సబ్ ఫీచర్

గర్భిణుల ఆహార నియమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గర్భంతో ఉన్న ఆడవారు ముందు నుండి ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకునేలా ప్రణాళికను రూపొందించుకోవాలి. ముందు నుండే ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల గర్భ సమయంలో వచ్చే ఇబ్బందులను సులభంగా ఎదుర్కోవచ్చు. తయారుచేసుకున్న ప్రణాళికలో కావలిసిన పోషకాలను సరైన మోతాదులో ఉండేలా, ఆహారాన్ని తగిన సమయంలో తీసుకోవాలి. గర్భంతో ఉన్న ఆడవారు వారి ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా వారి కడుపులో పెరుగుతున్న పిండం యొక్క ఆరోగ్యం, పిండ పెరుగుదలకు కావలసిన ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారాన్ని సరిగా తీసుకోకపోతే, పిండ పెరుగుదలలో లోపాలు, పిండం తక్కువ నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. గర్భిణులు ఆహార ప్రణాళిక మాత్రమే కాకుండా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. అందుకే చికిత్స తీసుకునే వైద్యురాలితో మీ శరీరానికి అనుగుణంగా ఆహారప్రణాళికను తయారుచేసుకుని, వాటిని అనుసరిస్తూ వైద్య సలహాలను పాటించడం చాలా మంచిది.
పోషకాలు
కడుపుతో ఉన్నవారు సిగరెట్, ఆల్కహాల్, నికోటిన్ వంటి వాటికి దూరంగా ఉండాలి. దీనివల్ల కడుపులో పెరుగుతున్న పిండానికి ప్రమాదం జరిగి పెరుగుదల లోపాలు, ఇతర లోపాలు కలుగవచ్చు. మీరు తీసుకుని ఆహారంలో తప్పకుండా కాల్షియం, ప్రొటీన్స్, ఐరన్, విటమిన్ ‘సి’, ఫోలేట్ వంటి అవసరమైన పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఆడవారు మామూలుగా తీసుకునే దానికంటే గర్భంతో ఉన్న సమయంలో ప్రతిరోజూ 300 నుండి 400 కేలరీలను ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రసవానికి ముందుగా తప్పకుండా తీసుకోవాలి అని తెలిపారు.
మినరల్స్
గర్భిణులు ముఖ్యంగా తీసుకోవాల్సిన మరో మూలకం మినరల్స్. గర్భ సమయంలో వారి శరీరం లోపల, బయట వచ్చే మార్పులను తట్టుకుని, ఆరోగ్యవంతమైన ప్రసవం జరగాలి అంటే మినరల్స్ తప్పనిసరిగా అవసరం. ఆక్సిజన్, పోషకాలను అన్ని శరీర భాగాలకు అందేలా చేసే ఎర్రరక్తకణాల ఉత్పత్తి ఎక్కువ అయ్యేలా మినరల్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
జాగ్రత్తలు
గర్భిణులు తీసుకునే ఆహారంలో అవసరం అయిన మేరకు మాత్రమే కార్బోహైడ్రేట్స్, సులువుగా జీర్ణమయ్యే పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. గర్భ సమయంలో వారి జీర్ణక్రియ శక్తి తగ్గిపోతుంది. కాబట్టి గర్భిణులు త్వరగా జీర్ణం అయ్యే ఆహారాన్ని తినడం వల్ల శరీరంలోని విసర్జక పదార్థాలను బయటికి పంపడంలో విఫలం అవటం వల్ల, రక్తం చెడిపోయి ఇతరేతర ఇనె్ఫక్షన్స్ కలిగే అవకాశం ఉంది. కాబట్టి త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది.
గర్భిణులు ఎక్కువగా పచ్చని ఆకుకూరలను తీసుకోవాలి. రోజూ తీసుకునే ఆహారంలో ఐదు రకాల రంగులు ఉన్న పండ్లను తప్పకుండా తీసుకోవాలి. ఆకలిగా అనిపించకుండా ఉన్నా కూడా తినడానికి ప్రయత్నించాలి. ఫోలిక్ ఆసిడ్ ఎక్కువగా ఉండే అరటిపండ్లను తినాలి. కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, పాల పదార్థాలను తినాలి. వైద్యుడి సలహా పాటించాలి. రోగ నిరోధకశక్తిని పెంచుకోవడానికి రోజూ ఒక గ్లాసు మిక్స్‌డ్ ఫ్రూట్ జూస్ తీసుకోవాలి.