సబ్ ఫీచర్

కోరి తిందాం..కాకర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా? కాకరకాయను కూరగాయ అని చాలా ప్రాంతాల్లో అనరు. దీన్ని పండుగానే భావిస్తారు. అందుకే దీని జ్యూస్‌ను పండ్ల రసం వలే తీసుకుంటారు. ఈ కాకార కాయ రసంపై పలు ప్రయోగాలు జరిగాయి. నోట్లో పెట్టుకుంటే చాలు ఛీ చేదు అని దూరంగా నెట్టేస్తాం. కాని ఈ చేదే ఎన్నో ఔషాధాల సమ్మేళనం అని వైద్యులు నొక్కి వక్కాణిస్తున్నారు. ఎన్నో ఔషధ ప్రయోజనాలు దాగి ఉన్న కాకరకాయను పండు వలే సేవించమని సలహా ఇస్తున్నారు. కాకరకాయలో ఇనుము, మెగ్నీషియం, పోటాషియం, విటమిన్ సి వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీని రసంలో సైతం ఆహారాన్ని జీర్ణం చేసే ఫైబర్ ఉంది. ఒక్క కాకర కాయలో బచ్చలికూరలో ఉండే కాల్షియం, ఒక అరటి పండులో ఉండే పొటాషియం ఉంది. కాకార కాయ రసం చేదుగా ఉండకుండా ఉండాలంటే తేనె లేదా బెల్లం కలపండి. లేదా ఆపిల్ లేదా బెర్రీ వంటి పండ్లను కూడా జతచేయవచ్చు. ఇంకా చేదు తగ్గాలంటే కొంచెం నిమ్మరసం కూడా కలుపుకుని తాగితే మంచిది. నల్ల మిరియాలు, అల్లం చిటెకెడు కలుపుకుంటే మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాకారకాయ రసం సేవించటం వల్ల ఒనగూడే ప్రయోజనాలను తెలుసుకుందాం..
చక్కెర స్థాయిలను నిర్ణయించటంలో దోహదం
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం 382 మిలియన్ల మంది ప్రపంచవ్యాప్తంగా మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. కాకరకాయ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్‌గా ఉపయోగపడుతుంది. కాకరకాయ రసం తాగటం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎలాంటి నియంత్రణలో ఉంటుందో క్లినికల్ ట్రయల్ నిర్వహించారు. నాలుగు వారాల పరిశీలన తరువాత రెండు వేల మిల్లీ గ్రాముల రక్తంలో గ్లూకోజ్ స్థాయిని గణనీయంగా తగ్గిస్తే టైప్ 2 మధుమేహంతో బాధపడుతున్న రోగులలో మరింత గణనీయంగా తగ్గింది. కాకరకాయ రసం టైప్ 1 మధుమేహంతో బాధపడే రోగులకు వారి రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని గణనీయంగా తగ్గించినట్లు సహయపడింది. జర్నల్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ బయాలజీలో ప్రచురితమైన మరొక నివేదికలోనూ ఇదే విషయాన్ని తేటతెల్లం చేసింది. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు రోజువారీ చేదు కాకరకాయ రసాన్ని వినియోగిస్తే వైద్యుల పర్యవేక్షణలో ఈ మందుల మోతాదును వాడాల్సి ఉంటుంది.
చెడు కొవ్వు స్థాయిని తగ్గిస్తుంది..
కాకర రసం శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించటంలో దోహదపడుతుందని పౌష్టికాహార నిపుణులు డాక్టర్ అంజు సూద్ తెలియజేస్తున్నారు. గుండెపోటును, రక్తపోటును కూడా గణనీయంగా తగ్గిస్తుంది. శరీరంలోని అధిక సోడియంను గ్రహిస్తున్న పోటాషియంలో ఇది సమృద్ధిగా ఉన్నందున ఇది శరీర రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. కాకర కాయ రసంలో ఇనుము, ఫోలిక్ ఆమ్లం సమృద్ధిగా ఉండటం వల్ల స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించి హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు ప్రకాశవంతంగా..
కాకర కాయ గుజ్జులో విటమిన్ ఏ, సి తో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇది అకాల చర్మ వృద్ధాప్యాన్ని నిరోధిస్తుంది. శరీర ముడతలను పోగొడుతోంది. చర్మ సంబంధమైన రోగాలను తగ్గిస్తుంది. అలాగే హానికరమైన యు,వి కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుందని న్యూఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ సిమ్రాన్ సైనీ సూచిస్తున్నారు. విటమిన్ ఏ, సి, జింక్ చర్మానికి మెరుపును అందిస్తాయి. జుట్టుకు కాకర కాయ గుజ్జును రాసుకోవటం వల్ల నిగనిగలాడుతూ మెరుస్తుంది. చుండ్రు నివారణకు దోహదం చేస్తుంది. తల దురదను తగ్గిస్తుంది. ఈ రసం ఓ విధంగా కండీషనర్‌గా ఉపకరిస్తోంది. కాకర కాయ రసానికి పెరుగు, జీలకర్ర, స్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్ వలే తయారు చేసుకుని రాసుకుని 30 నిమిషాలు తలస్నానం చేస్తే కాంతివంతంగా ఉంటుందని డాక్టర్ సైని చెబుతున్నారు.
కాలేయాన్ని శుభ్రం చేస్తుంది..
మద్యం సేవించేవారు ఈ కాకార కాయ రసాన్ని సేవిస్తే కాలేయంలో పేరుకుపోయిన ఆల్కాహాల్‌ను పూర్తిగా శుభ్రం చేస్తుంది. కాలేయ సమస్యలను నివారిస్తుంది. కాలేయ ఎంజైమ్ల యాంటీ ఆక్సిడెంట్ పటిష్టత ద్వారా కాలేయ వైఫల్య సమస్యలను అధిగమించవచ్చు. మూత్రాశయం పనితీరు కూడా బాగుంటుంది.
బరువును తగ్గిస్తుంది..
కొవ్వు కణాల తొలగించటంలో చక్కగా ఉపకరిస్తుంది. కాకారకాయలో కొవ్వు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఈ రసాన్ని సేవిస్తే సులభంగా బరువు తగ్గవచ్చు. కొత్తగా కొవ్వు కణాలు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. ఉబకాయంతో బాధపడేవారికి మంచి చికిత్స.
రోగ నిరోధక వ్యవస్థ మెరుగు..
శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలెర్జీలు దరి చేరవు. వైరస్, బాక్టీరియాపై పోరాడుతోంది. ఇందులోని అనామ్లజనకాలు అనారోగ్యానికి వ్యతిరేకంగా శక్తివంతమైన రక్షణ కేంద్రాలుగా పనిచేస్తాయి. వివిధ రకాలైన క్యాన్సర్లకు కారణమయ్యే కణితిలు ఏర్పడకుండా పనిచేస్తుంది. ముఖ్యంగా మహిళలో వచ్చే గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కంటికి మేలు.. కంటి శుక్లం, దృష్టి లోపం సమస్యల నివారిణిగా పనిచేస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ ఏ కళ్ల ఆరోగ్యానికి తోడ్పడుతుంది.