సబ్ ఫీచర్

కార్యాలయంలో కొత్త ఏడాది నిర్ణయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త ఏడాదిలో అడుగుపెట్టేశాం. ఎంత వద్దనుకున్నా ఈ సమయంలో గతకాలపు సంఘటనలు, పెట్టుకున్న లక్ష్యాలు, తీసుకున్న మంచి, ఫలించని నిర్ణయాలు గుర్తుకు రాకమానవు. గత సంవత్సరం వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన అంశాలను మదింపు చేసుకునేందుకు ఇది మంచి సందర్భం. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఉపయోగపడే కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం..
* ఉద్యోగులు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే మరింత ప్రతిభను ప్రదర్శించే ప్రయత్నం చేయాలి. అందుకు ఇప్పుడున్న చోట ఉన్న అవకాశాలను గుర్తించాలి. ఈ క్రమంలో అర్హత, అనుభవం ప్రాతిపదికగా వీలున్న ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి.
* ఉద్యోగులు కార్యాలయంలో ఎదురయ్యే ఒత్తిళ్లను అధిగమించేందుకు నవ్వు ఎంతగానో దోహదం చేస్తుంది. ఖర్చులేని, సులువైన, పంచే కొద్దీ పెరిగే నవ్వు కోసం రోజులో కనీసం 20 నిముషాలైనా కేటాయించాలి. సహోద్యోగులతో సరదాగా మాట్లాడటం, జోక్స్ పంచుకోవడం, భోజన విరామ సమయంలో వారితో కలిసి పావుగంట పాటు బయట పచ్చని చెట్ల మధ్య తిరిగి రావడం వంటి అలవాట్లు వృత్తిపరమైన ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తాయి. అలాగని పనివేళల్లో కాదు సుమా.. విరామ సమయంలో మాత్రమే..
* అవకాశం కల్పించుకుని వారాంతంలో లేదా సెలవుల్లో ఏదైనా కొత్త ప్రదేశాలకు కుటుంబంతో వెళ్లి సరదాగా గడపటం, స్నేహితులను కలవటం వల్ల వంటి వ్యాపకాలు ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తాయి. ఈ తరహా ప్రయాణాలను ఇప్పటినుంచే ప్లాన్ చేసుకోవాలి.
* ఆసక్తి, వయసు, కేటాయించే సమయాన్ని బట్టి ఏదైనా కొత్త అంశాన్ని హాబీగా మలచుకునేందుకు ఇదే మంచి సమయం.
* సమయం లేదనే సాకును పక్కనబెట్టి రోజూ కనీసం గంటపాటు పుస్తక పఠనానికి కేటాయించాలి. మీకు నచ్చిన అంశాలను ఎంచుకుని వాటికి సంబంధించి సమగ్ర అధ్యయనం చేయటం ద్వారా కొత్త విషయాలు తెలుస్తాయి. ఈ అలవాటు వల్ల ఒత్తిడి దరిజేరకపోగా ఆత్మవిశ్వాసం ఎంతగానో ఇనుమడిస్తుంది. భవిష్యత్తులో ఈ జ్ఞానం ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడుతుంది.
* ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో ఓ భాగంగా మారింది. కూర్చున్న చోటు నుంచే కదలకుండా అనేక బాధ్యతలు ఏకకాలంలో నిర్వర్తించే వెసులుబాటు వచ్చింది. వ్యాయామం, ఆరోగ్యం, వృత్తిపరమైన అంశాలకు సంబంధించిన ఎన్నో యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఎంచుకుని మీ వృత్తిపరమైన బాధ్యతలను నిర్వర్తిస్తూనే, నైపుణ్యాన్ని మరింత పెంచుకోవచ్చు. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది.

-మహి