సబ్ ఫీచర్

చిరునవ్వుతో గెలిచింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘చిరునవ్వు వెల ఎంత అంటే మరుమల్లె పువ్వంత’ అని అంటారు. చెదరని నవ్వును ఆభరణంగా చేసుకుని ఆమె సాధించిన విజయం ముందు వైకల్యం తలవంచింది. శ్రీలత ఐబిఎంలో పనిచేసే ఓ దివ్యాంగురాలు. నిన్నమొన్నటివరకు ఐ.బి.ఎంకే పరిమితం అయిన ఆమె ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.
మిస్ వీల్ ఛైర్ ఇండియా పీజెంట్- 2015లో ‘మిస్ బ్యూటీఫుల్ స్మైల్’గా ఆమె ఎంపిక అయ్యారు.

శ్రీలత కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలోగల శిరుగుప్ప గ్రామంలో 1982లో జన్మించారు. మూడు సంవత్సరాల వరకు ఆమె చాలా ఆరోగ్యంగా ఉంది. అనంతరం పోలియో కారణంగా రెండు కాళ్ళు పనిచేయలేదు. ఆమెకు వైద్యం చేయించడానికి తల్లిదండ్రులు వెళ్లని హాస్పిటల్ అంటూ లేదు. అయినప్పటికీ ఎటువంటి ఫలితం లేదు. శ్రీలతను ఇంట్లోనే ఉంచి ఆమె తల్లి చదివించడం ప్రారంభించింది. అనంతరం 13 సంవత్సరాల వయసులో స్కూల్‌లో నాల్గవ తరగతిలో చేర్పించారు. ఆమె తన దృష్టిని చదువుపై కేంద్రీకరించి, పియుసి పాసయ్యారు. అనంతరం బెంగుళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో డిప్లొమా ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ పూర్తిచేశారు.
డిజైనర్‌గా పనిచేయాలనే తపనతో ఆమె బెంగుళూరులోని పలు సంస్థలకు వెళ్లి, తాను రూపొందించిన డిజైన్లు చూపించారు. అందరూ ఆమె రూపొందించిన డిజైన్లు బాగున్నాయని మెచ్చుకునేవారే తప్ప, అంగవైకల్యం కారణంగా ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. అయినప్పటికీ ఆమె నిరుత్సాహపడకుండా, తన ప్రయత్నాలు కొనసాగించారు. చివరకు ఒక కాల్‌సెంటర్‌లో చేరారు. 2013లో జరిగిన ఇండియన్ ఇన్‌క్లూషన్ సమ్మిట్‌లో పాల్గొనడంతో ఆమె జీవితం మలుపు తిరిగింది. ఎనేబుల్ ఇండియా అనే స్వచ్ఛంద సేవా సంస్థలో చేరారు. అదేసమయంలో ప్రముఖ సంస్థ ఐబిఎంలో డిఫరెంట్‌లీ ఎబుల్డ్ పర్సన్‌కు ఒక ఉద్యోగం ఇస్తున్నారని తెలిపి, ఆమె దరఖాస్తు చేశారు.
వీల్‌చైర్‌లో ఉన్నవారికే ఉద్యోగం ఇస్తామని ఐబిఎం స్పష్టం చేసింది. తనకు వీల్‌చైర్‌లో ఉండటం ఇష్టంలేదని, వీల్‌ఛైర్ కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత తమ కుటుంబానికి లేదని శ్రీలత తెలిపారు. ఎట్టకేలకు ఆమె ఐబిఎంలో చేరారు. ప్రస్తుతం ఆమె ఐబిఎంలో అక్కౌంట్స్ విభాగంలో సీనియర్ ప్రాక్టీషనర్‌గా పనిచేస్తున్నారు. ఒక రోజు కంప్యూటర్‌లో సెర్చ్ చేస్తుండగా గూగుల్ వారి ప్రకటన కనిపించింది. ఆమె సరదాగా తన ఫొటో తీసి పంపించారు. మిస్ బ్యూటీఫుల్ స్మైల్ విభాగంలో తాను ఎంపికైనట్లు వచ్చిన మెయిల్ చూసి ఆమె ఆనందభరితురా లు అయింది. తన మోడలింగ్ కల ఇప్పటికీ సజీవంగానే ఉందంటారు శ్రీలత. తన దుస్తులు తానే డిజైన్ చేసుకొంటానని, తన తల్లి, వదినలు అందుకు సం బంధించిన మెటీరియల్ తీసుకువచ్చి సహకరిస్తారని ఆమె చెప్పారు. ప్రపంచ సుందరి సుస్మితాసేన్ మాట్లాడే విధానం, ఆమె వ్యవహారశైలి తనకు స్ఫూర్తిని కలిగించాయంటారు. అంగవైకల్యం కల్గిన ఆత్మవిశ్వాసం ఉన్నత స్థాయికి ఎదగవచ్చు అనడానికి శ్రీలత ఒక ఉదాహరణ మాత్రమే. ఆమె భవిష్యత్తులో డిజైనర్‌గా రాణించాలని ఆశిద్దాం.

- పి.హైమావతి