సబ్ ఫీచర్

బాధ్యతగా బట్వాడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు ఉత్తరాలు, పార్సిళ్ల బట్వాడా పోస్టల్ శాఖ చూసేది. మారిపోయిన పరిస్థితుల్లో కొరియర్ వ్యవస్థ వచ్చి చేరింది. ఆన్‌లైన్ మార్కెట్‌లు విస్తృతమయ్యాక వివిధ వస్తువులు, ఉత్తరాలు, సరుకులు అన్నీ ఇంటికే వచ్చే ఏర్పాట్లు పెరిగిపోయాయి. బాధ్యతగా ఆయా సరుకులు లేదా పార్సిళ్లను సంబంధిత వినియోగదారునికి అప్పగించడం వ్యాపారంలో కీలకమైంది. విసుగువిరామం లేకుండా వినియోగదారుడి మనసు చూరగొనడం ముఖ్యమన్నది వ్యాపారరంగంలో ప్రధాన సూత్రం. ఇప్పటివరకు అలా బట్వాడా రంగంలో పురుషులే పాలుపంచుకునేవారు. ఈ పని మహిళలకు అప్పగిస్తే ఎలా ఉంటుందబ్బా అనుకున్నాడు ఓ యువకుడు. ఆచరణలో పెట్టాడు. ఈ రంగంలోకి అడుగువేయాలనుకున్నవారికి ఆత్మరక్షణలో శిక్షణా ఇప్పించాడు. సత్ఫలితాలు సాధిస్తున్నాడు.
ఎంతకాలం ఇలా?
కొరియర్ వ్యవస్థ లేదా సరుకులు, వస్తువుల బట్వాడా పని ఆడవాళ్లు చేయలేరా? వారికి చిన్నపాటి ప్రోత్సాహం ఇస్తే ఈ రంగంలో రాణించలేరా అనేది యోగేష్ నమ్మిన సూత్రం. ఈ నమ్మకంతోనే ఈ యువకుడు స్థాపించిన ‘ఈవెన్ కార్గో’ అనే సంస్థ నేడు యువతులకు ఉపాధి అవకాశాలను చూపిస్తోంది. ‘్ఢల్లీ ఓపెన్ యువర్ ఐస్’ సంస్థ వ్యవస్థాపకులలో ఒకరైన యోగేష్ ఉత్తరాలు, చిన్నచిన్న పార్సిళ్లు, ప్యాకెట్‌లు, కార్టన్‌లు, చివరకు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నవేవైనా బట్వాడా చేసే బాధ్యతలు అమ్మాయిలకు అప్పగించాలనుకున్నాడు. సమాజంలో ఆడమగ సమానమే అని చాటిచెప్పటానికి ఈ సంస్థను ఏర్పాటు చేశాడు. ఏడాది క్రితం ఏర్పాటైన ఈ సంస్థలో చాలామంది మహిళలు డెలివరి విమెన్‌గా పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. మొదట్లో ఇలా ఉత్తరాలు, కొరియర్లు ఇవ్వడానికి అమ్మాయిలు వస్తే విచిత్రంగా చూసేవారు. ఆ తరువాత వారు పని పట్ల చూపిస్తున్న నిబద్ధత, పట్టుదలను చూసి కస్టమర్లు కూడా వారిని ఎంకరేజ్ చేస్తున్నారు.
ఆత్మరక్షణలో శిక్షణ
ఎంతైనా కీడెంచి మేలెంచాలి. అందుకే ఈ సంస్థలో చేరేముందు అమ్మాయిలకు తగిన తర్ఫీదు ఇస్తాడు. సెల్ఫ్ డిఫెన్స్‌లో మెళకువలు నేర్పిస్తాడు. ఊహించని సంఘటన ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేస్తాడు. పార్సిళ్లు అందించాల్సిన ప్రాంతం మరీ దూరమైతే తోడుగా ఒకరిని ఇచ్చి పంపుతాడు. ఎంతకాలం ఇలా అభద్రతా భావంలో బతుకుతాం. ఏదో జరుగుతుందనే నెగిటివ్ ఆలోచనతో ఎంతకాలం అమ్మాయిలు ఈ రంగంలోకి రాకుండా ఉంటే సమానత్వం ఎప్పుడొస్తుందన్నది అతడి ఆలోచన. అలా భయపడుతున్నంతకాలం అడుగులు ముందుకు వేయలేరని అంటాడు యోగేష్. జనం మైండ్‌సెట్ మారాలని, ఆడవాళ్లను చూసే దృష్టికోణం మారాలని ఈ యువకుడి ఆకాంక్ష. కాకపోతే ఈ సర్వీసులో చేరే అమ్మాయిలను ఏమని పిలవాలనేదే చిత్రమైన సందిగ్ధం ఇంకా కొనసాగుతుంది. డెలీవరీ అనే పదానికి అర్థం బిడ్డకు జన్మనివ్వటం. అంతమాత్రం చేత వాళ్లు ఈ కామర్స్ రంగంలో సరుకు డెలివరీ చేసే ఉద్యోగాలకు దూరం చేయటం భావ్యం కాదనే ఆవేదనతో యోగేష్ వేసిన ఈ ముందుడగు మరింత కార్యరూపం దాల్చి వారికి అండగా నిలుస్తుందని ఆశిద్దాం.
గుండు పిన్ను దగ్గర నుంచి తినే తిండి వరకు ఈకామర్స్‌తో ముడిపడివున్న ఈ రోజుల్లో వేరే అర్థాలు ఆపదించకుండా.. చులకన చేయకుండా మరింత మంది డెలివరీ విమెన్‌గా పనిచేయాలని కోరుకుందాం.

చిత్రాలు....‘ఈవెన్ కార్గో’ సంస్థ వ్యవస్థాపకులలో ఒకరైన యోగేష్