సబ్ ఫీచర్

వాట్సాప్‌లో కొత్తగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాట్సాప్‌లో మెసేజ్‌లు రావడం ఎంత సాధారణమో.. అందులో కొత్త ఆప్షన్లు రావడం కూడా అంతే సాధారణమైపోయింది. ఎందుకంటే వాట్సాప్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా త్వరలో వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు రానున్నాయి.. అవేంటో ఒకసారి చూద్దాం!
కేటలాగ్
వ్యాపారుల సౌకర్యార్థమై వాట్సాప్ ఇటీవల ‘వాట్సాప్ బిజినెస్’ను తీసుకొచ్చింది. ఇది చూడటానికి సాధారణ వాట్సాప్‌లా కనిపించినా.. ఇందులో కొన్ని అదనపు ఫీచర్లు ఉన్నాయి. దుకాణదారు వాట్సాప్ నెంబరు మెసేజ్ చేస్తే ‘ ఆటోమేటిక్ రిప్లై’ రావడం, అధీకృత నెంబరు అని టిక్ మార్కు రావడం వంటివి అన్నమాట. ఇప్పుడు దీనికి అదనంగా కేటలాగ్ ఆప్షన్‌ని కూడా జోడిస్తున్నారు. అంటే ఏదైనా హోటలో లేదా శారీ హౌస్ బిజినెస్ నెంబర్ ఇన్ఫోలోకి వెళితే అందులో లభించే వస్తువుల జాబితా కూడా కనిపిస్తుందట.
నేరుగా చూసేలా..
వాట్సాప్‌లో పంపిన మెసేజ్‌కి ఏదో ఒక స్టిక్కర్ వచ్చింది. నోటిఫికేషన్‌లో ఏదో స్టిక్కర్ అని వచ్చింది. వచ్చినది ఏదో చూడాలంటే మళ్లీ యాప్‌లోకి వెళ్లాలి. ఇలాంటి ఇబ్బందులు లేకుండా నోటిఫికేషన్‌లోనే వచ్చిన స్టిక్కర్‌ను లేదా యానిమేటెడ్ స్టిక్కర్‌లను నేరుగా చూసుకోవచ్చు. దీనివల్ల ప్రతీసారి వాట్సాప్ యాప్ ఓపెన్ చేసుకునే బాధ ఉండదు.
కదిలే బొమ్మలు
ప్రస్తుతం వాట్సాప్‌లో అక్షరాలతోపాటు ఇమేజ్‌లు, జిఫ్‌లు పంపే సౌలభ్యం ఉంది కదా.. ఇటీవల వీటికి స్టిక్కర్లను జోడించారు. అయితే నెటిజన్లకు ఎక్కడో చిన్న వెలితి. అవి చిన్నగా కదులుతూ యానిమేట్ అయితే బాగుంటుందని.. ఇలా అనుకునేవారి కోసమే వాట్సాప్‌లో త్వరలో యానిమేటెడ్ స్టిక్కర్లను తీసుకొస్తోంది. ఇకపై కదిలే స్టిక్కర్లను షేర్ చేసుకోవచ్చు.
చీకట్లో..
నేడు గ్యాడ్జెట్ ప్రపంచం అంతా ‘డార్క్ మోడ్’ చుట్టూ తిరుగుతోంది. మొబైల్స్, యాప్స్, ఓఎస్‌లు ఇలా అన్నీ వెలుతురు నుంచి చీకట్లోకి వచ్చేస్తున్నాయి. వాట్సాప్ కూడా ఇప్పుడు అదే దారిలోకి రావాలని అనుకుంటోంది. అంటే త్వరలో వాట్సాప్‌లో ‘డార్క్ మోడ్’ వస్తుందట. అయితే దీన్ని గ్రీన్ మోడ్ అనొచ్చు. ఎందుకంటే స్క్రీన్ గ్రీన్ కలర్లో.. దానిపై టెక్ట్స్ వైట్ కలర్‌లో కనిపిస్తుందట..
వివరాలు
వాట్సాప్‌లో దేనినైనా ఫార్వార్డ్ చేసినప్పుడు అవతలి వ్యక్తికి పంపిన మెసేజ్ అది ఫార్వర్డ్ మెసేజా లేక నేరుగా పంపించిందా అని చూపిస్తుంది. అంటే కావాలని ఫేక్ మెసేజ్‌లు ఫార్వర్డ్ చేసేవాళ్లకు దీనితో చెక్ పెట్టొచ్చన్నమాట. ఇప్పుడు దీన్ని మరింత ఉపయోగకరంగా చేస్తున్నారు. దీనివల్ల మీకు వచ్చిన మెసేజ్‌ను లాంగ్ ప్రెస్ చేస్తే ‘్ఫర్వర్డింగ్ ఇన్ఫో’ మొత్తం వచ్చేస్తుంది. అందులో ఈ మెసేజ్ ఎంతమందికి ఫార్వర్డ్ చేశారు.. తదితర వివరాలన్నీ వచ్చేస్తాయి.
వాట్సాప్‌లోనే..
వాట్సాప్‌లో ఏదైనా వీడియో వచ్చినప్పుడు దాన్ని క్లిక్ చేస్తే యాప్ నుంచి బయటకు వెళ్లకుండా అక్కడే ప్లే అవుతుంది. ఇప్పుడు వెబ్‌సైట్ లింక్స్‌కు కూడా ఇదే స్టైల్ తీసుకొస్తున్నారు. ఇన్-యాప్ బ్రౌజర్ ఆప్షన్ ద్వారా క్లిక్ చేసిన లింక్ వాట్సాప్ యాప్‌లోనే ఓపెన్ అవుతుంది. ఇలా చూసిన లింక్‌లు, సమాచారాన్ని వాట్సాప్ స్టోర్ చేయదు అని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్, ఐ ఓ ఎస్ మొబైల్స్‌కు అందుబాటులో ఉంది. ఇప్పటివరకు కొన్ని ఆండ్రాయిడ్ ట్యాబ్స్‌లో కూడా వాట్సాప్‌ను వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు వాట్సాప్‌ను ఐపాడ్‌కు కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉంది వాట్సాప్ బృందం. ఇప్పటికే దీనికి సంబంధించి టెస్టింగ్ ప్రక్రియ జరుగుతోంది. త్వరలో దీనిపై స్పష్టత వస్తుందని నిపుణులు చెబుతున్నారు. *