సబ్ ఫీచర్

ఖాదీకి ఫిదా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది ఖాదీ సీజన్. ఒకప్పుడు రాజకీయ నాయకులు, వయసు మళ్లినవారు మాత్రమే ధరించేవారు. కాని నేడు ట్రెండ్ మారింది. వివిధ రంగు ల్లో లభ్యమవుతున్న చేనేత దుస్తులకు డిమాండ్ పెరిగింది. అవి యువతను ఆకట్టుకోవటంతో తక్కువ ధరలో మన్నిక ఎక్కువ కలిగిన చీరలు, మగవారికి స్కర్ట్స్, కుర్తాలు దొరుకుతున్నా యి. అంతరించిపోతున్న ఖాదీ కళకు నేడు సెలబ్రిటీలు ప్రాణం పోస్తున్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటున్నా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు ఖాదీ స్థానా న్ని పదిలం చేసేందుకు డిజైనర్లు సైతం ఆసక్తి చూపుతున్నారు. పర్యావరణాన్ని కాపాడే సహజ సిద్ధమైన కూరగాయల రంగులతో చిత్రీకరించే ఈ డిజైన్లు కనికట్టు చేస్తున్నాయంటున్నారు హైదరాబాద్‌కు చెందిన డిజైనర్ శ్రావణ్ కుమార్. దాదాపు రెండు దశాబ్దాలుగా ఖాదీ కలెక్షన్లు చేస్తున్న శ్రావణ్‌కుమార్ చీరలు, ప్రింట్ జాకెట్లు, పొడవైన గౌన్లు ఖాదీలో లభిస్తున్నాయని చెబుతున్నారు. ఖాదీలో వస్తున్న ఆధునిక డిజైన్లు యువతకు బాగా నప్పుతున్నాయి. మేనుకు చల్లదనం, హుందాతనాన్ని ఇచ్చే ఈ ఖాదీ దుస్తులు చేతితో తయారుచేసినవాటినే ఇష్టపడుతున్నారని, దీనివల్ల అంతరించిపోతుందనుకుంటున్న ఖాదీకి నేడు మంచి డిమాండ్ తీసుకువచ్చేందుకు ఈ యువ డిజైనర్ శ్రవణ్‌కుమార్ విశేషంగా కృషిచేస్తున్నారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 200 వీవర్స్ శ్రావణ్‌కుమార్ ఖాదీ కలెక్షన్లవల్ల ఉపాధి పొందుతున్నారు. వేతనాలు తక్కువగా ఉన్నా సంప్రదాయ కళ అంతరించిపోకూడదనే సంకల్పంతో రాబోయేతరం ఖాదీని వృత్తిగానూ, ఫ్యాషన్ ట్రెండ్‌గా ఎంచుకోవాలంటే ప్రోత్సాహం అవసరం అంటున్నారు శ్రవణ్‌కుమార్. అందుకే గత రెండు దశాబ్దాలుగా ఖాదీ కల్చర్ ప్రోత్సాహానికి తన వంతు కృషిచేస్తున్నారు. శ్రవణ్ కుమార్ వంటి ఫ్యాషన్ డిజైనర్లు సరికొత్త ఖాదీ డిజైన్లు రూపొందిస్తూ యువత చూడగానే దుస్తులు కుట్టించుకోవాలనిపించేలా చేస్తున్నారు. ఆధునిక డిజైన్లతో, సరికొత్త ప్రయోగాలతో ఖాదీ సొగసులు అద్దుకుంటూ రాబోయే కాలంలో ఈ సహజ సిద్ధమైన వస్త్రశ్రేణి దూసుకుపోతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

చిత్రాలు.. సహజ సిద్ధమైన కూరగాయ రంగులతో తయారు చేసిన వస్త్రశ్రేణి

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 200 మంది నేత పనివారితో నేయంచిన వస్త్రాలు