సబ్ ఫీచర్

భారతీయ కవితా కోకిల(ప్రపంచ తెలుగు మహాసభలు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరోజిని నాయుడు వంటి బహుముఖ ప్రతిభాశాలిని ఆమె కాలంలో భారతదేశంలో మరొకరు లేరు. ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు, బెంగాలీ, పర్షియన్ భాషలలో ప్రావీణ్యం ఉంది. 12 ఏళ్ళ వయసులోనే మెట్రిక్యులేషన్ పరీక్షలో కృతార్థురాలైంది. అన్నింటికన్నా మహాద్భుత విషయం సర్ కూర్మా వెంకటరెడ్డి నాయుడు ఏలూరులో ఒక మహిళా కళాశాల నెలకొల్పారు. బహుశా దక్షిణాదిలోనే ఇది తొలిసారి నెలకొన్న మహిళా కళాశాల కావచ్చునేమో! ఆంధ్రదేశంలో నిస్సందేహంగా ఇది మహిళా విద్యా వికాస తొలి కళాశాల. దీనికి ప్రిన్సిపాల్‌గా రెడ్డి నాయుడుగారు ఎవరిని తెచ్చారో తెలుసా? ప్రాచ్య కోకిల కవయిత్రీ భూషణం సరోజినీ నాయుడును.

సరోజినీ నాయుడును తలచుకోగానే భారతీయ కవితాత్మ పులకిస్తుంది. అది విశ్వవిహారం చేస్తుంది. ఆమె సమకాలీనులలో మహిళగా, కవయిత్రిగా ఆమె సాధించిన సామాజిక, సారస్వత, స్వాతంత్య్రోద్యమ ఘనకీర్తి ఒక్క భారతదేశంలోనే కాదు, ఎంతో నాగరికులమని చెప్పుకొనే ఇతర దేశాలలోనూ దృష్టించలేము. ఆమె తండ్రి అఘోరనాథ చటోపాధ్యాయ 20వ శతాబ్ది భారతీయ విజ్ఞాన శాస్తవ్రేత్తలలో ప్రముఖుడు. ఆమెతల్లి వరదా సుందరీదేవి. ఈ కుటుంబం వంగ దేశం నుంచి తెలంగాణాకు వచ్చింది. తెలంగాణలో ఆధునిక విద్యావ్యాప్తికి అప్పటి నిజాం నవాబు అఘోరనాథ్ చటోపాధ్యాయను ఆహ్వానించి నిజాం కాలేజీని ఆయన అధీనం చేశాడని చెపుతారు.
ఒక విధంగా అఘోరనాధ్ కుటుంబం హైదరాబాద్ రావటం భారతదేశ నవీన విజ్ఞాన వ్యాప్తికి ప్రతిబంధకంగా పరిణమించిందనే చెప్పాలి. అఘోరనాథ్ చటోపాధ్యాయ 26 ఏళ్ళ వయసుకే ఎడింబరో విశ్వవిద్యాలయం నుంచి డి.ఎస్.సి పరిశోధన పట్టా పొందారనీ (రసాయన శాస్త్రం), ఆయన విజ్ఞాన శాస్త్రానే్న అంటిపెట్టుకొని ఉన్నట్లైతే ‘నోబుల్ ప్రైజ్’ పరిగణార్హుడై ఉండేవాడనీ ఆచార్య ప్రఫుల్లచంద్ర రే (వీరు ఆధునిక భారతీయ రసాయన శాస్త్రంలో గణనీయమైన కృషి చేసినవారు. హిందూ రసాయన శాస్త్ర పురావైభవం, సమకాలిక మేధావిత గూర్చి 2 సంపుటాలు గ్రంథ రచన చేశారు.
లైఫ్ అండ్ ఎక్స్‌పీరియెనె్సస్ ఆఫ్ ఎ బెంగాలీ కెమిస్ట్ అనేది ఆయన స్వీయ చరిత్ర. హిందూ రసాయన శాస్త్ర రచనలో ఒక పురాతన ప్రామాణిక గ్రంథం ఉనికిని గూర్చి విశ్వవ్యాప్త గ్రంథాలయ పుస్తక సూచీలను (కేటలాగ్) గవేషించినా ఆచూకీ దొరకలేదు కాని చివరకు కాశ్మీరులో పురా పుస్తక తాళపత్ర భాండాగార సూచీలో అది లభ్యమైనట్టు సుప్రసిద్ధ్భారత దేశ చరిత్రకారుడు జదునాథ సర్కార్ ముస్లిమ్ పాలనలో కాశ్మీర ప్రజల స్థితిగతులు అనే రచనలో పేర్కొన్నాడు. సర్కార్ మహాశయుడి దృష్టి ఏమంటే ఒకప్పుడు కాశ్మీరు హిందూ పురా వైభవ శాస్త్రాలకూ, కళలకూ కాణాచిగా ఉండేదని చెప్పటం. ముష్కర జాతుల చొరబాటువల్ల ఆ వైభవం నశించిపోయిందని చెప్పారు జదునాథ సర్కార్. హైదరాబాద్‌లో అఘోరనాథ చటోపాధ్యాయ నివాసం ఉన్న రోజులలో మన పింగళి వెంకయ్యగారు బందరు నుంచి వచ్చి చటోపాధ్యాయ అతిథిగా గడిపేవారనీ, వారిద్దరికీ రసవాదం (పరశువేది విద్య) పట్ల గొప్ప ఆసక్తి ఉండేదనీ, చర్చలు జరిపేవారనీ పింగళి వెంకయ్య గారి కుమారుడు పరశురామయ్య తండ్రిగారి జీవితచరిత్రలో చెప్పారు.
కవితా కోకిల సరోజినీ నాయుడును గూర్చి చెప్పటానికి ఇంత ఉపోద్ఘాతం అవసరం లేదేమో కాని ఆమె కుటుంబ వారసత్వం, విద్యాతృష్ణ, ఆనువంశిక మేధావిత్వం తెలుసుకోవడానికి ఈ పూర్వరంగం బాగా సహాయపడుతుంది. అఘోరనాథ్ చటోపాధ్యయ జీవితకాలం 1850-1915లో అప్పటి తూర్పు బెంగాల్ బ్రిహ్మ గ్రామం నుంచి వెళ్లి కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో చదివి పట్ట్భద్రుడై ఎడింబరో విశ్వవిద్యాలయంలో డి.ఎస్.సి పొంది ఆయన ఆరవ నిజాం కాలంలోనే హైదరాబాద్ చేరారు. తెలంగాణలో ఉన్నత విద్యావ్యాప్తి కోసం పాఠశాలలు నడిపారు. అప్పట్లో నిజాం కాలేజీ మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేసేది.
ఈ సరోజిని నాయుడు వంటి బహుముఖ ప్రతిభాశాలిని ఆమె కాలంలో భారతదేశంలో మరొకరు లేరు. 1879 ఫిబ్రవరి 13 ఆమె హైదరాబాద్‌లో జన్మించారు. 1949 మార్చి 2 ఆమె లక్నోలో స్వర్గస్థురాలైంది. ఆమె అఖిల భారత కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన మొట్టమొదటి మహిళ. ఈ మహాసభ 1925లో కాన్పూరులో జరిగింది. ఈ తల్లికి ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు, బెంగాలీ, పర్షియన్ భాషలలో ప్రావీణ్యం ఉంది. 12 ఏళ్ళ వయసులోనే మెట్రిక్యులేషన్ పరీక్షలో కృతార్థురాలైంది. 15 ఏళ్ళ వయసులోనే హైదరాబాద్‌లో ఆ రోజుల్లో గొప్ప వైద్యుడైన ముత్యాల గోవింద రాజులుగారి ప్రేమలో పడ్డది. 16 ఏళ్ళ వయసున చదువుకోవటానికి ఇంగ్లండు కేంబ్రిడ్జి చేరింది. ‘ది గోల్డెన్ త్రెషోల్డ్’ (1908), ది బర్డ్ ఆఫ్ టైమ్ (1913), బ్రోకెన్ వింగ్ (1912) ఆమె కవితా సంపుటాలు. ఇంగ్లండ్‌లో గొప్ప సాహిత్యవేత్త, కవీ ఎడ్మండ్ గేసెస్సీ సరోజినీ నాయుడు కవితా రచనలను ఎంతగానో ప్రశంసించాడు.
1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఆమె జైలుపాలైంది. మహాత్మాగాంధీ పట్ల చాలా చనువు చూపుతూ, ఆయనను హాస్యం చేయగల దగ్గరతనం ఉండేది ఈమెకు. స్వాతంత్య్రానంతరం ఈమె ఉత్తరప్రదేశ్ వంటి విశాల రాష్ట్రానికి గవర్నర్ పదవి నిర్వహిచింది. ఈమె సంతానం జయసూర్య, పద్మజ, రణధీర్, లీలామణి.
సరోజిని నాయుడు ప్రేమ వివాహం ఆమోదించి, కులాంతర, రాష్ట్రాంతర వివాహం జరపటానికి ఆమె తండ్రి అఘోరనాథ్ చటోపాధ్యాయ తటపటాయించగా, వెనక్కుతగ్గగా, మద్రాసులో వీరేశలింగం పంతులు తాను తండ్రి స్థానీయుడై బ్రహ్మసమాజ వివాహ విధిపూర్వకంగా ఈమె వివాహం జరిపించాడు. ఆ తరువాత ఒకసారి విరేశలింగం, నాగపూర్ ప్రయాణంలో హైదరాబాద్‌లో దిగి సరోజిని బంగారు వాకిలి గడప ఇంటిలో ఆమెను చూడటానికి వచ్చాడు. అపుడు సరోజనమ్మ తన పిల్లలను పిలిచి తాతగారికి నమస్కారాలు చెప్పటానికి రండర్రా, రండి అని తన పట్ల ప్రేమాభిమాన గౌరవాదరాలు చూపినట్లు వీరేశలింగం స్వీయ చరిత్రలో రాసుకున్నాడు. సరోజనమ్మ తెలుగు దేశపు కోడలన్నమాట.
ఒకసారి చిలకమర్తి నరసింహ మహామనీషి శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంలో సమ్మాన సభకు రాగా సరోజినీ నాయుడు చిలకమర్తిని గొప్ప శాలువా కప్పి సత్కరించినట్టు చిలకమర్తి స్వీయ చరిత్రలో ఉంది. ఇట్లా ఆమె తెలుగువారి అభిమాన పుత్రిక, గారాబాల కోడలు అయింది. అన్నింటికన్నా మహాద్భుత విషయం సర్ కూర్మా వెంకటరెడ్డి నాయుడు తన జస్టిస్ పార్టీ రాజకీయాలు, గవర్నర్ పదవి చాలించిన తరువాత ఏలూరులో స్థిరపడ్డారు. అక్కడ ఒక మహిళా కళాశాల నెలకొల్పారు. బహుశా దక్షిణాదిలోనే ఇది తొలిసారి నెలకొన్న మహిళా కళాశాల కావచ్చునేమో! ఆంధ్రదేశంలో నిస్సందేహంగా ఇది మహిళా విద్యా వికాస తొలి కళాశాల. దీనికి ప్రిన్సిపాల్‌గా రెడ్డి నాయుడుగారు ఎవరిని తెచ్చారో తెలుసా? ప్రాచ్య కోకిల కవయిత్రీ భూషణం సరోజినీ నాయుడును. ఈ విషయం శ్రీమతి కాశీచయనుల వెంకట మహాలక్ష్మిగారి ‘గౌతమీగంగ’ అనే నవలారూప స్వీయ చరిత్రలో ఉంది (పుట 126-ప్రచురణ 2011). ఒకనాటి బ్రాహ్మణ కుటుంబాల శిష్టాచార సంపత్తి, యజ్ఞయాగాది వైభవ సంస్కారం తన స్వీయ చరిత్రతో జోడిస్తూ నవలా రూపంగా బహు ఆకర్షణీయం, చదువుతున్నపుడు చవులుబుట్టేలా రచించారు ఈ ప్రతిభావంతురాలు. ఏ దినపత్రికలోనైనా సీరియస్‌గా ప్రచురితం కావలసిన రచన ఇది. బహు రుచికరమైన శైలి. శ్రీమతి సరోజినీ నాయుడు ఏలూరులో ఉన్న రోజులలో ఒక ధనవంతుని ఇంట వివాహ సందర్భంగా ‘్భమాకలాపం’ అనే నృత్య సంగీత వేదాంత యక్షగానం ప్రదర్శితమైనట్లూ, దేవదాసీలు ప్రదర్శించినట్లూ సరోజినీ నాయుడు ఈ ప్రదర్శనను చూసి హర్షాతిరేకంతో పరవశించినట్లు మా బెంగాలీల ప్రతిభ మీ ఆంధ్రుల ప్రతిభతో పోటీపడుతుంది అని సరోజినీ నాయుడు శ్లాఘించినట్లూ స్వీయ చరిత్ర రచయిత్రి వేంకట మహాలక్ష్మిగారు బహు ఉత్తేజకరంగా ఈ సంఘటన చిత్రించారు. తరువాత కాలంలో బహుశా స్వాతంత్రోద్యమ సంరంభం, తన రాజకీయ జీవిత ప్రస్థానంలో సరోజనమ్మ ఏలూరు వదలిపెట్టి ఉంటారు.

- డా. అక్కిరాజు రమాపతిరావు