సబ్ ఫీచర్

సివిల్స్‌లో గిరిపుత్రిక ఘనత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చాక టాపర్ల గురించి, ఇతర విజేతల గురించి మీడియాలో చాలా రకాల కథనాలు వచ్చాయి, వస్తున్నాయి. కానీ శ్రీ్ధన్య కథ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కారణం ఆ రాష్ట్రంలోని ఎస్టీ కులాల నుంచి యూపీఎస్సీ విజేతగా నిలిచిన తొలి మహిళ శ్రీ్ధన్య సురేష్. కేరళలోని ‘కురిచియా’ గిరిజన తెగ నుంచి వచ్చింది శ్రీ్ధన్య. ఆ జాతి వారందరూ గొప్పగా చెప్పుకోగలిగే స్థాయికి ఎదిగింది ధన్య. కేరళలోని వాయనాడ్ ప్రాంతంలోని ఇడియంవాయల్ అనే ఊరు శ్రీ్ధన్యది. ఆమె తండ్రి పేరు సురేష్, తల్లి కమల. ఇద్దరూ రోజువారీ కూలీలు.. పేదరికం, సామాజిక వెనుకబాటుతనం సరేసరి.. అయినా కూడా ఏమాత్రం వెనుకంజ వేయకుండా చదువుకుంది. జనరల్ కేటగిరీలో 410వ ర్యాంకును సంపాదించుకుంది. శ్రీ్ధన్య వివరాల్లోకి వెళితే..
తల్లిదండ్రులిద్దరూ పనులకు వెళ్లేవారు. ఆర్థిక స్థితి అంతంత మాత్రమే.. శ్రీ్ధన్య చిన్నప్పటి నలుంచీ అందరిలాగే పనులు, ఆటలతో పాటు అప్పుడప్పుడూ కాసింత సేపు చదువుకునేది. ఆడపిల్లలపై పెద్దగా ఆంక్షలు లేని కుటుంబం వారిది. అలా శ్రీ్ధన్య కొజిక్కోడ్‌లో జువాలజీలో డిగ్రీ పూర్తిచేసింది. తరువాత కాంగ్రెస్ అనుబంధ ఎన్. ఎస్.యు.ఐ. (నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఇన్ ఇండియా)కి చెందిన కేరళ విభాగం కె.ఎస్.యు. (కేరళ స్టూడెంట్ యూనియన్)లో పనిచేసేది. తరువాత కాలికట్ యూనివర్శిటీలో అప్లయిడ్ జువాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. పీజీ తరువాత శ్రీ్ధన్య రకరకాల ఉద్యోగాలు చేసింది.
ఒకరోజు శ్రీ్ధన్య ఐ.ఎ.ఎస్. ఆఫీసర్‌ను కలవడానికి వెళ్లిందట. అక్కడ చాలామంది ఆ ఆఫీసర్ కోసం ఎదురుచూడటం గమనించిందట. తరువాత ఆ ఆఫీసర్ వచ్చినప్పుడు ఆయనకు దక్కిన మర్యాద, ఆ పోస్టుకున్న విలువను చూసి శ్రీ్ధన్య కదిలిపోయిందట. నేను ఎందుకు కలెక్టర్ చదవకూడదు? నేనెందుకు వీరిలా కాకూడదు? అనే ఆలోచన ఆమెలో మొదలయ్యిందట.. ఆర్థిక ఇబ్బందులు తప్ప ఇతర కష్టాలు పెద్దగా లేని జీవితం తనది.. అలా ముందడుగు వేద్దాం అనుకుంటూనే డబ్బు గురించి ఆలోచించిందట.. కేరళ ఎస్టీ డిపార్ట్‌మెంట్ సివిల్స్ కోచింగుకు ఒక స్కీం కింద డబ్బులిస్తుందని తెలిసి అప్లికేషన్ పెట్టుకుందట.. అలా ఫార్చూన్ ఐఏఎస్ అకాడమిలో చేరిపోయింది శ్రీ్ధన్య. రోజుకు ఆరుగంటలు చదివేదట.. ఒక్కోసారి చదవబుద్ధి కానప్పుడు వదిలేసేదట.. అలా ఒక్కోరోజు అరగంట కూడా చదివేది కాదట. కానీ చదివినంతసేపు మాత్రం ఏకాగ్రతతో చదివేదట.. అలా సివిల్స్‌ను సాధించింది శ్రీ్ధన్య. ‘ఇంకాస్త మంచి ర్యాంకును ఊహించా.. కానీ.. 410వ ర్యాంకు వచ్చింది. ఇది కూడా నాకు మంచి ర్యాంకే.. పాత సరళిని బట్టి నాకు ఐఏఎస్ వస్తుంది. ఇప్పటిదాకా మా జాతిలో ఒక్క మహిళా కలెక్టర్ కూడా లేరు. కేరళలో గిరిజన జాతులు ఎక్కువ. మా ఇళ్లల్లో చదివేవాళ్లు తక్కువ. డ్రాపవుట్లు ఎక్కువ. ఏదో ఒక ఉద్యోగం దొరకగానే పెళ్లి చేసేస్తారు. కానీ నేను మాత్రం అనుకున్నది సాధించుకున్నాను. నేను మా ఎస్టీల కోసం పనిచేయాలనే కాదు, మొత్తం సమాజం కోసం పనిచేయాలనుకుంటున్నాను. నిజంగా జాతుల కోసం చేయాలంటే ఎంతో పని ఉంది కదా.. భూహక్కులు, వివక్ష, మహిళారక్షణ, పెళ్లి కాని తల్లులు, అనారోగ్యాలు, చదువు.. ఇలా ఎన్నో సమస్యలు.. చేతనైనంత వరకూ చేయాలి. తప్పకుండా చేయాలి’ అని చెబుతోంది శ్రీ్ధన్య. ఇప్పుడు ఆమెకు మిత్రులు, బంధువుల నుంచే కాదు ఎన్నికల కాలం కదా.. రాజకీయ నాయకులు కూడా ఆమెను అభినందనల్లో ముంచెత్తుతున్నారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తోంది కూడా వీళ్ల ప్రాంతం నుంచే.. కాబట్టి శ్రీ్ధన్య సివిల్స్ సక్సెస్ వినగానే ఆయన కూడా అభినందించేశాడు. అలాగే సి.ఎం. పినరై విజయన్ కూడా.. ఏదిఏమైనా కలెక్టర్ కావాలి అనుకున్న కలని నిజం చేసుకుంది శ్రీ్ధన్య. అలా ఆమె తన జీవితాన్ని ధన్యం చేసుకుంది.