సబ్ ఫీచర్

ఆధార కార్డు లీలలు చూడరా బాబు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధార్ కార్డే పవిత్ర భారతదేశంలో జీవనాధారం అంటున్నారు ఏలినవారు. ఉత్తరాఖండ్‌లో హరిద్వార్‌కి ఇరవై కిలోమీర్ల దూరంలో వున్న ఒక గ్రామంలో వనగుజ్జర్ల తెగకి చెందిన ఎనిమిది వందల కుటుంబాలు జీవనం వెళ్లబుచ్చుకుంటున్నాయి. వాళ్ల రేషన్ కార్డులు ఇతర గుర్తింపు కాగితాలు తీసుకుని ప్రభుత్వ అధికారులు-మీకు బ్రహ్మాండమయిన గుర్తింపు కార్డులు ఇస్తాము అంటూ ఆధార్ కార్డులు జారీ చేసారు.అహమ్మద్ కార్డులో అతను పుట్టిన రోజు జనవరి ఫస్టు అని వుంది. ‘గ్రేట్’ కదా, కానీ అతని పొరుగు అల్ఫాద్ జన్మదినం కూడా కొత్త సంవత్సరం రోజే-వారేవా! ఎదురింటి ఆయనది కూడా న్యూఇయర్స్ డే బర్త్ డేనే. ఆ వూరిలో అంతా కూడగట్టుకుని జనవరి ఫస్టునే పుట్టినట్టు నమోదయింది-రేషన్ కార్డులో అల్లా లేదు అన్నా-ఎవరూ ఒప్పుకోరు-అధికార్లు. ఆ కార్డు వున్నదే సర్కారు వాక్కు అంటున్నారు. ‘లబో దిబో’ మంటున్నారు అంతేనా? తొంభై ఏండ్ల వృద్ధుడి వయస్సు ఇరవై రెండుగా నమోదయింది. అర్జీలు పంపండి దేఖేనే్గ అంటున్నారుట జిల్లా బాసులు-ఇలాగే గైన్దిఖోటా గ్రామంలో లాగే ఆగ్రా జిల్లాలో వున్న ఓ మూడు గ్రామాల్లో జనాలందరూ జనవరి ఫస్టునే పుట్టారుట. పాపం, ఇదే అవస్థ అహమ్మదాబాద్ దరి గ్రామ వాసులకూ తటస్థ పడ్డది-ఖయ్యుం అనే పెద్దమనిషి చెప్పాడు మా అబ్బాయి 2005లో పుట్టాడు, కాని పదిహేను సంవత్సరాలు వేశారు. ఒక బామ్మగారు తొంభై సంవత్సరాలు కాగా, ఇరవై రెండుగా వేశారు. ఖయ్యుం సాయిబు గారి పిల్లల వయస్సులు అరవై ఒకరికి ఇరవై ఒకరికి పడ్డాయి. వోటరు కార్డు రేషను కార్డు తీసుకుని మరీ ఈ ఘోరం చేసారని జనం గోల. ఏజెంటు ద్వారా జరిగిన పొరపాటు, విచారిస్తాము అని జిల్లా అధికారితాపీగా చెప్పాడు. ఆధార్ ఉంటేనే బతుకు..రేషన్ ఇస్తారు-రెండూ సరిగ్గా కుదరకపోతే విచారణ పూర్తి అయ్యేదాకా బియ్యం గింజలు ఇవ్వరు.

-వీరాజీ