సబ్ ఫీచర్

అందుకే నేరాలు పెరుగుతున్నాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినోదరంగంలో కీలక భూమిక పోషిస్తున్న సినిమా, టీవీలలో మహిళలను కించపరిచేలా, వారి వ్యక్తిత్వాన్ని చులకన చేసేలా రూపొందిస్తున్న కార్యక్రమాలవల్ల మహిళలకు వేధింపులు ఎక్కువ అవుతున్నాయని, నేరాలు పెరుగుతున్నాయని తమిళనాడుకు చెందిన ముగ్గురు ఐపీఎస్‌లు నిరసన వ్యక్తం చేశారు. మహిళలు లైంగికపరమైన దాడులకు గురవడానికి ఇవి పరోక్షంగా ప్రభావం చూపుతున్నాయని వారు పేర్కొన్నారు. ఆన్‌లైన్ పోర్టల్ ది కోవై పోస్ట్‌కు కోయంబత్తూరు ఎస్‌పి ఆర్.వి.రమ్యభారతి, డిసిపి ఎస్.లక్ష్మి, తిరుప్పుర్ డిసిపి దిషామిట్టల్ ఇచ్చిన ఇంటర్వ్యూలలో వారు వెల్లడించిన వివరాలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొట్టి సంచలనం సృష్టిస్తున్నాయి. వారి ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అయ్యింది. సినిమా పాటలు, సాహిత్యంలో మహిళలను కించపరిచే సన్నివేశాలు, సంభాషణల పట్ల సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం సినీమాధ్యమానికి ఉందని, అది వినోదరంగంలోని దర్శకులు, నిర్మాతల బాధ్యత అని వారు అన్నారు. అలా చేయకుండా విచ్చలవిడిగా, అతివలను చులకనచేసేలా సన్నివేశాలు, సంభాషణలు చిత్రీకరించడంవల్ల యువ హృదయాలను అవి చెడగొట్టి తప్పుదారిలోకి మళ్లిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులు, సాధింపులు, దుర్భాషలు, ఈవ్‌టీజింగ్‌కు సంబంధించి తమకు రోజూ పదిపనె్నండు ఫిర్యాదులు వస్తున్నాయని, అన్నీ ఇలాంటివాటివల్ల జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. చాలామంది తమ ఇబ్బందులను వివరిస్తున్నారుకానీ ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉండటం లేదని వారు చెబుతున్నారు. సమాజం, ప్రజలపై విస్తృత ప్రభావం చూపేది సినిమా మాధ్యమమని, దీనిని అతిజాగ్రత్తగా వినియోగించుకోవాలే తప్ప విజయం కోసం, వ్యాపారం కోసం సమాజంపై దుష్ప్రభావం చూపేలా ఉపయోగించరాదని లక్ష్మి అభిప్రాయపడ్డారు. దర్శకులకు సామాజిక బాధ్యత ఉందన్న విషయాన్ని మరచిపోకూడదని ఆమె అంటారు. మహిళలపై దాడి లేదా అసభ్యంగా ప్రవర్తిస్తూ పలికే సంభాషణలు, లేదా పాటలు రచించినవారు, ఆ సన్నివేశాల్లో అందుకుతగ్గట్లు నటించినవారు ఇందుకు బాధ్యత వహించాలని వారంటారు. చాలా సినిమాల్లో చూపిన సంఘటనల స్ఫూర్తిగా ఎన్నో నేరాలు జరగడం తమ దృష్టికి వచ్చిందని వారు చెబుతున్నారు. వినోదరంగం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పోలీసులు ఉన్నతాధికారులుగా తాము అందరినీ కోరుతున్నామని వారు చెప్పడం కొసమెరుపు.

చిత్రాలు..ఎస్.పి.రమ్యభారతి * డి.సి.పి ఎస్.లక్ష్మి *డి.సి.పి. దిశామిట్టల్