సబ్ ఫీచర్

కాలు జారితే తీసుకోవచ్చుకానీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి వ్యక్తికీ, ప్రతి కుటుంబానికీ, ప్రతి ప్రదేశానికీ అందరికీ బహిరంగంగా తెలిసిన విషయాలతోపాటు.. ఎవరికీ తెలియకూడని వ్యక్తిగత, కుటుంబపర విషయాలు కూడా కొన్ని ఉంటాయి. మానవ సంబంధాలకు, మానసిక బలహీనతలకు, ప్రవర్తనా లోపాలకు ఇలా అనేక కారణాలకు సంబంధించిన ఆ రహస్యాలు మనిషి మనసులో అంతర్గతంగా.. ఇంటి గుట్టులో భద్రంగా ఉంటేనే ఆ మనిషి పరువు ప్రతిష్ఠలు, కుటుంబ గౌరవం సమాజంలో పదిలంగా ఉంటాయి. వెనకటి కాలంలో ఈ విషయాన్ని గుర్తించి.. విలువలకు ప్రాధాన్యం ఇచ్చారు గనుకనే ‘కాలు జారినా తీసుకోవచ్చుగానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేం’- ‘ఇంటి గుట్టు ఈశ్వరుకే ఎరుక’ వంటి సామెతలు పుట్టాయి. మనిషి విలువ, గౌరవం, ఆత్మాభిమానం, సామాజిక కట్టుబాట్లు మటుమాయమై వాటిస్థానంలో విచ్చలవిడితనం, అసభ్యత, మితిమీరిన స్వేచ్ఛ, ఎవరేమనుకుంటే నాకేంటన్న మొండివైఖరి చోటుచేసుకుని గుట్టుగా బ్రతకాల్సిన మనుషులు రోడ్డుమీద పడుతున్నారు. ‘లోగుట్టు పెరుమాళ్లకెరుక’ అన్న సామెత చందాన సాగాల్సిన సంసారాలు ‘అంతా బట్టబయలు’ చేసుకుని నలుగురి నోళ్లలో నానుతున్నాయి. ఆధునికత పేరిట యువత తొక్కుతున్న పెడదారులు తొక్కుతోంది. నలుగురిలో గొప్పగా ఉండాల్సిన వారునలుగురిలో అభాసుపాలు అవుతున్నారు. మనసులో ఓ మధురభావనగా రెండు హృదయాలకే పరిమితం కావాల్సిన ప్రేమ నలుగురినోళ్లల్లో పడి అపవిత్ర ప్రేమలాగా కళంకం తెచ్చేదిలా తయారవుతున్నది. ‘ఆలుమగల కలహాలు అద్దంమీద ఆవగింజలు’ ఉండాల్సింది పోయ కోర్టుగుమ్మాలకు వేలాడుతున్నాయ. మావిడాకులు కట్టుకోవాల్సిన గుమ్మాలు విడాకులకు ఆహ్వానాలు పలుకేలా తయారవుతున్నాయ. ఈ పద్ధతిని మార్చుకుంటే ఇద్దరు మధ్య అనుబంధం వారికే పరిమితమైతే దాంపత్యమైనా, ప్రేమైనా నాలుగుకాలాల పాటు వర్థిల్లుతుంది. *