సబ్ ఫీచర్

చిన్నారులను తీర్చిదిద్దండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నామనేది తల్లిదండ్రుల ఫిర్యాదు. నిజమే.. వాళ్ళ సందేహాలు, సమస్యలూ, అవసరాలూ, అల్లర్లూ, ముద్దు ముచ్చట్లూ.. ఒకటా రెండా! తీర్చేకొద్దీ ఇంకా పుట్టుకొస్తుంటాయి.
చిన్నారుల డ్రెస్సులు ఓ పెద్ద సమస్య. భూమికి జానెడు లేకపోయినా ఎన్నో కొత్తకొత్త రకాల ఫ్యాషన్లు, కళ్ళు చెదిరే రంగులు, డిజైన్లు, స్టైల్స్.. ఏవేవో నోరు తిరగని పేర్లు పిల్లలకోసం స్పెషల్ డిజైన్లని ప్రకటనలు. ఇవన్నీ పక్కనబెడితే పిల్లలకు రెడీమేడ్ డ్రెస్సులే మంచిది. వీటిని తక్కువ ఖరీదులో ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు కొనడానికి అనువుగా వుండే ధరలో తీసుకోవడం మంచిది. రెడీమేడ్ డ్రెస్ నాణ్యత, కలర్ గ్యారంటీ ఉండేలా తీసుకోండి. ఎక్కువ సరకు అమ్ముడయ్యే షాపుల్లో అయితే ఎప్పటికప్పుడు ప్రెష్‌గా కుట్టిన డ్రెస్సులు వస్తుంటాయి. అలాంటి షాపుల్లో తీసుకోండి. రెడీమేడ్ దుస్తులు కొన్నా మళ్లీ స్టిచ్చింగ్ చేయించడం మంచిది. లేకుంటే పిల్లలు ఆడుకునేటప్పుడు కుట్లు పిగిలిపోయే ప్రమాదం ఉంది.
ఖరీదైన వస్తువులు
ఇంట్లో ఖరీదైన వస్తువులు వుంటే పిల్లల చేతులు మాటిమాటికీ వాటిమీదకే పోతుంటాయి. ఆ చిన్ని మెదళ్ళు మెకానిజం గురించే ఆలోచిస్తుంటాయి. ఆట వస్తువులతో ఆడుకునే వయసు దాటిన తర్వాత పిల్లలకు తమ చుట్టూ వున్న ఇతర వస్తువుల మీదకి దృష్టిపోతుంటుంది. పెద్దవాళ్ళు వద్దన్నకొద్దీ ఆ వస్తువులను ఆపరేట్ చేయాలన్న ఆసక్తి పెరుగుతుంటుంది. ఇంట్లో వుండే టీవీ, డివిడి ప్లేయర్లు, వాల్‌క్లాక్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంకా ఇతర ఖరీదైన వాటిమీదకి పిల్లల దృష్టి మరలుతుంటుంది. పెద్దవాళ్ళకి తెలియకుండా ఆ వస్తువుల్ని కదలించి అటూ ఇటూ తిప్పి ఆపరేట్ చేసి ఆనందించాలనుకుంటారు. ఈ పరిస్థితుల్లో పిల్లలమీద కోప్పడి ప్రయోజనం లేదు. అలా చేస్తే పేరెంట్స్ ఇంట్లో లేనప్పుడు పిల్లలు మళ్లీ ఆ పనే చేస్తారు.
కాబట్టి వారి ఆసక్తిని గమనించి పనికిరాని, పాడైపోయి, పక్కన పడేసిన కొన్ని వస్తువుల్ని వారి ముందు ఉంచి ఆ భాగాలను సరిగా అమర్చే పనిని పిల్లలకు అప్పగించండి. టీవీ ఆన్ ఆఫ్ చేయడం, వాల్‌క్లాక్‌లో బ్యాటరీలు మార్చడం లాంటి పనులు కూడా వారికే అప్పగించండి. ఆసక్తి వుంది కదా అని గ్యాస్‌స్టౌ, ఐరన్ బాక్స్, వాషింగ్ మెషీన్ లాంటివి ఆపరేట్ చేయనివ్వకండి. అలా చేయడంవల్ల పిల్లలకు ప్రమాదాలు జరగొచ్చు.
చదువుపై శ్రద్ధ
పిల్లల్ని స్కూల్లో చేర్పించి, బుక్స్ కొనిచ్చి, ఫీజలు కట్టేయడంతో పేరెంట్స్ పని అయిపోయినట్లు కాదు. పిల్లలు ఎలా చదువుతున్నారో కూడా తెలుసుకుంటూ వుండాలి. రోజూ ఓ గంటసేపైనా పిల్లల్ని దగ్గర కూర్చోపెట్టుకుని చదివించడం అవసరం. చిన్నారుల చదువును తల్లి, పెద్ద పిల్లల చదువును తండ్రి ఎప్పుడూ పర్యవేక్షిస్తుండాలి. కొంతమంది పిల్లలు సరిగ్గా చదవరు. తల్లిదండ్రుల మీద భయంతో ఎప్పుడూ బుక్స్ ముందు పెట్టుకుని చదువుతున్నట్టు నటిస్తుంటారు. పేరెంట్స్ మోసపోయి, ‘‘మా పిల్లలు బాగా చదువుతున్నారు, అయినా మీరు మార్కులు సరిగ్గా ఇవ్వకుండా పిల్లల్ని ఫెయిల్ చేస్తున్నారు’’అని టీచర్లతో గొడవ పడుతుంటారు. అలా చేయకండి. స్కూల్లో భయంవల్ల సరిగ్గా చదవలేకపోయిన చిన్నపిల్లలు ఇంట్లో పేరెంట్స్ ఆప్యాయంగా కూర్చోబెట్టుకుని చదివిస్తే బాగా చదువుతారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే పేరెంట్స్ దగ్గర కూర్చోబెట్టుకుని చదివించాలి.
స్కూల్లో ప్రవర్తన
కొంతమంది పిల్లలు ఇంట్లో చిచ్చరపిడుగుల్లాగా ఉంటూ స్కూల్‌లో డల్‌గా, మొద్దుల్లాగా ఉంటారు. ఇంకొంతమంది పిల్లలు ఇంట్లో బుద్ధిమంతుల్లాగా ఉంటూ, స్కూల్లో అల్లరి పిల్లలుగా పేరుతెచ్చుకుంటారు. మీ పిల్లలు ప్రవర్తనలో ఇలాంటి తేడా ఉంటే గమనించి సరిదిద్దడానికి ప్రయత్నించండి.
మంచి స్నేహం అవసరం
మీ పిల్లలు మంచివాళ్ళు, బుద్ధిమంతులూ అయినా, వాళ్ళ ఫ్రెండ్స్ చెడ్డవాళ్ళు అయితే ఇబ్బంది. పిల్లలు ఎలాంటివాళ్ళతో స్నేహం చేస్తున్నారో అనే అనుమానం వుంటే మీ పిల్లల ఫ్రెండ్స్‌ను మీరే ఎంపిక చేయండి. మీ బంధువులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీకు తెలిసిన కుటుంబాల్లోని పిల్లలతో మీ పిల్లలు ఫ్రెండ్‌షిప్ చేసుకునేలా చూడండి. దీనివల్ల మీ పిల్లల ఫ్రెండ్స్ గురించి మీకు తెలుస్తూ ఉంటుంది. ఒక వయస్సు వచ్చేవరకు పిల్లలకోసం స్నేహితులను పెద్దలే ఎంపిక చేయడం మంచిది. ఏ ఆకతాయిలతోనో స్నేహం పెంచుకునే ప్రమాదం ఉంది. పిల్లలకు ఆటలు, పాటలు, చిత్రలేఖనం, వాయిద్య కళలు లాంటివి ఏదో ఒక లలిత కళల్లో ప్రవేశం కల్పించండి. దీనివల్ల అదే కళతో పరిచయం వున్న కొందరు వారికి మిత్రులు కావచ్చు. స్నేహితుల విషయంలో పిల్లలకు కొంతవరకైనా స్వేచ్ఛ ఇవ్వండి. లేకుంటే వాళ్ళకి అసలు స్నేహితులే లేకుండా పోయే ప్రమాదం ఉంది.
ఉత్సాహంగా ఉంచండి
కొంతమంది పిల్లలు ఎప్పుడూ ఉత్సాహంగా గంతులు వేస్తుంటే, కొందరేమో నీరసంగా, నిరుత్సాహంగా డల్‌గా ఉంటారు. దీనికి కారణం కొంతవరకూ పెద్దల పెంపకంలో తేడా కావచ్చు. పిల్లల్ని ఒక వయసు వరకూ ప్రేమగా దగ్గరకు తీసుకుని స్పృశిస్తూ ఉంటే పిల్లలకి ఆప్యాయత, రక్షణ, భద్రత ఉండే ఫీలింగ్స్ కలుగుతాయి. దీనివల్ల వారిలో ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. పిల్లల్ని ఎప్పుడూ ఒకేరకం వస్తువులమధ్య, ఒకే పరిసరాల్లో, ఒకే వాతావరణంలో వుంచితే నిరుత్సాహం ఏర్పడుతుంది. కొత్త కొత్త వస్తువులను పిల్లలకి చూపుతూ, వాటిమధ్య గడిపేలా చేయండి. అప్పుడప్పుడు బయట ఎగ్జిబిషన్లు, పార్కులు, మ్యూజియమ్స్, పిక్నిక్‌లాంటివాటికి తీసుకెళుతుంటే వారిలో ఉత్సాహం మొదలవుతుంది.

- పి.ఎం. సుందరరావు 9490657416