సబ్ ఫీచర్

కల్తీకి దూరం.. ఆరోగ్యం పదిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీవారు తెచ్చిన ఎండుమిరపకాయలను దగ్గుతూ, తుమ్ముకుంటూ ఓరెం డు రోజులపాటు బాగా ఎండబెట్టి పనివాళ్ళతో తొడిమలు తీయించి కొంత ఉప్పు వేసి మరపట్టించాను.
అబ్బ.. ఆ కారప్పొడిని చూసి అబ్బురపడటం నా వంతైంది. మంచి రంగుతో ఘుమఘులాడిపోతోం ది. ఇక కూరల్లో పిసరంత వేసినా ఆ కారమే వేరుగా ఉం టోంది. కూరలు కూడా రంగు రుచి వాసనతో ఎంతో బాగుంటున్నాయి.
అదేంటో.. ఆ సమయంలో శ్రమ వృధా అనిపించింది కాని, తరువాత మరపట్టించిన కారప్పొడిని చూసి ఆ శ్రమను పూర్తిగా మరచిపోయాను.
ఈమధ్యకాలంలో కల్తీ కారప్పొడి గురించి విని బెంబేలెత్తిపోక తప్పదు. అందు లో బూడిద, ఏవో రసాయనాలు ఉన్నాయని తెలుసుకున్నాను. అది తిన్నవారికి క్యాన్స రు వంటి రోగాలు వస్తున్నాయని తేలింది.
పసుపు కొమ్ములు తెచ్చి వాటిని నానబెట్టి వాటిని దంచి పసుపు పొడిని ఇంట్లోనే ఎంతోమంది తయారుచేసుకుంటున్నారు. రంగుల మిశ్రమమైన పసుపు పొడిని కదా మనం వాడుతున్నది. ఆ విషయం తెల్సి కూడా మనం వాడుతున్నామంటే అది మన బద్ధకమా? బలహీనతా? ఇది కొందరికి చాదస్తంగా కన్పించవచ్చు. కాని రెడీమేడ్ వస్తువులు కొంటే అవి ఎంత హానికరమో- వాటినే మనం శ్రమ అనుకోకుండా ఇంట్లో తయారుచేసుకుంటే ఎంత మేలు చేస్తాయోనన్న విషయాన్ని మరిచిపోతున్నాము.
ఈ కోవకి చెందినవే రసం పొడులు, సాంబారు పొడులు. అలాగే వివిధ మసాలాలు. వీటినే ఇంట్లోనే ఆడవాళ్ళు కావాల్సినంత జీలకర్ర, మెంతులు, ధనియాలు, కరివేపాకు వేయించి మిక్సీలో వేసి భద్రపరచుకుంటే రసం సాంబాబురు ఘుమఘుమలాడిపోతాయి కదా!
ఇంకా చాలామందికి మరీ బద్ధకం. ఇంట్లో పిల్లలు ఉదయం వేళల్లో స్కూలుకు వెళ్తుంటే, వేడి వేడి టిఫిను చెయ్యకపోగా, ‘‘ఏమండీ, టిఫిన్ చెయ్యడానికి అట్టే టైము లేదు, హోటల్‌కు వెళ్లి టిఫిన్ పట్రండి’’ అంటూ భర్తలను పురమాయిస్తుంటారు.
భర్తలు వెళ్లి హోటల్లో ఏది దొరికితే అది తెచ్చి పిల్లలకు పెడుతుంటారు. మరికొందరు ముందురోజు సాయంత్రం బజారుకు వెళ్లి ఏ బేకరి ఐటెమో లేదా బజారులో దొరికే ఏ తినుబండారమో తెచ్చిపెట్టుకుని వాటిని టిఫిన్ బాక్సుల్లో పెట్టి యిస్తుంటారు. ఇంట్లో అందరి ఆరోగ్యాలు బాగుపడాలంటే మనం కొంత శ్రమపడక తప్పదు.
‘అమ్మా! ఆకలి, ఏదైనా పెట్టు’ అని పిల్లలు అడిగితే, ఉండర్రా, ఇప్పుడే నూడిల్స్ చేసిపెడ్తాను అంటూ, అట్టే శ్రమపడనక్కర్లేని ఆ వంటకాన్ని చేసి పెడుతుంటారు. ఒక్కోచోట ఆ నూడుల్స్‌ను పిల్లలే స్వయంగా వంటింట్లో దూరి చేసుకుని తినడం జరుగుతోంది.
మరికొందరు పిల్లలు, ‘అమ్మా.. డబ్బులు యివ్వవే, అలా రోడ్డుదాకా వెళ్లి పానీపూరి, సమోసాలు తినివస్తాను’ అని అడుగుతుంటారు. ఇక తనకు టిఫిన్ చేసే శ్రమ తప్పిందని వాళ్ళు అడిగిందే తడవుగా డబ్బులిచ్చి పంపిస్తుంటారు.
అలా వెళ్లిన పిల్లలు దుమ్ము ధూళి పడిన తినుబండారాలను తిని రోగాలను కొనితెచ్చుకుంటూ ఉంటారు. దీనికి అలవాటుపడిన పిల్లలకు ఇంట్లో వంటకాలు రుచించవు. బయట పదార్ధాలనే కోరుకుంటారు. శ్రమనుకోకుండా చేసుకుంటే అందరి ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. నా ఉద్దేశ్యం కాదుగాని- కొందరి ఇళ్ళల్లో పిల్లల ప్రవర్తన, తల్లుల ప్రవర్తన చూశాకే యిలా వ్రాయటానికి ప్రేరేపించింది. ఇడ్లీపిండి, దోశె పిండి వంటివి రెడీమేడ్‌గా దొరుకుతూ ఆడవారికి పనిభారం తగ్గించిందని సంతోషించాలో లేక ఇలా కల్తీవి లభిస్తున్నాయని బాధపడాలో తెలియడంలేదు.

- పి.షెహనాజ్