సబ్ ఫీచర్

నృత్యంతో గీతారాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాణులన్నింటికీ ప్రకృతే తల్లి. తండ్రి శ్రీమన్నారాయణుడు. ఇది ఆధ్యాత్మిక వాదులుచెప్పేది. అందరికీ అర్థమయ్యేభాష కాదిది. కానీ సత్వరజస్తమోగుణాలను మనసులో బంధించి ఆత్మస్వరూపుడగు పరమాత్మ పైన మనసును లగ్నం చేసి అభినయంలో ఈ భావాన్ని ప్రదర్శిస్తే ఆధ్యాత్మి క వాదులే కాదు సర్వ సామాన్య ప్రజానీకము తలలూపుతుంది లలితకళల్లో సరళంగా ఏ విషయాన్నైనా సరళసుబోధకంగా ప్రదర్శించి కొరకుడు పడని విషయాలను సైతం అవలీలగా అర్థం చేసే ప్రజ్ఞ కేవలం లలితకళల్లోని నాట్యానికుంది.
గీతను ఆచరించమని అంటుంటారు. అందులోని పారమార్థిక తత్వాన్ని ప్రచారం చేయాలనే తలంపుతో నృత్యాభినయాన్ని ప్రయోగాత్మకంగా రూపకల్పన చేశారు. దాన్ని శ్రీమతి ఉషారాణిగారు అభినయించి అందరి ప్రశంసలు పొందారు. ఈమె కేవలం నృత్యకారిణినే కాక సాహిత్యంలో కూడా మంచి అభిరుచి కలది. భగవద్గీత- నృత్యరీతి అనే గ్రంథం రచించి నృత్యరూపకంగా కూడా అభినయించారు. ఈభగవద్గీతలోని ప్రతిశ్లోకాన్ని చూడగానే అర్థమయ్యేవిధంగా నృత్యాన్ని రూపకల్పన చేశారు.
తన జీవన యాత్రలో కేంద్రప్రభుత్వ హూమన్ రిసోర్స్ శాఖ ద్వారా స్కాలర్‌షిప్ , ప్రభుత్వ అవార్డులు, రివార్డులు ఉష అందుకున్నారు. అంతే కాక తెలుగులో ఎమ్.ఎ చేసి టీచర్ ట్రైనింగ్‌లోకూడా పోస్టుగ్రాడ్యుయేషన్ చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కూచిపూడి నృత్యంలో పి.హెచ్‌డి పొందారు. దూరదర్శన్ లో ‘ఎ’గ్రేడ్ కళాకారిణిగా గుర్తింపు పొందారు.
అటు ఆధ్యాత్మిక ఉంటే ప్రజల్లో మంచి ప్రవర్తన కలిగి ఉంటారని ధనుర్మాస ప్రత్యేక కార్యక్రమాలు నృత్యరూపకంగా తయారు చేసి తన తోటి కళాకారుణలతో కూడి ప్రదర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం మహతి ఆడిటోరియంలోను ఇంకా ఇతరత్రా ఆడిటోరియమ్స్ లో భజగోవిందం, గోదాకల్యాణం, అష్టలక్ష్మీవైభవం, శ్రీసాయిబాబా తదితర నృత్యనాటికలకు నృత్య దర్శకత్వం వహించారు.
ఈ నృత్యాభినయాలను కేవలం మనదేశంలోనే కాక వాషింగ్‌టన్, న్యూజెర్సి, న్యూయార్క్‌లల్లో కూడా నృత్యప్రదర్శనలిచ్చి ఖండాతర ఖ్యాతిని తెచ్చుకున్నారు. ఇలా తాను, తన తోటి కళాకారుణులే కాక వర్థమాన కళాకారులకు కూడా తగినంత ప్రోత్సాహం ఇవ్వాలని ఉష తనకు వీలుచిక్కినప్పుడల్లా ఆసక్తి ఉన్నవారికి నాట్యం లోని మెళుకువలను నేర్పిస్తుంటారు. ఇలా కళామతల్లి సేవ చేసుకొంటూ తన జీవితాన్ని మంచి మార్గం పయనింపచేయాలనే తలంపుతనకు ఉన్నట్టు చెప్తారు

- మురళీధర్