సబ్ ఫీచర్

కల్యాణాలు .. కానుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శుభలేఖ వచ్చిందంటే చాలు పెళ్లికి ఏం ప్రెజెంటేషన్ ఇవ్వాలి అని ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకుంటాం. దాన్ని కొనడం కోసం బజార్లలో పడి ఎక్కే షాపూ, దిగే షాపులా కాళ్ళు నొప్పులు పుట్టేలా తిరుగుతాం.
ఏం ప్రెజెంటేషన్ అయితే తక్కువ ధరలో కొన్నా ఘనంగా కనిపిస్తుందని ఆలోచించి ఆలోచించి చివరకు ఏదో ఒకటిలే అని రాజీపడతాం. ఇంతకీ తక్కువ ధరలో ఎక్కువ ఆర్భాటంగా కనిపించాలనే ఆరాటంతోనే ఈ అవస్థంతా. నిజానికి మనం ఇచ్చే కానుక పుచ్చుకొనేవారికి ఏది ఇష్టమో మనకి తెలియదు. మనం మనకి ఇష్టమని రాధాకృష్ణుల చిత్రం వెదికి వెదికి కొంటే వారికి తాజ్‌మహల్ చిత్రం ఇష్టం కావచ్చు. మనం ఎంతో శ్రమపడి, ఖర్చుపెట్టి కొన్న వస్తువుకి వారి దృష్టిలో ఏమీ విలువ లేకపోవచ్చు.
ఈ రోజుల్లో ఎంతో కావలసినవాళ్ళూ, లేదా వారివల్ల తిరిగి ఏదైనా లాభముంటుందా అని ఆలోచించి ఇచ్చే కానుకలే విలువ కలిగి వుంటున్నాయి. అలా బాగా కావాల్సిన వారికి వెండి సామాన్లు ఇచ్చినా, అది బ్యాంకు లాకర్లలో దాచటం తప్ప వాడేవారెవరూ లేరు.
వాడినా వాటికి ఇంట్లో రక్షణ లేదు. పైగా ఇప్పుడు ఇంట్లో వాడే సామానంతా గ్లాస్‌తో చేసినవి కానీ, లేదా పింగాణీతో చేసినవి కానీ వాడుతున్నారు. మనం ఎంత ఖరీదు పెట్టి కొని ఇచ్చినా ఫొటోలు, గడియారాలూ అవి గోడలకు తగిలించే ఫ్యాషన్ అయిపోయింది. అందుకనే నేడు పెళ్ళిళ్ళల్లో వచ్చిన గిఫ్ట్‌ప్యాక్‌లను తెరవనన్నా తెరవకుండా, మనం అతికించిన మన పేరు తీసేసి, వారు పెళ్ళిళ్ళల్లో ఇవ్వవలసి వచ్చినపుడు ఆ ప్యాక్‌లపై వారి పేరున స్లిప్‌లు అంటించి ఇచ్చేస్తున్నారు. అదేదో పత్రికలో కథలోలాగా ఇంటావిడ తన బంధువుకు పెట్టిన చీర తిరిగి తిరి గి తన దగ్గరకే వచ్చినట్లు, మనం ఇచ్చిన కానుక తిరిగి తిరిగి మన దగ్గరకే వచ్చినా ఆశ్చర్యం లేదు.
అసలు ఇదంతా ఎందుకనుకుంటే, మీరు ఇవ్వగలిగినది తృణమో, ఫణమో డబ్బు రూపం గా ఇచ్చేస్తే, వారికీ ఎంతో కొంత ఉపయోగం.
మనకీ శ్రమ తగ్గుతుంది. పెళ్ళైన వెంటనే ఫారిన్ వెళ్ళే జంటలకైతే ఇవ్వవలసిన కానుకల గురించి అసలు ఆలోచించకండి. వారు ఏ మూడు నాలుగేళ్ళకో తిరిగొచ్చేదాకా వాటి ని దాచడం కూడా చాలా కష్టం. వారికి డబ్బు రూపంగా అయితేనే కష్టం లేకుండా ఇష్టంగా ఉంటుంది. ఆలోచించండి మరి.

- కె.సత్యవాణి