సబ్ ఫీచర్

లోపాలు వెతకొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు, ఘర్షణకు చిన్న చిన్న సమస్యలే కారణమవుతాయి. అవే.. ఎదుటివ్యక్తి ఏం చేసినా తప్పుగా కనిపించడం, పాత మనస్పర్థలకు అవి జతకలవడం జరుగుతుంది. అలాంటి సమయంలో చేసిన తప్పులే గుర్తుకు వస్తాయి కానీ, మునుపు వారు చేసిన మంచి, చూపించిన ఆప్యాయత, ప్రేమలు గుర్తుకురావు. అలాంటప్పుడు..
* ఇద్దరి అభిరుచులూ ఒకటే కావచ్చు. ఇద్దరూ కలిసి ఇష్టంగా సంగీతం వినొచ్చు. అది ఇద్దరి మధ్యా అన్యోన్యతకు దారితీస్తుందని అనుకుంటే మాత్రం పొరబాటే.. అచారాలు, కుటుంబం, స్నేహితులు, డబ్బు, కెరీర్ విషయంలో ఇద్దరి మధ్యా స్పర్థలు రావచ్చు. అందుకే ఇద్దరి మధ్యా ఎటువంటి పొరపొచ్చాలూ రాకుండా ఉండాలంటే మిగిలిన విషయాల్లో కూడా సమతుల్యత పాటించాలి.
* అలాగని భాగస్వామిని పూర్తిగా తమకు అనుగుణంగా మార్చాలనుకోవడం.. లేదా పూర్తిగా తను భాగస్వామికి అనుగుణంగా మారిపోవాలనుకోవడం కూడా సరికాదు. అవతలివాళ్ల అభిరుచులు, అలవాట్లు మీకు ఇబ్బంది కానంతవరకూ వాటిని పట్టించుకోకుండా వదిలేయడం మంచిది. మీ విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. మీ అభిరుచులు మీ భాగస్వామికి నచ్చకపోయినా వాటిని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయం భాగస్వామికి నెమ్మదిగా నచ్చచెప్పాలి.
* భాగస్వామి నుంచి ఒక చిన్న పొరపాటు జరిగితే చాలు.. గతంలో చేసిన తప్పులన్నీ తవ్వడం మొదలుపెడతారు. దానివల్ల వాదనలు, దూరాలు పెరుగుతాయే తప్ప తరగవు. అందుకే ఒక సమస్య ఎదురైనప్పుడు దాన్ని అక్కడ వరకే, ఆ సమస్య వరకే పరిమితం చేయాలి. కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి తప్ప.. ఆ వాదనలోకి గతాన్ని తీసుకురాకూడదు.
* భాగస్వామిలో ప్రతీది లోపంగానే కనిపిస్తుంది కొందరికి. అలా లోపాలు వెతకడం వల్ల ఇద్దరి మధ్యా అనుబంధం తగ్గుతుంది. కొన్ని లోపాలను వదిలేస్తూ, కొన్నింటి వల్ల నష్టం కలుగుతుంది కాబట్టి నెమ్మదిగా వదిలివేయమని చెప్పడం సమంజసం.
* భాగస్వామి కాబట్టి పట్టించుకోనట్లు వదిలేయడం, తరచూ విమర్శించడం, అందరి ముందూ తక్కువచేసి మాట్లాడం సరికాదు. ఇది ఇద్దరి మధ్యా మనస్పర్థలకు దారితీస్తుంది. ఎంత పని ఒత్తిడి ఉన్నా సరే.. ప్రతిరోజూ తమకంటూ కాస్తతం సమయాన్ని కేటాయించుకుని, సరదాగా మాట్లాడుకోవాలి. విమర్శించే ధోరణి కన్నా.. సమస్యను గుర్తించి పరిష్కరించుకునేలా ఆలోచిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. *