెరుగుతాయి కానీ ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే పిల్లలు తాగే సాఫ్ట్ డ్రింకుల్లో కూడా న్యూట్రియంట్లు ఉండవు. వీటిని తరచూ తీసుకోవడం వల్ల పిల్లలు లావు అవుతారు. ఊబకాయంతో పాటు చిన్నతనంలోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడతారు.
* పిల్లలు రోజుకు రెండు కారెట్లు తింటే శరీరానికి చాలా మంచిది. ఇవి ఒక రోజులో అవసరమైన బీటా కెరోటిన్‌ను శరీరానికి అందిస్తాయి. అంతేకాదు కారెట్లను తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
* వారానికి మూడుసార్లు ఆకుకూరలు తినడం వల్ల జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది.
* వారానికి రెండుసార్లు కాలీఫ్లవర్‌ను తినడం వల్ల శరీరంలో గ్లూకోసినోలేట్స్ పెరుగుతాయి. ఇవి కేన్సర్‌పై పోరాడుతాయి.
* వారానికి రెండుసార్లు తప్పనిసరిగా అవకాడోను తీసుకోవాలి. ఇందులో ఇతర విటమిన్లు, ఖనిజాలతో పాటు విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇది తరచూ తిన్నా మంచిదే..
* ప్రతిరోజూ జీడిపప్పు, వాల్నట్, పిస్తాలను కలిపి ఓ గుప్పెడు పప్పులు పిల్లలకు అందించాలి. ఉదయం మాత్రం నానబెట్టిన ఐదారు బాదాంలను పిల్లలకు తినిపించాలి. వీటిలో ఐరన్, జింక్, మెగ్నీషియం, అన్ శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటాయి.
* కొవ్వు తక్కువగా ఉన్న పెరుగు శరీరానికి చాలా మంచిది. ఇది ఎముకలకు కావలసిన కాల్షియంను అందిస్తుంది.
* పిల్లలకు పాస్తా అంటే చాలా ఇష్టం. వైట్ పాస్తా శరీరానికి మంచిది కాదు. కానీ పిల్లల మొండితనం వల్ల పాస్తాను చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు వైట్ పాస్తాను చేయకుండా హోల్ గ్రెయిన్ పాస్తాను చేయడం వల్ల వారి కోరికా తీరుతుంది. ఐరన్, పీచుపదార్థం, విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అందుతాయి.
* అలాగే వారానికి రెండుసార్లు చేపలను అందిస్తే వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో న్యూట్రియంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి.
ఇలా పిల్లల్లో తక్షణ శక్తిని ఇచ్చి ఆరోగ్యాన్ని పెంపొందించవచ్చు. *