సబ్ ఫీచర్

హాయిగా నవ్వండి.. ఆరోగ్యంగా వుండండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవులకు దేవుడిచ్చిన అపురూపమైన గొప్పవరం నవ్వు. ఈ భాగ్యం మానవాళికి మాత్రమే దక్కింది. హాయిగా నవ్వడంవల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలున్నాయి. మనసారా నవ్వితే ఆయువు పెరిగి శారీరక ఆరోగ్యం చేకూరి, చలాకీగా ఉండటంతో వత్తిళ్ళు దరిచేరవు. ప్రతిరోజు కనీసం 20 నిమిషాలు నవ్వగలిగితే మనలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మానసిక ఆందోళనను మటుమాయం చేసి మనస్సును ప్రశాంతంగా వుం చుతుంది. అంతేకాదు శత్రువులను కూడా మిత్రులుగా మార్చే గుణం ఈ నవ్వుకి ఉందంటే అతిశయోక్తి కాదు.
అవకాశం వచ్చినపుడల్లా హాయిగా నవ్వి చూడండి. మీకు తెలియకుండానే అధిక రక్తపోటు అదుపులోకి వచ్చి ఒత్తిడిని పెంచే హార్మోన్ల ప్రభావం తగ్గుతుంది. దాంతో గుండె జబ్బులు దూరం అవుతాయి. మనిషికి నవ్వు అద్భుతమైన టానిక్. నవ్వడంవల్ల శరీరానికి, మనసుకు ఎంతో మేలు కలుగుతుంది. హాయిగా నవ్వగలిగేవారి ముఖం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు నవ్వుకు రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచే గుణం ఉంది. నవ్వుకు దూరం అవ్వడం అంటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవడమే అవుతుంది. మనుషుల మధ్య నవ్వులు విరబూసి ఆనందాన్ని పంచుకుంటే బంధాలు బలపడతాయి. ఇన్ని ప్రయోజనాలున్న నవ్వు కన్నీళ్లను కడిగేసి కల్మషం లేని పువ్వులాంటిది. అందుకే హాయిగా నవ్వండి. ఆనందంగా జీవించండి.

- కాయల నాగేంద్ర