సబ్ ఫీచర్

అర్థనారీశ్వరతత్త్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మవారు శరీరానే్న పంచుకొని ఉన్నది. దీని అర్థమేమిటి? చిద్రూపం శివతత్త్వమైతే, సద్రూపం శక్తి తత్త్వం. సత్ చిత్‌లు వినాభూతమైనవని చూపటం అది. దానికి రూపకల్పనమే ఆయన అర్థనారీశ్వర తత్త్వం. ‘సత్య జ్ఞానానంద రూపా సామరస్య పరాయణా’ అన్నది లలితా సహస్రనామం.

శివరాత్రి మహాత్మ్యం
మహాశివరాత్రి పర్వదినంలో మృగములను వేటాడే నిమిత్తం ఒక వేటగాడు చెట్టుపై ఎక్కాడు. చెట్టుకు సమీపంలో వలను వేసి పెట్టాడు. ఎంత రాత్రియైనా ఒక్క మృగము కూడా ఆ దిక్కుకు రాలేదు. ఈ జాగరణలో చెట్టు ఆకులను త్రుంచి క్రింద వేయసాగాడు. అతను ఎక్కి కూర్చున్నది ఒక బిల్వ వృక్షము. అతనికి తెలియకుండానే శివరాత్రి రోజున శివునికి బిల్వార్చన చేశాడు. తెల్లవారింది, ఇంటికి వెళ్లాడు. అతని భార్య కూడా భర్త రాకకోసం ఎదురుచూస్తూ జాగరణ చేసింది. ఉపవాసం చేసింది. దీని ఫలితంగా భార్యాభర్తలిద్దరూ శివసాన్నిధ్యం అందుకున్నారనే గాధ, శివరాత్రి మహాత్మ్యమునకు స్ఫూర్తినిస్తుంది.