సబ్ ఫీచర్

కాలం కాదు.. మారాల్సింది మనమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం చూస్తుండగానే వారాలు, నెలలు, సంవత్సరాలు కాలగర్భంలో కలసి పోతుంటాయి.. కాలగతిలో మన ఊహకందని మార్పులెన్నో.. కాలం ఎవరి కోసమూ ఆగదు.. కాలం గడచిపోతోందని డీలా పడడం అంటే జీవితానికి దిశానిర్దేశం లేనట్టే.. అందుకే మనం కాలానికి ఎదురీదాలి.. గమ్యాన్ని చేరుకొనేందుకు గమనాన్ని మనమే సరిచూసుకోవాలి.. గాలివాటం ప్రయాణం కాదు, జీవన పథంలో గెలుపుతీరాన్ని మనం చేరుకోవాలంటే కాలం విలువను తెలుసుకోవాలి.. అనుభవం నేర్పిన పాఠాలతో అలుపెరుగని ప్రయాణం చేయాలి.. ‘మార్పు’ మనలో మొదలైతే ఇతరులకు ఎన్ని నీతులైనా చెప్పగలం.. సంకల్పబలంతో ముందుకు సాగేవారే ఇతరులకు స్ఫూర్తిదాతలవుతారు..
* చాలావరకు ఇతరులను మార్చాలని తెగ ఆరాటపడతాం. ఇతరులపై మనం పెట్టుకున్న అంచనాలు తలక్రిందులయ్యాయని రోదిస్తాం. నిజంగా చెప్పాలంటే ఎవ్వరూ తమ వౌలిక స్వభావాన్ని వీడి అందుకు భిన్నంగా ప్రవర్తిస్తారని అనుకోవడం మన భ్రమ. పలు సందర్భాల్లో మనం ఎదుటివారితో సన్నిహితంగా ఉన్నపుడు మనతో వారి ప్రవర్తనతో మనం వారిని అంచనా వేయొచ్చు. అందుకు భిన్నంగా ఉండాలనుకోవడం పొరపాటు. భిన్న అభిప్రాయాలు ఉన్నా సాహచర్యం అనివార్యమైనపుడు ఎదుటివారిపై మనం ఒక అంచనాకు వస్తే చాలు. వారేంటో మనకు తెలిస్తే చాలు, ఆ మాత్రం ఎరుక ఉంటే సరిపోతుంది. వారు మారాలని అనుకోద్దు. ఎవ్వరూ మారరు. వారేంటో మనకు ఎన్నో సందర్భాల్లో చెబుతూనే ఉంటారు. మనం మన ప్రేమ మైకంలో వాస్తవాలను గుర్తించం. మనసుకు బాధ అయినపుడు మాత్రం మనకు ఎదుటివారు అర్థం అవుతారు. అందుకు చింతించవద్దు. మనకు ఒక అంచనా ఇచ్చినందుకు ఎదుటివారికి మనం మనసులో కృతజ్ఞతలు తెలపాలి. మనకు సానుకూలంగా ఉంటే స్నేహం వర్థిల్లుతుంది. లేకుండే వారితో మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే వారికి దూరంగా వెళ్లిపోవడం శ్రేయస్కరం. సమాజంలో శతృభావన వద్దు. మనకు సమాజం పట్ల వ్యక్తులను అంచనా వేయడంపట్ల మనం నూరు శాతం ఎరుకతో ఉండాలి.
* విశ్వంలో అంతా భ్రమణమే ఉంది. సూర్యుని చుట్టూ మన నవగ్రహాలు భ్రమణం చెందుతూ ఉంటాయి. ఆయా గ్రహాలు తమ స్వీయ కక్ష్యల్లో భ్రమణం చెందుతూ ఉంటాయి. వేలాది నక్షత్రాలు ఆయా నక్షత్ర మండలం న్యూక్లియస్ చుట్టూ భ్రమణం చెందుతాయి. పరమాణువుల్లో ఎలక్ట్రాను నూక్లియస్ చుట్టూ భ్రమణం చెందుతూ ఉంటాయి. మనం కూడా కొన్ని ఊహలతోనూ, కొందరిపై ప్రేమానుబంధాలతోనూ కొందరి చుట్టూ భ్రమణం చెందుతూ ఉంటాం. మన దేవుని గుడిలో దైవం చుట్టూ భ్రమణం చెందుతూ ఉంటాం. మన భ్రమణం, మన కక్ష్య ఎలా ఉందో సమీక్షించుకోవాలి అనుక్షణం. అపుడు మన భ్రమణం కూడా సార్థకత ఏర్పడుతుంది.
* మనకు ప్రామాణికం అయింది ఎదుటివాడికి ప్రామాణికం కావాలని భావించడం సరికాదు. ఎవరి భావనలకు అనుగుణంగా వారు నమ్మిందే సత్యమని వారు భావిస్తారు. మన భావనలే ఎదుటివారిలో ఉండాలని వెర్రి భ్రమలు వద్దు. మనం, మనం నమ్ముకున్న భావాలను చాలా హెచ్చు స్థాయిని ఇచ్చి కీర్తిస్తాం. మెరుపులు అద్దుతాం. గొప్ప అలంకారం అద్దుతాం. బోల్డంత సొగసులు అద్దుతాం. అదంతా వట్టి భ్రమే. నిజమేంటో మనం పైపై మెరుగుల్ని చూసి మోసపోవద్దు. వాస్తవాలను మనం సొంతంగా అనే్వషించాలి.
* మనం ఎవ్వరికీ ఏమీ చెప్పలేం. ఎవ్వరూ మనం చెప్పేది వినేం దుకు తయారుగా ఉండరు. మనం చెబుతుంటే నువ్వేమి చేస్తావు? అని ప్రశ్నిస్తారు. ఎవరికీ మనం ఉచిత సలహాలు ఇచ్చి ప్రయోజనం లేదు. మనల్ని నీ మిత్రుడు నిజంగా తనలోకి ఎంతమేరకు ఆహ్వానిస్తాడని ప్రశ్నించుకుని సమీక్షించుకుంటే నిజాలు తెలుస్తాయి.
*ప్రతి ఒక్కరూ నేటి సమాజంలో స్వీయ ప్రయోజనాల కాంక్షతో ఎదుటివాడిని వాడుకునేందుకే ప్రయత్నిస్తాడు. వీడు మనకు ఎంతమేర ఉపయోగపడతాడు? అని ఆలోచిస్తారు. ఉపయోగమనేది ఉందంటే వాడుకోవడానికి నిస్సిగ్గుగా మన వెంట పడతారు. ఇది నిజం. మన వల్ల ప్రయోజనం ఏ మాత్రం లేదంటే మనం తల తిప్పి చూసే సమయంలోనే అదృశ్యమవుతారు. తమాషాగా అన్పిస్తుంది.
*పూజలు, పునస్కారాలు, పండుగలు మనలను దైవం విశిష్టతను తెలుపుతాయి. మనం కావాల్సిన అంశాలపట్ల మనం ప్రాజెక్టు వర్క్ చేయాల్సిందే. హోంవర్క్ చేయాల్సింది. అది మనుషులైనా, ఏ అంశమైనా.
*గమ్మత్తేమంటే, మనం మన చుట్టూ వున్న సమాజాన్ని మొత్తంగా అర్థం చేసుకున్నామని, మోసం ఎక్కడుందో కనిపెట్టేసామని తెగ సంబరపడతాం. రహస్యాలు, మర్మం మనకు ఒక్కరికే తెలిసిపోయిందని ఆర్కిమెడిస్‌లా యురేకా! అని సంబరపడతాం. విచిత్రమేమంటే మనకంటే ముందే మనుషుల మధ్య సంబంధాల రహస్యం అందరికీ తెలిసే ఉంటుంది. ఇది బహిరంగ రహస్యం. మనకు తెలిసేటప్పటికి అది అందరికీ తెలిసే ఉంటుంది.
*పద్ధతి కాబట్టి ఆచరిస్తారు. వదిలేస్తారు. పండగలైనా, సంప్రదాయాలైనా, లోకం కోసం కొన్ని మనం నటిస్తాం. కానీ ఆ పనుల మర్మం తెలుసుకోం. వినాయక చవితి, బోనాలు, దసరా, జాతీయ పర్వదినాలు, ఇలా ప్రతిదీ గొప్పగా చేస్తాం. భక్తుల్లా, దేశభక్తుల్లా తెగఫోజు ఇస్తాం. కానీ వాస్తవంలో మన మనసులో ఏ మార్పు ఉండదు. సమాజ పోకడ అలా ఉంది కాబట్టే చేస్తాం. ఎంతో నిష్ఠగా, కానీ నిజంగా మనలో ఏ మార్పు ఉండదు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం.
*మనం కుటుంబంలో కీలకం కావాలి, సమాజంలో కీలకం కావాలి. ప్రగతిలో కీలకం కావాలి. మన సత్తా చూపాలి.
*ఎదుటివారిని మనం వారి విజయాల ఫైల్ ఆధారంగా అంచనా వేస్తాం, ప్రేమిస్తాం. ఓడిపోయినవాడిని మనం మనిషిగా కూడా గుర్తించం. విజేత తోక పట్టుకుని తెగ సంబరపడిపోతాం. పరాజితులను ఒంటరివారిని చేస్తాం. పరాజయాన్నీ మనం ఆహ్వానించాలి. పడిలేచేలా మనం ఓదార్చాలి. ఓడిపోయినవాడు మంచివాడు కాకుండాపోడు. ఓడిపోవడానికి కారణాలు చెప్పి బాగుపర్చాలి. ఎదిగేందుకు మనం సోపానాలు వేయాలి. ఓటమి గెలుపునకు నాంది అని తెలపాలి.
*మనం ముఖ్యంగా మన భావాలను పదిమందితో పంచుకోవాలి. మనకు ఏం కావాలో, మన భావాలేంటో, మన బాధలేంటో, దుఃఖమేంటో, సంతోషమేంటో చెప్పుకోవాలి. మనం మనలోనే ఉండిపోకూడదు. పదిమందికి మనం పరిచయం కావాలి. అపుడే ఆపదల్లో వారు మన వెంట ఉంటారు.
* శూన్యం అంటే మనకు చాలా బోరు. ఎప్పుడూ మనం బిజీగా ఉండేందుకే ప్రయత్నిస్తాం. శూన్యంగా, వౌనంగా ఉండేందుకు ప్రయత్నించం. వౌనంగా, ఒంటరిగా ఉండాలంటే మనకు భయం. ఉక్కిరిబిక్కిరైపోతాం. కానీ మనం ఒంటరితనాన్ని, శూన్యాన్ని ప్రశాంతతను భరించే శక్తిని అలవర్చుకోవాలి.
*మనం ఏ భావజాలం లేకుండా, ఏ వినోదం లేకుండా, ఏ కాలక్షేపం లేకుండా, టైంపాస్ లేకుండా, అలవాట్లు లేకుండా, విజయాలు లేకుండా ఒంటరిగా ఉండలేం. బుర్రను ఖాళీగా ఉంచలేం. కానీ ఒంటరితనాన్ని, ఎవ్వరూ, ఏమీ లేనితనాన్ని అలవర్చుకోవాలి. ఎందుకంటే, మనం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాం. అపుడు వౌనంగా విలపించడమే, జీవితాన్ని చాలించడమో చేస్తాం. అపజయాల్ని ఒంటరితనాన్ని మనం భరించాలి.
*చట్రంనుంచి బైటపడాలి. మనం ఒక్కసారి మన చట్రాన్ని మార్చుకోవాలి. అపుడుగాని మన పట్ల సమాజం ఏమనుకుంటుందో తెలుస్తుంది.
*మనం ఒక్కోసారి మన తాజదనాన్ని కోల్పోతాం. మనం పల్లెనుంచి పట్నంకు వచ్చి మన ఆత్మీయులకు, స్నేహితులకు దూరంగా మన పల్లె పరిమళానికి దూరంగా ఉండిపోయి మనకు మనం దూరం అవుతాం. పిచ్చెక్కుతుంది. పట్నంలో పలకరించేవారు ఉండరు. మనం మనల్ని ఎక్కడో జారవిడుచుకుంటాం. మన బంధువులకు దూరంగా వచ్చేసి మనం ఆత్మీయతకు దూరమవుతాం. కానీ మనం చింతించాల్సిన పనిలేదు, మన పల్లెకు, మన అనుబంధాలకు అప్పుడప్పుడు దగ్గరగా వెళ్లాలి. మనం మన స్వీట్ మెమొరీస్‌ను కోల్పోవాల్సిన అవసరం లేదు. మనం ఒక్కసారి మన పాత జీవితంలోకి వెళ్లి వస్తూ ఉండాలి. అపుడు మనం మళ్లీ రిఫ్రెష్ అవుతాం. తాజాగా మారిపోతాం.

-తంగెళ్ళపల్లి కనకాచారి 87908 74028