సబ్ ఫీచర్

అందమైన చేతుల కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యోగా ఉపయోగాలపై గల విశ్వాసంతో చాలామంది వారి శరీర భాగాలను బలోపేతం, బిగువుగా చేసుకోవడానికి చాలా కృషి చేస్తుంటారు. పరిపూర్ణ శిక్షణ ద్వారా మాత్రమే శరీరాన్ని తగినవిధంగా మలచుకోవడం సాధ్యం. ఒకవేళ యోగాను విరుద్ధంగా కాకుండా, సరైన మార్గంలో, ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తే బిగువైన, నాజూకైన, అందమైన చేతులు పొందవచ్చు. మరి ఎలాంటి యోగాసనాలను వేస్తే బిగువైన, అందమైన చేతులు సొంతమవుతాయో చూద్దాం..
డౌన్వార్డ్ డాగ్
ఈ ఆసనానే్న అదోముఖ స్వనాసన అంటారు. ఒక చాపపై అధోముఖ భంగిమలోకి వంగాలి. భుజాలకు సూటిగా చేతులను కింద నాలుగు భాగాలూ తాకే విధంగా మోకరిల్లాలి. కాలి వేళ్ళపై కింద పాకాలి. నడుమును పైకి ఎత్తేటప్పుడు శ్వాసను బయటకు వదిలేయాలి. భుజాలను చెవుల నుండి దూరంగా జరపాలి. ఈ విధంగా చేస్తున్నప్పుడు ముందుగా పక్కటెముకలను లోపలివైపునకు లాగేసుకోవాలి. తర్వాత చేతులను వీలైనంత వరకు పాదాల వైపు నెట్టాలి.
అప్‌వర్డ్ డాగ్
దీనే్న అప్‌వర్డ్ డాగ్ భంగిమను చేసే సమయంలో తుంటి భాగాన్ని నేల వైపు దించి ఉండాలి. శ్వాసను బయటకు వదలాలి. ఇప్పుడు కాలి బొటనవేళ్ళను లోనికి మడవకుండా అరచేతులను నేలవైపుకు తోయాలి. చేతులను నిఠారుగా ఉంచి ఛాతిని పైకి ఎత్తాలి. పొత్తికడుపు కండరాలను కూడా ఇందులో నిమగ్నించాలి. చెవుల నుండి దూరంగా భుజాల అంచులు ఒకదానితో ఒకటి ఆలింగనం చేసుకోవాలి. చివరగా నడుమును పైకెత్తేటప్పుడు శ్వాసను వదలాలి. తిరిగి డౌన్ వర్డ్ డాగ్ భంగిమలోకి వచ్చేయాలి.
సైడ్ ప్లాంక్
సైడ్ ప్లాంక్ భంగిమలో శరీరాన్ని మొత్తాన్ని తిప్పాలి. ఎడమ ఎగువ వైపుకు కుడి కాలిని ఉంచాలి. ఈ విధంగా చేస్తున్నప్పుడు శ్వాసను బయటకు వదిలేయాలి. ఇప్పుడు శరీరాన్ని పొత్తి కడుపు కండరాలకు సమాన వరుసలో ఉంచి బిగువు పర్చి, శరీరాన్ని కింది వైపుకు నెట్టాలి. వేళ్లు పై కప్పు ఎదుర్కొనే విధంగా కుడిచేతిని పైకెత్తాలి. ఈ భంగిమలో ఉండగా, దృష్టిని ముందుకు లేదా పైకి కేంద్రీకరించాలి. చివరగా శ్వాసని లోనికి పీల్చుకుంటూ మరియు యథాస్థానానికి తిరిగి వచ్చేయాలి. ఇదేవిధంగా మరోవైపు కూడా పునరావృతం చేయాలి.
ప్లాంక్
ప్లాంక్ భంగిమలో నడుము కిందివైపుకు దించి ఉండాలి. ఈవిధంగా చేస్తున్నప్పుడు శ్వాసను లోనికి పీల్చుకోవాలి. మణికట్టు వైపుకు నేరుగా భుజాలతో మొండాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మోచేతులను ఏమాత్రం కూడా వంచకూడదు. పొత్తి కడుపు కండరాలను సంకోచింపచేస్తూ చేతులు నిఠారుగా ఉంచాలి. ఈ సమయంలో శరీరం తల నుంచి బొటనవేలు వరకు ఒకే పంక్తిలో ఉందని నిర్ధారించుకోవాలి.
చతురంగ
చతురంగ భంగిమలో శరీరం చాప వైపు ముఖం చేసి ఉండాలి. శరీరం ఒక సరళ రేఖలో సమలేఖనమై ఉంచి శ్వాసను వదలాలి. శరీరాన్ని నేలకు దగ్గరిగా చేస్తూ మోచేతులను 90 డిగ్రీల వరకు వంచాలి. పొత్తికడుపు కండరాలను సంకోచింపచేయాలి. తరువాత భుజాలు ముందువైపుకు చుట్టుముట్టకుండా ఉండడాన్ని నివారించాలి.
ఈ ఆసనాలను రోజూ చేయడం వల్ల నాజూకైన, బిగువైన చేతులను పొందవచ్చు.