సబ్ ఫీచర్

సాహసమే ఊపిరిగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె వయసు ముప్ఫై ఐదు సంవత్సరాలే. కానీ సూపర్‌బైక్ 800 సిసి బిఎండబ్ల్యు ఆమె ఎక్కింది అంటే మేఘాల మీద ఎగురుతున్నట్టు వుంటుంది. ఆమెనంతా సూపర్ బైక్ రాణి అంటారు. ఆమె పేరు మరాల్ యాజర్లు. సొంత దేశం ఇరాన్. కానీ అక్కడ ఆడాళ్లని మోటార్ సైకిల్ దాకా ఎందుకు మామూలు సైకిలే ఎక్కనివ్వరు. అంచేత, 2004లో మన దేశం వచ్చి పూణెలో సెటిల్ అయింది. ఆమె స్వేచ్ఛగా మొబైక్ స్వారీ చేస్తూనే ఎమ్‌బిఎ ఆనక మార్కెటింగ్లో డాక్టరేట్ చేసింది. ప్రస్తుతం ఆమె ఖండాంతర యాత్రలో ఉంది. ఎట్లా? కేవలం పెద్ద మోటారు సైకిలుమీద మాత్రమే యాత్ర. ఏడు ఖండాల్కి చెందిన 45 దేశాల్ని చుట్టి వస్తోంది. పదివేల మైళ్లు లాగించేసింది అప్పుడే-ప్రస్తుతం ‘పేరు’లో ఉన్నదామె మొబైక్ సాక్షిగా ఆమె డిజైన్ ఎక్స్పర్ట్. పంచశీల్ రియాల్టీ కంపెనీ మార్కెటింగ్ మానేజరు-ఆమె కూడా ఒక మొబైక్ వీరుడున్నాడు. డాక్యుమెంటరీ ఫిలిం తీయడంలో కూడా నిపుణుడు అయిన 42 సంవత్సరాల పంకజ్ త్రివేదీ వున్నాడు-ఎవరి బైక్ వాళ్లదే. కొండలూ సముద్రాలూ బాటలు పేటలు మనకో లెక్కా? అంటూ మయన్మార్, థాయిలాండ్ ఆస్ట్రేలియాల్ని చూసేసారు. ఇక రెండో విడతలో కెనడా, అమెరికా, మెక్సికోలు చుట్టేసి దక్షిణాఫ్రికా వేపు తిరుగుతారు. ఏన్నార్ధం పాటు సాగే ఈ యాత్రలో చివరి ఘట్టంలో-ఇండియా చేరుకునే ముందు-ఇరాన్ దేశం సందర్శించాలని ఆమె ఉద్దేశం. ఇరాన్లో స్ర్తి జాతికి గల ప్రతిపత్తిని మెరుగు పరచాలని, తన సాహస యాత్ర ద్వారా అక్కడి ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించాలని ఆమె కోరిక. ఈమధ్యనే ఇరాన్‌లో సైకిలెక్కి సరదాగా ఫోటోలు దిగిన అతివలు నలుగుర్ని అక్కడి గవర్నమెంటు కటకటాల వెనుక పడేసింది. పారిస్ రోమ్ లాంటి చోట్ల కూడా ఆమె గాజుమీద తన పెయింటింగ్స్‌ని (మంచి పెయింటరు) ప్రదర్శించింది. కానీ ఇరాన్‌లో ఆడపిల్లల సామాజిక ప్రతిపత్తి కోసం తన ఆర్ట్‌నీ మోటార్ బైక్ సాహసాన్ని ఉపయోగించనిదే-తనకి నిద్ర పట్టదని చెప్పింది. సూపర్ మోబిక్ రాణికి జయహో!