సబ్ ఫీచర్

బాబోయ్ రక్తపోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధిక రక్తపోటు అనేది యాభైదాటిన తరువాత వచ్చేది. కాని ప్రస్తుత జీవన విధానం వల్ల చిన్న వయసులోనే అధిక రక్తపోటు వస్తోంది. ఆడ, మగ అనే తేడా లేకుండా వేధిస్తుంది. దీన్ని అదుపులో ఉంచటానికి మందులే కాదు మన జీవనవిధానంలో ఆహార మార్పుతీసుకురాకపోతే దీని ప్రభా వం తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల జరిపిన సర్వేలోదాదాపు 20 కోట్ల మంది రక్తపోటుతో బాధపడుతున్నట్లు వెల్లడయింది. ఇందులో 40 ఏళ్లు దాటినవారు 101 కోట్ల మంది అధిక రక్తపోటుకు గురవుతున్నట్లు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఆఫ్రికా, దక్షిణాసియా దేశాలలో పసితనంలో పిల్లలకు పోషకాహారం అందించకపోవటం వల్ల వయసు పెరిగిన తరువాత గుండెపోటుకు గురవుతున్నట్లు పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
అధిక ఒత్తిడి రక్తనాళాల మీద పడి రక్తపోటుకు దారితీస్తుంది. అంతేకాదు గుండె, బ్రెయిన్, కిడ్నీల మీద ప్రభావం చూపుతోంది. గుండె సంబంధిత వ్యాధుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 7.5 మరణాలు సంభవిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. యూరోప్, బ్రిటన్ దేశాలలో గత ఏడాది అధిక రక్తపోటుతో బాధపడినట్లు ఈ సర్వేలో తేలింది. అలాగే కొరియా, యూఎస్, కెనడా దేశాలలో అత్యల్ప రక్తపోటు నమోదైంది. ఆసియాలో ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే ప్రపంచంలో సగం కంటే ఎక్కవ రక్తపోటుతో బాధపడేవారు ఇక్కడ ఉన్నట్లు సర్వేలో స్పష్టమయింది. భారతదేశంలో 20 కోట్ల మంది, చైనాలో 22 కోట్ల్ల మంది అధిక రక్తపోటుతో అల్లాడుతున్నారు. ఈ రక్తపోటు అనేది దేశ ఆర్థిక స్వావలంబనకు నిదర్శనంగా చెప్పవచ్చని లండన్‌కు చెందిన ఇంపీరియల్ కాలేజీ అధ్యపకులు మాజిద్ ఎజ్జాటి అంటున్నారు.
ధనిక దేశాలలో కూడా దీని ప్రభావం అధికంగానే ఉన్నప్పటికీ మందులతో అదుపులో ఉంచుకోగలుగుతున్నారని ఆయన తెలియజేస్తున్నారు. రక్తపోటు ఉన్నవారు సాధ్యమైనంత వరకు ప్రశాంత జీవనం గడపటానికి ప్రయత్నించాలి. మనోవేదనతో ఎక్కువ ఆలోచనలు చేయటం తగదు. యోగా చేయడం ద్వారా ఆలోచనలను నియంత్రించుకోవచ్చు. ఆహ్లాదకరమైన ప్రదేశాలను ఎంపిక చేసుకుని ఎక్కువ సమయం అక్కడ గడిపితే రక్తపోటు అదుపులోకి వస్తుంది. అంతేకాదు వంటనూనెకు నువ్వుల నూనె వాడితే రెండు నెలలో బీపీని పూర్తిగా తగ్గించుకోవచ్చని భారతీయ వైద్యుల పరిశోధనలు సైతం చెబుతున్నాయి. ఆహారంలో తక్కువ ఉప్పు, పళ్లు, కూరగాయలు వంటి సాత్వికాహారం తీసుకుంటే రక్తపోటును నియంత్రించుకోవటం సులువే.