సబ్ ఫీచర్

లోహ్రి సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశం పండుగల నేల. భారతదేశంలో సంవత్సరంలో ఏదైనా నెలలోగానీ లేక ఏదైనా రుతువులోగానీ పండుగ జరగకుండా సమయం గడిచింది అని ఊహించుకోవడమే కష్టతరమైన విషయం. అంతా భారతీయులను పండుగలు పలకరిస్తుంటాయి. ఈ పండుగలను చేసుకునే తీవ్రత, విధానాలు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. కానీ పండుగలో ఉన్న సారాంశం, పరస్పర సామరస్యం మాత్రం చెక్కు చెదరకుండా అన్ని పండుగల్లో, అన్ని ప్రదేశాల్లో అలాగే ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయానికి మూల స్తంభాలుగా ఉండే రాష్ట్రాలు లేదా దేశం ఏదైనా పంట కోత సందర్భంగా పండుగలు చేసుకోకపోతే అది నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయమే.. ఎందుకంటే వ్యవసాయం చేసేవారు పంటకోత సమయంలో వారికి వచ్చే దిగుబడి, రాబడికిగానూ ఎంతో కృతజ్ఞతతో వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పండుగ చేసుకుంటారు. ఉత్సాహపూరితమైన రాష్ట్రాల్లో ముందుండే పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాలు ‘లోహ్రి’ అనే వ్యవసాయానికి సంబంధించిన పండుగను జరుపుకుంటాయి. ఈ పండుగ విశిష్టతల గురించి తెలుసుకుందాం.
లోహ్రి అంటే..
లోహ్రి అనే పదం ఉద్భవించడం వెనుక ఎన్నో కథలు ఉన్నాయి. ఈ పదం ‘లోహ్’ అనే పదంతో ఉద్భవించిందని ఓ కథ ప్రచారంలో ఉంది. ‘లోహ్’ అంటే ఇనుము అని అర్థం. మందమైన ఇనుము బాండీలను పండుగ సందర్భంగా రకరకాల మసాలాలు తయారుచేయడంలో భాగంగా ఉపయోగిస్తుంటారు. ఇక్కడి నుండే ఈ పండుగకు ఈ పేరు వచ్చిందని చెబుతారు. జానపద కథలు చెప్పేవారు మాత్రం పూర్వం ఇద్దరు తోబుట్టువులు ఉండేవారని, వారి పేర్లు హోళికా, లోహ్రి.. హోళికా హోళీ సందర్భంగా వేసిన మంటల్లో చిక్కుకుని చనిపోయిందట. లోహ్రి బతికిపోయాడట. అలా లోహ్రి బతికిపోవడంతో ఆ ఆనందాన్ని ఇలా పండుగ రూపంలో జరుపుకుంటున్నారని చెబుతారు.
వ్యవసాయం
భారతదేశం వ్యవసాయంపై ఆధారపడిన దేశం. ఇది పంజాబ్, హర్యానా వంటి భూసారవంతమైన నేలలు కలిగిన రాష్ట్రాల్లో ఈ మాట మరింత నిజం. ఇలాంటి ప్రదేశాల్లో తాము పడిన కష్టానికి, పెట్టిన పెట్టుబడికిగాను చివరిగా వచ్చే పంట దిగుబడి, పంటకోత సమయంలో వచ్చే రాబడి, ఇక్కడివారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇలాంటి సందర్భంలో జరుపుకునే పండుగనే లోహ్రి అంటారు. అందుచేతనే పంజాబీ ప్రజల గుండెల్లో ఈ పండుగకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. లోహ్రి పండుగలో ముఖ్యమైన భాగం ఏంటంటే.. ఈ పండుగ సందర్భంగా పిల్లలు ఇంటింటికి వెళ్లి జానపద పాటలు పాడుతారు. వీరు ఇలా పాడుతున్నందుకుగానూ, ఆ ఇంటివాళ్ళు బెల్లం, గింజలు, డబ్బు, చాకోలెట్స్‌ని వారికి బహుమతిగా ఇస్తారు. ఇలా చేయడం వల్ల పిల్లలకు ప్రోత్సాహకం లభిస్తుండటంతో వీరు మరింత ఉత్సాహంగా పాల్గొంటారు. అంతేకాదు ఇలా చేయడం వల్ల పిల్లలు సంస్కృతి, విలువల గురించి నేర్చుకోవడంతో పాటు, వీరి వ్యక్తిత్వం కూడా ఎంతగానో అభివృద్ధి చెందుతుందని పెద్దలు నమ్ముతారు. అందుకే పంజాబీ కుటుంబాలన్నీ ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యతని ఇస్తారు.
లోహ్రి పండుగ సమయంలో సూర్యుడు మకరరాశి నుండి తప్పుకుని ఉత్తరం వైపు జరుగుతాడు. ఖగోళ శాస్త్రం ప్రకారం ఈ సందర్భానే్న ఉత్తరాయన్ అని కూడా పిలుస్తుంటారు. ఈ సమయంలో విపరీతమైన చలి కూడా ఉంటుంది. ఈ అతి చల్లని శీతాకాలం కారణంగానే భోగిమంట కేంద్రంగా లోహ్రి పండుగను జరుపుకోవడం జరుగుతుందట. లోహ్రి పండుగ సందర్భంగా కుటుంబంలోని స్ర్తి, పురుషులందరూ ఇంటి నుంచి బయటకు వచ్చి పంజాబీ జానపద నృత్యాలు చేస్తారు. భోగిమంటను మధ్యలో ఉంచి చుట్టూ వీరు నృత్యాలు చేయడం ఆనవాయితీ. సాధారణంగా స్ర్తిలు గిద్ద అనే నృత్యం చేయగా, పురుషులు బాంగ్రా అనే నృత్యం చేస్తారు. సిక్కులు భోగి మంట చుట్టూ చేరి గురు గ్రంథ్ సాహిబ్ నామస్మరణ చేస్తారట. మరికొందరు భోగి మంట ముందు ధ్యానం కూడా చేస్తారట. ఈ భోగిమంటలు చాలాసేపు మండుతూ ఉండటం కోసం పల్లీపట్టీని, పాప్‌కార్న్, వేరుశెనగకాయలు, ఇంకా మరికొన్ని వాటిని భోగి మంటల్లో వేస్తారు.
*