సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహజానందం
ప్రాపంచిక వైభోగాలు ఎన్నాళ్లుంటాయి? ఆలోచించండి. దేవుని యిచ్ఛ వల్లనే అవి కలుగుతాయి. ఆపైన అవి యిట్టే నశిస్తాయి. అందుకే లౌకికానందాల పట్ల వెంపర్లాట మానండి! పరమాత్మ అందరిలోనూ వున్నాడు. ఆయనను దర్శించే దృష్టిని సంపాదించుకోండి!
మనకేదైనా మంచి జరిగితే విచారపడం. ఏదైనా చెడు జరిగితేనే విచారిస్తాం. మంచి అనేది సహజం. వక్రించటమే చెడు. తప్పు చేస్తే సిగ్గు పడతాం. నష్టం వస్తే బాధ పడతాం. కష్టం కల్గితే దుఃఖపడతాం.
ఆనందం ప్రకృతి ససజ లక్షణం. దుఃఖమే దాని వికృతి. ఈ సంగతి మనిషి గ్రహించక పోవడం దురదృష్టం!
ఆనంద తాండవం
పాములు వంకర టింకరగా పాకుతూపోతాయి. ఇంద్రియాలను నమ్ముకొంటే నీకూ వంకర నడకే గతి! పాముకు కోరలలోనే విషం కానీ నరుడికి నిలువెల్లా విషమే.
విష సర్పం కూడా చక్కని సంగీతం వినిపిస్తే పడగను ఎత్తి వూగిస్తూ తన్మయత్వంతో వింటుంది. మనిషి కూడా నామ మాధురికి విషయ వాసనలను మరచి తన్మయుడౌతాడు. నిర్వికల్ప స్థితిని సాధించినప్పుడు దివ్యానందంతో నర్తిస్తాడు.
పంచేంద్రియాలు
పంచభూతాలకు కొన్ని తత్వాలు ఉంటున్నవి. అవి పంచేంద్రియాలపై తమ తమ ప్రభావం చూపుతూ ఉంటున్నాయి.
శబ్దం ఆకాశతత్వం. స్పర్శ వాయు తత్వం. దృష్టి అగ్నితత్వం. రుచి జల తత్వం. గంధం (వాసన) పృథ్వీతత్వం. భౌతిక ప్రపంచంలో మెలగే మనిషి పంచేంద్రియాల ద్వారానే సుఖ దుఃఖాలననుభవిస్తూ వున్నాడు. అయితే అతని లక్ష్యం ఇంద్రియ సుఖంకాదు. అతీంద్రియమైన ఆత్మానందం.
ప్రతీకల ప్రయోజనం
పూజలూ, వ్రతాలూ చూసి హేళన చేసేవారుంటారు. అదంతా మూఢ నమ్మకం అంటారు. ఈ రాయి భగవంతుడా? ఈ కాగితంముక్క దైవమా? - అనడుగుతారు వారు. అది సరికాదు. సంప్రదాయంగా విధించబడిన అర్చనల ద్వారా పూజల ద్వారా సాక్షాత్కారం పొందిన సాధకులెందరో యున్నారు. వర్ణించ వీలుకాని ఆ ఆనందంలో ఓలలాడుతూ వుండిపోయారు.
సంశయంవల్ల సాధించేదేదీ లేదు. ఆలోచించు. భూమిపై పుట్టిన ప్రతివ్యక్తీ చేయాల్సిన పనేమిటి? ముందు మానవుడుగా మారటం. తరువాత దివ్యత్వాన్ని సంతరించుకోవడం. ఆత్మానందాన్ని అనుభవించటం. వేదాలు ప్రబోధించిన రాజయోగమిదే!
ఆత్మ అన్నిటినీ ప్రకాశింపచేస్తుంది. ఆత్మకు మరొక దీపమెందుకు? ఆత్మ విశ్వఋషి. ఆత్మను దర్శించే స్థాయికి చేరేదాకానే రుూ ప్రతీకలన్నీ.
దివ్య పిపాస
స్వామిది దివ్య జలాశయం. ఆనందమనే నీరు అనంతంగా వస్తుంది. తియ్యని నీరు. పరిశుభ్రమైన నీరు. ఈ నీరును మీరు త్రాగండి! మీ దాహమును చల్లార్చుకోండి! జీవితాన్ని శాంతి పరచుకోండి! మీరందరూ దాహమును తీర్చుకోవటానికే ఇక్కడకు వచ్చారు. ఏమిటి మీ దాహం? మామూలు దప్పిక కాదు. దివ్యపిపాస, చక్కగా త్రాగండి. మీరు తెచ్చిన హృదయ పాత్రలు నింపుకోండి. మీ ప్రదేశాలకు వెళ్ళండి. మీరు పొందిన ఈ ఆనందమును మీ ఇరుగుపొరుగువారికి కూడా పంచండి. వారితోకలిసి పంచుకోండి!
స్వస్తి వచనం
యత్ర యోగేశ్వరః కృష్ణో
యత్ర పార్థో ధనుర్దరః
తత్ర శర్వ్రిజయో భూతి
ర్ద్రువా నీతిర్మతిర్మమ
ఎక్కడ యోగీశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడో ఎక్కడ ధనుర్ధరుడైన అర్జునుడు ఉంటాడో అక్కడ తప్పక సంపదలు, విజయం, దివ్య ప్రభావం నెలకొని ఉంటాయి.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం
లోకాస్సమస్తా స్సుఖినో భవంతు
న్యాయ మార్గంలో ప్రజలకు శుభాలుకలిగేలా పాలకులు ఈ భూమిని పాలింతు గాక! గోవులకూ, బ్రాహ్మణులకూ నిత్యం శుభం కలుగుగాక! లోకాలన్నీ సుఖంగా ఉండుగాక!
శ్రీరస్తు !శుభమస్తు! విజయోస్తు
*
సాయి సాయుజ్య ప్రాప్తిరస్తు