సబ్ ఫీచర్

ఔరా! ఏమి శిక్ష..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అలా చూడకు! నా గుండెల్లో బాకు పెట్టి తూట్లు పెట్టకూ’’ అని పాడగలడేమో గానీ ఎంత మంచి ప్రియుడైతే మాత్రం- ప్రియురాలు నిజంగా చాకు పెట్టి పొడిచేస్తే- ‘సార్! నా గాళ్‌ఫ్రెండు నన్ను కత్తితో పొడిచేస్తోంది- హెల్ప్ హెల్ప్ అని 999కి (పోలీసులకి) ఆర్తనాదం కొట్టకుండా ఉంటాడా? పాపం! థామస్ ఫెయిర్క్లోప్ తన గాళ్‌ఫ్రెండ్ లివినియా(18) వుడ్వర్డు కోపంతో శివాలెత్తిపోతూ (్థమస్‌ని) నిజం చాకుతో తొడమీద కసాబిసా పొడిచేసింది. ఆమె చేస్తున్న కథాకళి చప్పుళ్ళు అవతల పోలీసులకి వినపడుతున్నాయి ఫోనులో- తాపీగా అడిగాడు పోలీసాయన- డ్రగ్స్‌మీదుందా? అని. అది నల్లమందు అంటే పడి చేస్తుంది సార్ అన్నాడు థామస్ బాధతో మూలుగుతూ. ఐతే అది రొట్టె కోసుకునే చాకు కావడంతో బతికిపోయాడు కానీ గాయం నొప్పెట్టదా? లివినియ మెడికల్ కాలేజీలో సర్జరీ క్లాసులో ఫస్ట్‌ర్యాంకు. పోలీసులు కోర్టులో కేసు పెట్టారు. నల్లమందు అంటే కొంచెం ‘వీకు’ సార్ నేను అని ఒప్పుకుంది ఆ తెల్లపిల్ల సిగ్గులు అయాచితంగా వొలకబోస్తూ. చాలాసేపు విచారించాడు న్యాయమూర్తి జార్జి ప్రింగల్‌గారు. క్రైస్ట్‌చర్చ్ కాలేజీ మొత్తం అక్కడే వున్నారు. తీర్పు వాయిదా అన్నాడు జడ్జీ. ఒక చురుకయిన మెరుగయిన రేపటి సర్జన్ (కత్తిని బాగా వినియోగిస్తుంది అని అర్థమా) అంటూ జడ్జీగారు వ్యాఖ్యానించాడు. మొన్న శనివారం తీర్పుకి కుమారి లివినియా దీనవదన అయి హాజరైంది. ‘‘తప్పదు.. పది నెలలు అంటే మూడు వందల దినములు’’ అన్నాడు జడ్జీగారు సుత్తి పెట్టి కొట్టి మరీ (బల్లమీదేలెండి). కానీ, ఎడ్యుకేషను అంటే ఆయనకీ ఇష్టం, పైగా డాక్టరీ కోర్సు చేస్తోంది లివినియా. కన్నీటి వరద ఆమె ఎర్రని బుగ్గలను తడిపి ముద్ద చేసేస్తున్నాయి. జార్జి ప్రింగల్‌గారు వెంటనే చెప్పాడు. ఈ పదిమాసాల పనిష్‌మెంటుని పద్దెనిమిది నెలలపాటు అమలు కాకుండా ‘వాయిదా’ వేస్తున్నాను అంటూ జూలు విగ్గు సర్దుకుంటూ లేచి గొప్పగా అమ్మాయి వంక చూసి నిష్క్రమించాడు ప్రింగల్ మహాశయుడు. ఆమె లేత బుగ్గలు ఈసారి ఆనంద బాష్పాలతో తడిసి ‘ముద్దైపోయాయి’. థాంక్యూ అన్నది గుండె గొంతులోకి వచ్చినట్లు- మరి ఆమె బాయ్‌ఫ్రెండ్ ఏమన్నాడో? విలేఖర్లు అడగనేదు మరిగంటె అందుకుని మనకీ తెలియదు!
veeraji.pkm@gmail.com

veeraji.pkm@gmail.com