సబ్ ఫీచర్

మణిపురి మణిపూస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పురుషులే పోటీపడే వెయిట్ లిఫ్టింగ్‌లో మహిళలు కూడా రాణించగలరు అని నిరూపించుకుంది. అంతేకాదు అందులో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. మహిళా వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ చాంపియన్ షిప్ పోటీల్లో బంగారు పతకాన్ని సాధించి భారత పతకాన్ని వినువీధుల్లో రెపరెపలాడించిన మణిపురి మణిపూస మిరాబాయి చాను. రెండు దశాబ్దాల తరువాత ప్రపంచ చాంపియన్ షిప్ సాధించారు. రియో ఒలింపిక్స్‌లో పతకాన్ని తృటిలో పోగొట్టుకున్నా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగి కామన్ వెల్త్ పోటీల్లో భారత్‌కు అర్హత సాధించిపెట్టారు. ప్రపంచ మహిళా వెయింట్ లిఫ్టింగ్‌లో బంగారు పతకాన్ని సాధించిన తొలి క్రీడాకారిణి. పదకొండేళ్ల ప్రాయంలోనే బంగారు పతకాన్ని సాధించిన మీరాబాయి చానుకు కుంజురాణి ఆదర్శం. ఆమె శిక్షణలో రాటుదేలింది. తను గురువును ఆదర్శంగా ముందుకు సాగుతున్న మీరాబాయి రైల్వేశాఖలో పనిచేస్తున్నారు.