సబ్ ఫీచర్

రఫుల్స్ మెరుపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక వస్త్రంపై మరో వస్త్రంతో కుచ్చిళ్లను అందంగా ఒక వరసులో పేర్చి అమర్చడాన్ని రఫుల్స్ అంటారు. ఒకప్పుడు చిన్న పిల్లల దుస్తులు రఫుల్స్ తరహాలోనే ఉండేవి. అప్పట్లో వీటికి అనేక పేర్లు ఉండేవి.. అందులో ఒకటి కుచ్చుల గౌను. ఈ శైలి ఇప్పుడు అమ్మాయిల ఫ్యాషన్‌గా సందడి చేస్తోంది. స్కర్టులు, కుర్తీలే కాదు చీరలు, బ్లవుజులపైనా కనికట్టు చేస్తోంది. కాలేజీ అమ్మాయిలకు, సన్నగా ఉండేవారికి, ట్రెండీగా, ఫ్యాషన్‌గా కనిపించాలనుకునేవారికి రఫుల్స్ చక్కని ఎంపిక. సాధారణంగా రఫుల్స్‌ని విడిగా కుట్టి దుస్తులకు అక్కడక్కడా జతచేస్తారు. ఇవి క్యాజువల్‌గా, పార్టీవేర్‌గా కూడా చాలా బాగుంటాయి. చాలా ప్రత్యేకంగా, సన్నగా ఉన్నవారికి మరింత అందంగా ఉంటాయి. అయితే సందర్భం, శరీరాకృతిని బట్టి నచ్చింది ఎంచుకోవచ్చు. సాధారణంగా రఫుల్స్ డిజైన్ కుచ్చిళ్లు కుచ్చిళ్లుగా ఒకచోట పట్టీలా వస్తాయి. వాటి అంచులను కూడా చక్కగా పైపింగ్ చేస్తారు. దీన్ని స్కర్టులకు, చేతి అంచులకు, కుర్తీలకు, గౌనుల చివర, జాకెట్టు చేతులకు ఎంచుకోవచ్చు. సన్నగా ఉన్నవారు ఆర్గాంజా, లెనిన్ వంటివి ఎంచుకుని రఫుల్స్ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది. సాదా చీరకు జతగా కాంట్రాస్ట్ బ్లౌజు తీసుకుని దానికి రఫుల్స్ పెట్టించుకుంటే ఆ లుక్కే వేరు. దుపట్టాలకు కూడా రఫుల్స్‌ని జతచేయవచ్చు. ఈ రఫుల్స్‌లో కూడా చాలా రకాలు ఉన్నాయి.
* చీర అంచుల్లో పెట్టించుకునే రఫుల్స్ చాలా స్టైలిష్‌గా ఉంటాయి. చీరకు కూడా కొత్త అందం వస్తుంది.
* జాకెట్టు అంచుల్లో కూడా రఫుల్స్ చాలా అందంగా అమరిపోతాయి. ఇది నేటి సూపర్ ఫ్యాషన్.
* డబుల్ ఎడ్జ్ రఫుల్స్ కూడా చాలా బాగుంటుంది. ఇది టీనేజీ అమ్మాయిలకు బాగుంటుంది. జీన్స్, స్కర్ట్ వంటి వాటిపై వేసుకునే టాప్‌ల పైకి ఈ స్టైల్ బాగా నప్పుతుంది. స్ట్రిప్‌పై రెండువైపులా గాదరింగ్స్ రావడం వల్ల ట్రెండీగా ఉంటుంది.
* సింగిల్ షోల్డర్ టాప్‌లు వేసుకున్నప్పుడు భుజాలపైకి రఫుల్స్ వచ్చేలా ఎంచుకుంటే చాలా బాగుంటుంది.
* సన్నగా ఉన్నవారికే రఫుల్స్ నప్పుతాయి అంటే.. బొద్దుగా ఉన్నవారు వేసుకోకూడదని కాదు. బొద్దుగా ఉన్నవారికి కూడా రఫుల్స్ నప్పుతాయి. అయితే వీరు రఫుల్స్ పెట్టించుకోవాలి అనుకుంటే షిఫాన్, జార్జెట్, క్రేప్ వంటి రకాలను ఎంచుకోవాలి.
* సన్నగా, పొడుగ్గా ఉన్నవారు మెడ దగ్గర రఫుల్స్ పెట్టించుకుంటే బాగుంటుంది. అయితే ఇది వాటర్ ఫాల్ రఫుల్స్‌లా ఉండాలి. అంటే పై నుంచి కిందకు జలపాతంలా జారుతున్నట్లుగా ఉంటే చాలా బాగుంటుంది.
* అనార్కలీ డిజైన్లకి సర్క్యులర్ రఫుల్స్‌ని పెట్టించుకుంటే చాలా బాగుంటుంది.
* పొడవాటి గౌన్‌లకు కూడా సర్క్యులర్ రఫుల్సే నప్పుతాయి. ఇవి మాత్రం సన్నగా ఉన్నవారికే బాగుంటాయి.