సబ్ ఫీచర్

జమ్మిచెట్టు అసలు కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీపతి పండితయ్య అనే శివభక్తుడు విజయవాడలో నివసించేవాడు. ఆయన దుర్గా మల్లేశ్వర స్వామివార్లను సేవిస్తూ ‘శివతత్త్వ సారము’ అనేగ్రంథాన్ని కూడా రచించాడని పెద్దలు చెప్తారు. ఆ రోజులలో విజయవాడ వేంగీ రాజుల పరిపాలనలో ఉండేది. అనంతపాలుడు అప్పటి ప్రభువని, చరిత్రకారులు చెప్తారు. శ్రీపతి పండితయ్యమీద కొందరు ద్వేషం పెంచుకొని యజ్ఞయాగాది క్రతువుకు ఆయన్ని పిలవడం మానేశారు. అగ్నినే నేత్రంగా ధరించిన మల్లిఖార్జున స్వామిని ప్రార్థించి, మంత్రశక్తితో అగ్నిని తన ఉత్తరీయంలో ఆవాహనం చేసి, మూట కట్టి జమ్మి వృక్షానికి (శమీ వృక్షానికి) వ్రేలాడదీశాడు శ్రీపతి పండితయ్య. జగన్మాత కూడా త్రినేత్రి. మూడవది జ్ఞాననేత్రం. పండితయ్య శాక్తేయుడుకూడా. పండితయ్య మంత్రపూర్వకంగా కట్టడి చేయడంతో ఊళ్లో అగ్నిహోత్రుడు లేడు. వంట వార్పు జరగటం ఆగిపోయింది. యజ్ఞయాగాది క్రతువులు ఆగిపోయినాయి. వర్షాలు లేవు. ఆకలితో ప్రజలు అలమటిస్తున్నారు. అనంత పాల ప్రభువు జరిగింది తెలిసికొన్నాడు. శ్రీపతి పండితయ్య దగ్గరకు ప్రజలందరితో కలిసి వెళ్లి ప్రార్థించాడు. పండితయ్య అగ్నిని ప్రార్థించి అందరికీ అందుబాటులోకి తెచ్చాడు. ఈనాటికీ విజయవాడ పాతబస్తీ, బ్రాహ్మణ వీధిలో మల్లిఖార్జున మెట్లు మొదట్లో జమ్మిదొడ్డిగా పిలువబడుతోంది. ఆనాడు పండితయ్య మూటకట్టిన శమీవృక్షం, దీనిమీద కొన్ని శాసనాలు దొరికినాయని శాస్తజ్ఞ్రులు వెల్లడించారు. ఈనాటికీ ప్రతి సంవత్సరం, విజయదశమినాడు దుర్గామల్లేశ్వరస్వామివార్ల సంయుక్తోపాసన ఈ శమీవృక్షం క్రిందనే జరుగుతుంది.