సబ్ ఫీచర్

పోరుబాటలో విజయాలు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్రిపుల్ తలాక్
ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ‘ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్’ను ఇకపై క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. ఈ బిల్లుపై రాజ్యసభలో కూడా చర్చించి, ఆమోదం పొందితే.. ఇది ఒక చట్టంగా రూపొందుతుంది. ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ బిల్లు ప్రకారం ‘ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్’ను క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. దీని కింద ఒక ముస్లిం పురుషుడికి అత్యధికంగా మూడేళ్ల జైలుశిక్షను విధించవచ్చు.

ఆలయ ప్రవేశం
ఏ ఆలయంలోనైనా దేవుడ్ని పూజించే హక్కు మహిళలకు ఉందని, అది రాజ్యాంగ బద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు తేల్చింది. అందరికీ ఆలయ ప్రవేశం హక్కు ఉందని, శబరిమల ఆలయంలోకి వయసుతో సంబంధం లేకుండా ఏ మహిళ అయినా వెళ్లచ్చని జస్టిస్ దీపక్ మిశ్రాతో కలిపి ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది. శబరిమలకు మహిళలు వెళ్లకూడదు అన్నది వివక్షేనని ఈ ధర్మాసనం వెల్లడించింది.
మీటూ
ఈ సంవత్సరం ‘మీటూ’ పోరాటం అందర్నీ మాట్లాడేలా చేసింది. ఈ పోరాటం అన్ని వర్గాల మహిళల్లో స్పందనను కలిగించింది. గొంతుని పెగిల్చేలా చేసింది. ‘నేను సైతం (మీటూ)’ అంటూ చెప్పడం వల్ల మరో మహిళకు అన్యాయం జరగదు కదా.. అని ప్రతి మహిళా సాటి బాధితుల్లో భరోసాను అందించగలిగేందుకు సమాయత్తమైంది. ఇన్నాళ్లూ అనుభవించిన మానసిక సంఘర్షణ నుంచి బయటికి వచ్చి ‘మీటూ’ అంటూ గళం విప్పారు కొంతమంది మహిళలు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించిన చాలామంది మహిళలు ‘మీటూ’ అంటూ ముందుకు వచ్చారు.

సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్ధం..
వివాహేతర సంబంధం నేరం కాదని.. దానిపై ఉన్న చట్టం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఐపీసీ సెక్షన్ 497 రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని చెబుతూ కేసును కొట్టివేసింది. వివాహమైన పురుషుడు భార్యతో కాకుండా మరో స్ర్తితో లైంగికంగా కలిస్తే అది నేరం కాదని న్యాయస్థానం పేర్కొంది. సెక్షన్ 497లోని అంశాలు ఏకపక్షంగా ఉంటూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఉన్నాయని కోర్టు పేర్కొంది. నైతిక విలువల కంటే ప్రేమతో కూడిన విలువలకే సర్వోన్నత న్యాయస్థానం ప్రాధాన్యత ఇచ్చింది. మొత్తానికి సెక్షన్ 497 వివక్షపూరితంగా ఉందంటూ కోర్టు పేర్కొంది. ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాతో పాటు నలుగురు జడ్జీలు విచారించి సెక్షన్ 497 రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని ఏకపక్ష తీర్పును వెల్లడించారు. *