సబ్ ఫీచర్

అందానికి అమ్మే స్ఫూర్తి : కాజోల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దాదాపు 25ఏళ్ల నుంచి నటిగా ప్రస్థానం సాగిస్తున్న అందాల కాజోల్ ఇప్పటికీ అదే యవ్వన నిగారింపుతో మెరిసిపోతుంటుంది. ఇటీవల ఆమె ఓ బ్యూటీ కార్యక్రమానికి హాజరై తన అందం వెనుక దాగి ఉన్న రహస్యాలను వెల్లడించింది. ఆ విషయాలు ఆమె మాటాల్లోనే..
నాకు తెలుసు నేను అందంగా ఉంటాను. వయసు పెరుగుతున్నప్పటికీ యవ్వన ప్రకాశంతో మెరవటానికి మా అమ్మే నాకు స్ఫూర్తి. మనకోసం మనం పనిచేస్తే అదే గొప్ప ప్రేరణ. అమ్మ వయసు నాటికి నేను కూడా ఆమె వలే ఉండాలని కోరుకుంటాను. అందానికి సంబంధించి నా చిన్నప్పటి జ్ఞాపకాలు ఇంకా గుర్తే. చిన్నప్పుడు మా అమ్మ డ్రెస్సెంగ్ టేబుల్ వద్ద కూర్చొని మేకప్ చేసుకుంటుంటే ఆ మేకప్ గురించి తెలియక అది వేసుకోవాలంటే ఏవగింపు కలిగేది. కాని అమ్మ మేకప్‌ను ఒక ఆర్ట్ వలే పరిశీలించేదాన్ని. ప్రతి మహిళ చూడటానికి మంచిగా కనపడాలని ఆరాటపడుతుంది. అందుకే ఆమె అద్దం ముందు నిలబడి ఏదైనా క్రీమ్ రాసుకునే ముందు..‘‘ వావ్! ఈ క్రీము ఎంతో ముఖ్యమైంది. ఇది ఎన్నడూ ఉపయోగించలేదు’’ అనుకొని అప్లయ్ చేస్తే బాగుంటుంది. దీనిపాటు రోజు పాటించాల్సిన కొన్ని చిట్కాలను ఆమె వెల్లడించింది.
అందాల ప్రపంచంలో ఉండే నాకు జన్యుపరంగానే అందం సంక్రమించి ఉండవచ్చు. ఈ అం దాన్ని ఇంత వయసు వచ్చినా.. ఇలాగా కొనసాగటానికి కొన్ని నియమాలు పాటిస్తాను.
నిద్రకు ఉపక్రమించే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని నిద్రపోతాను. నాకళ్లు మూతపడుతున్నా మేకప్ అంతా తీసేసి నైట్ క్రీమ్ రాసుకుని పడుకుంటాను.
మంచినీళ్లు ఎక్కువగా తాగుతాను. తప్పనిసరిగా రెండున్నర లీటర్ల నీళ్లు తాగుతాను. మంచినీళ్ల బాటిల్ తీసుకువెళ్లటం నాకు చిన్నతనంగా అనిపించదు. శరీరం చురుకుగా, ప్రకాశవంతంగా ఉండటానికి నీళ్లే ఆధారం.
నా పిల్లలలు కూడా మంచినీళ్లు తాగుతున్నారా లేదా అని పరిశీలిస్తాను. ఇప్పటికే వాళ్లకు నీళ్లు సమృద్ధిగా తాగమని శిక్షణ కూడా ఇవ్వటం జరిగింది. ప్రతిరోజూ చల్లటి నీళ్లతో మూడుసార్లు ముఖం కడుక్కోండి.
మన నిజాయతీని ఎవరో ఒకరు నిశితంగా పరిశీలిస్తున్నారని ప్రతిఒక్కరూ భావిస్తూ చెదరని చిరునవ్వుతో ఉంటే అందరూ మన వంకే చూస్తారు.