సబ్ ఫీచర్

నేను-నాదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశభక్తిని సున్నితంగా తెలియజేసే సంఘటన ఇది. స్వామి రామతీర్థ జపాన్ దేశంలో రైలులో పర్యటిస్తున్నారు. ఆయనకు ఆకలిగా ఉంది. రైలు స్టేషన్‌లో ఆగింది. పండ్లు కోసం చూస్తే ఎక్కడా కనిపించలేదు. మరో రెండు, మూడు స్టేషన్లలోనూ రైలు ఆగినా ఎక్కడా పండ్లు కనిపించలేదు. ఇది గమనించిన జపాన్ దేశ ప్రయాణీకుడు ఒక స్టేషన్‌లో బండి ఆగీ ఆగకముందే రివ్వున స్టేషన్ బయటకు పరుగెత్తుకుంటూ వెళ్లి పండ్లు తీసుకువచ్చి స్వామి రామతీర్థకు ఇచ్చాడు. స్వామి రామతీర్థ డబ్బులు ఇవ్వబోతే అతను తీసుకోలేదు. పైగా ఇలా అన్నాడు. ‘అయ్యా!మీరు మీ దేశం తిరిగి వెళ్లినపుడు జపాన్‌లో కనీసం పండ్లు కూడా దొరకలేదని అనకుండా ఉంటే చాలు. అదే మీరు నాకు ఇచ్చే డబ్బుతో సమానం’ అని బదులిచ్చాడు. ఇది ఆ దేశస్థుని దేశభక్తి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేస్తూ జపాన్ యువకుడి దేశభక్తిని కొనియాడారు. అదే పనిగా దేశాన్ని విమర్శించేవాళ్లకు ఇది చెంపపెట్టు అవుతుంది కదా!

‘‘మీ మనసును ప్రతిక్షణం ఉత్తమమైన ఆలోచనలతో, అత్యున్నతమైన ఆదర్శాలతో నింపివేయండి. వీటి ఫలితంగా మీరు ఉన్నతమైన కార్యాలను సాధించగలరు.’’ అని స్వామి వివేకానంద చెబుతారు. ఆలోచనలు ఉన్నతమైనవి అయితే మనం చేసే పనులు కూడా ఉన్నతంగానే ఉంటాయి. ‘దేశం నాకేమి చేసిందని కాదు. దేశం కోసం నువ్వేమి చేశావన్నదే ముఖ్యం’ అని వక్తృత్వ పోటీల్లో బహుమతులు పొందేందుకు పిల్లల చేత చెప్పిస్తాం. కాని ఈ భరతమాత బిడ్డల్లోనే ఎంతో వ్యత్యాసం. కొందరు ఉన్నతంగా ఆలోచించి దేశసేవకు అంకితమవుతారు. మరికొందరు దేశం కోసం ఏమి చేయాలో తెలియక అదేపనిగా విమర్శించటానికి కంకణబద్ధులవుతారు. ఇలా విమర్శిస్తే తమ మేధావితనం ఇమిడి ఉందని ఆనందపడిపోతుంటారు. ఈ వ్యత్యాసానికి కారణం మన ఆలోచనా ధోరణే. ‘నేను-నావాళ్లు’ అనే పరిమితి నుండి బయటపడి ‘నేను-నాదేశం’ అనే ఆలోచన (్భవన) ఉంటే దేశాన్ని నిజంగానే ప్రేమించగలం. నిత్యజీవితంలో మనదేశం కోసం పెద్ద ప్రణాళికలు రూపొందించక్కర్లేదు. పాఠశాలల్లో రోజూ విద్యార్థులు చేసే ప్రతిజ్ఞ ‘్భరతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు’ అన్నది జ్ఞాపకం ఉంచుకుని ఆచరించేటట్లు పసిప్రాయం నుంచే చేస్తే చాలు ప్రతి ఒక్కరిలోనూ మార్పు వస్తుంది. మార్పు మంచిదే అన్నట్లు ఇది దేశంలోనే మార్పు రావటానికి నాందీ ప్రస్థావన అవుతుందనే విషయం విస్మరిస్తున్నాం. ఆగస్టు15, జనవరి 26న తూతూమంత్రంగా జరిపే జెండావందనం మన ‘మొక్కుబడి’కి చక్కటి ఉదాహరణ. అమితోత్సాహంతో జరుపుకోవాల్సిన ఈ జాతీయ పండుగలను ఇంట్లో ఉండి సొంత పనులు చేసుకునేవారు ఎంతోమంది. ఇలాంటి జాతీయ పండుగలు ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం నిధులు సైతం మంజూరు చేస్తుంది.
ఓ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏటా జరపాల్సిన ఈ జాతీయ పండుగలను ఆ స్కూలు ప్రధానోపాధ్యాయుడు నిర్వహించకుండానే ఘనంగ చేసినట్లు రిపోర్టు పంపేసి నిధులు మింగేసేవాడు. ఇది కొన్నాళ్లకు బయటపడి అ ప్రధానోపాధ్యాయుడ్ని పై అధికారులు చివాట్లు వేయటం జరిగింది అనుకోండి. ఇలాంటి ఉపాధ్యాయుల వల్ల పసి మనసుల్లో పడాల్సిన దేశభక్తి బీజాలు ఎలా పడతాయి? ఇలాంటి ప్రవర్తనకు కారణం కేవలం స్వార్థం. ఈ పరిస్థితి విషమించినప్పుడు జీవితం సహజత్వాన్ని కోల్పోయి, కేవలం మొక్కుబడిగా తయారవుతుంది. దేశభక్తి కూడా ఇదే కోవలోకి వచ్చేసింది. స్వామి వివేకానంద అన్నట్లు మన దేశభక్తిని మాటల దేశభక్తి (జజఔ ఔ్ఘఆజ్యఆజఒౄ) గా కాకుండా చేతలతో చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన ఆలోచనల నుంచే పుట్టే ఈ విమర్శలే మనం చేసే పనుల్లో ప్రస్ఫుటమవ్వటమే కాదు ఈ రోజుల్లో తీవ్రవాదం, అశాంతి తలెత్తటానికి కారణమవుతున్నాయి.
ఒకసారి ప్రముఖ భారత న్యాయవాది నానీ ఫాల్కీవాలా జపాన్ వెళ్లినపుడు ఆ దేశమంత్రిని ఇలా ప్రశ్నించారు. ‘్భరతదేశంలో కావలసిన వనరులున్నాయి. భారతీయులు తెలివైనవారు. అయినప్పటికీ భారతదేశం జపాన్‌లాగా ఎందుకు అభివృద్ధిచెందటం లేదని ప్రశ్నించారు. అందుకు జపాన్ మంత్రి జపాన్‌లో ఒక మిలియన్ ‘పౌరులు’ ఉన్నారు. భారతదేశంలో ఆరువందల మిలియన్ల ‘వ్యక్తులు’ ఉన్నారు అని తన అభిప్రాయాన్ని చెప్పారు. ‘దేశం మనకు ఏమి చేసింది’ అని తలచేవారు వ్యక్తులు. ‘దేశానికి మనం ఏం చేసాం’అని ప్రశ్నించుకునేవారు పౌరులు అని ఆ దేశ మంత్రి చెప్పిన వాస్తవం. నేను-నావాళ్లు అనే స్వార్థపు అలోచనలు చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో పోస్తే పరిస్థితి ఇలానే ఉంటుందని చెప్పకనే చెబుతుంది.ఇతరుల కోసం ఆలోచించేవారు దేశానికి సేవచేసే పౌరులు అని భావించినప్పుడే ప్రతి ఒక్కరూ మంచి పౌరునిగా మారతాడు. దేశం అగ్రస్థానానికి చేరుకుంటుంది.

-హరిచందన