సబ్ ఫీచర్

వెండితెరపై నాలుగో సింహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహసం ఆమె ఊపిరి. ధైర్యం ఆమె ఆయుధం.
అందుకే పోలీసు అధికారిణిగా సంచలనాలకు మారుపే
రుగా నిలిచింది. ఏ పదవి చేపట్టినా.. అక్కడ తిష్టవేసే
అవినీతి, అక్రమార్కుల గుండెల్లో సింహస్వప్నంగా
నిలిచే తమిళనాడు ఐపీఎస్ అధికారిణి రూప. ఆమె
జీవితం కూడా వెండితెర మీద మెరవనున్నది. కన్నడ
దర్శకుడు ఏఎంఆర్ రమేష్ ఇందుకు సన్నహాలు
చేసుకుంటున్నారు. ఎంతోమంది పోలీసు అధికారులు,
రాజకీయ నాయకులు, క్రీడాకారులు, కళాకారుల
జీవిత కథలను ఆయన దర్శకత్వంలో వచ్చాయి. ఇపుడు
డీఐజీ రూప మీద కూడా బయోపిక్ తీయనున్నారు. ఈ
కథలో ఆమె జీవిత విశేషాలతో పాటు బెంగళూరు
పరప్పన అగ్రహార జైలులో బయటపడిన అక్రమాలు,
అన్నా డీఎంకే నాయకురాలు శశికళకు లభించిన అతిథి
మర్యాదలు కూడా ప్రేక్షకులకు కనువిందు చేయను
న్నాయి. ఈ చిత్రాన్ని ఏకకాలంలో కన్నడం, తమిళంలో
నిర్మించటానికి దర్శకుడు సన్నాహాలు చేసుకుంటు
న్నారు. అంతేకాదు ఈమేరకు రూప అనుమతి కూడా
తీసుకున్నారు. దీన్ని తెలుగులో కూడా అనువదించి
విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఆ పాత్రలో అనుష్క?
ఈ చిత్రంలో రూప పాత్రలో హీరోయిన్‌గా అగ్రతారలు అనుష్క లేదా నయనతారను ఎంపిక చేయనున్నారు. రూప చేత ఒక్క సీన్‌లోనైనా నటింపజేయాలని దర్శకుడు రమేష్ భావిస్తున్నారు. జైలు అక్రమాలు, ఐపీఎస్ అధికారిణిగా రూపు తీసుకున్న సంచలన నిర్ణయాలపై పరిశోధన చేసి చక్కటి కథను రూపొందించనున్నట్లు దర్శకులు రమేష్ చెబుతున్నారు. శశికళ పాత్ర కూడా ఈ సినిమాలో ప్రముఖంగా ఉంటుంది. ఈ సినిమా చూసిన తరువాత చక్కటి వివరాలను తెలుసుకున్నామని ప్రేక్షకుడు సంతృప్తి పడేలా సినిమాను రూపుదిద్దనున్నారు.
ఆ ప్రయత్నం ఆనందకరం
సంచలన పోలీసు అధికారిణి రూప ఈ సినిమా పట్ల సంతోషంగానే ఉన్నారు. ఎందుకంటే దర్శకులు రమేష్ పట్ల ఆమెకు సదభిప్రాయం ఉన్నది. ‘రమేష్ సంచలన దర్శకుడు. నిజ జీవతగాథలను తీయటంలో ఆయన దిట్ట అని తెలుసు. నన్ను కలిసి అడిగినపుడు బయోపిక్ తీయడానికి అంగీకరించాను’ అని రూప వెల్లడించారు. చిన్ననాటి జీవిత విశేషాలు, పోలీసు అధికారిణి కావటానికి ప్రేరణ కల్పించిన అంశాలు ఇందులో ఉంటాయి. ఈ విషయాలను దర్శకులు తనతో చర్చించారని రూప చెబుతున్నారు.
‘టైటిల్ రోల్ పాత్ర కోసం అనుష్క, నయనతార ఉండాలని భావిస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక పవర్‌ఫుల్ పోలీసు అధికారిణి పాత్ర. అంతేకాదు ఇతర పాత్రలలో నటించే నటీనటులను ఎంపిక చేస్తున్నాం. ఒక నెల రోజుల్లో ఫైనల్ స్క్రిప్ట్ తయారవుతుంది.’

చిత్రాలు.. ఏఎంఆర్ రమేష్ * అనుష్క, నయనతార *ఐపిఎస్ రూప

-ఏఎంఆర్ రమేష్