సబ్ ఫీచర్

దీపారాధనతో లక్ష్మీకటాక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సగుణం నుంచి నిర్గుణానికి దారి ఏర్పరుచుకోమంటుంది భారతీయం. తమస్సునుంచి ఉషస్సులోకి రమ్మంటుంది. తనవారైనా ధర్మం ధర్మమే నని చెప్పే హైందవం ప్రతి పండుగలోను ప్రతి పర్వంలోను ధర్మనిరతికి పదునుపెడుతుంది. తన కుమారుడే లోకకంటకుడుగా మారితే తల్లిగా భూదేవి వగచింది. మంచిమాటలు చెప్పి చూచింది. లోకకల్యాణ కరమైన పనులు చేయమని ఎన్నోవిధాలుగా ప్రోత్సహించింది. భగవంతునికి శరణు వేడితే మంచిగుణాలు వస్తాయని తపస్సును చేయమంది.
కాని ఇంద్రియలౌల్యుడైన నరకుడు తల్లి మాట ప్రకారం తపస్సు నైతే చేశాడు. భగవంతుణ్ణీ మెప్పించాడు. ఇంద్రియ విజేత కాలేకపోయి తన తల్లి చేతిలోనేమరణ వరాన్ని కోరుకున్నాడు. కేవలం గుణాల వల్లే మనిషిలో మంచి చెడు అన్న భావాలు ఉద్దీప్తం చెందుతాయి. సత్వగుణం ప్రబలమైతే పదుగురికీ ఉపయోగపడే పనులు చేసి లోకకల్యాణకారులు అవుతారు. రజస్తమోగుణాల ప్రభావానికి లోను అయితే లోకకంటకులుగా మారుతారు. ఈవిషయాన్ని చెప్పేదే దీపావళి.
భగవదాజ్ఞకు బద్ధమైన ఈ మానవ జీవితంలో పూర్వజన్మ వాసన వల్ల కొన్ని అనివార్య సంఘటనలు ఏర్పడుతాయి. వాటినుంచి తప్పించుకోవాలంటే తిరిగి భగవంతుణ్ణే ప్రార్థించాలి. ఆ నరకుడు స్వయంగా వరాహస్వామికి భూదేవి కి జన్మించినప్పటికీ లోకకంటకుడుగా మారాడు. తిరిగి ఆ భగవంతుని చేతిలోనే మరణించాడు. ఉతృష్టమైన మానవజన్మను సార్థకం చేసుకోవాలి. మానవుడూ రెండు కాళ్ల జంతువు. ఆ జంతువులోని పశుత్వాన్ని వీడి దివ్యత్వాన్నిసంతరించుకోవాలని చెప్పే పండుగే దీపావళి.
నరక శబ్దానికి దుర్గతి అన్న అర్థమూ ఉంది. ఈ దుర్గతి నుంచి సద్గతిని కలిగించమని ఆశ్వీయుజ అమావాస్య నాడు బాణాసంచా కాల్చుతారు. చీకటినిండిని గగనాన్ని దీపతోరణాలతో వెలుగులమయం చేస్తారు. ఆ వెలుగుల తోరణాలు పట్టుకొని మృత్యువాత పడి నరకలోకంలో కొట్టుమిట్టాడుతున్న వారు స్వర్గానికి వెళ్లగలిగే జ్యోతిస్వరూపాలు ఈ దీపావళి తారావళులు.
‘‘ తైలేగంగా జలే లక్ష్మీ’’ అంటూ దీపావళి నాటి ప్రత్యూష వేళ తైలాభ్యంగన స్నాన ఫలం లక్ష్మీ గంగలు ఆశీర్వదిస్తారని తులామహాత్య్మం చెబుతుంది.
శ్రీ హర్షకవి తన నాగానంద కావ్యంలో దీపావళిని ‘దీప ప్రతిపదోత్సవం’ , రాజశేఖర కవి దీపమాలిక అని వ్యవహరించాడు. కొన్ని గ్రంథాలు దీపావళిని ‘కౌముదీ’ మహోత్సవంగా అభివర్ణించాయ.
భవిషోత్తరపురాణం కాలమేఘ గర్జనలు సమసిపోయి దశదిశలూ వెలుగులు నిండినప్పుడు శ్రీరామవిజయానికి యువతీగణం ఆనందంగా వెలిగించిన ఈ దీపావళి సమస్త పాపాలను హరించి శాంతిని ప్రసాదించుగాక’’ అని ఆశీర్వచనాలను ఇస్తోంది.

- చరణ శ్రీ